జగన్ గెలుపును జెడి లక్ష్మీనారాయణ అడ్డుకోగలరా. ఆయన ఏ పార్టీలో చేరినా అంతిమలక్ష్యం టిడిపికి ప్రయోజనం కలిగించటమేనా. జెడి లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరాలో నిర్ణయం జరిగిపోయిందా. ఆయనకు ఆ పార్టీలో ఇచ్చిన హామీ ఏంటి. ఏపిలో రాజకీయ సమీరణాలు మారిపోతున్నాయి. మహారాష్ట్రలో పనిచేస్తున్న లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసారు. ఆయన ఏపి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే మిగిలి ఉంది. ఇప్పటికే ఆయన పాత్ర ఏంటనే దాని పై రాజకీ య వర్గాల్లో చర్చ సాగుతోంది. లక్ష్మీనారాయణ బిజెపి అధినేత అమిత్షతో సమావేశం అయినట్లు స్పష్టమైన సమాచా రం అయితే ,అది టిడిపి, బిజెపి పొత్తు ఉన్న సమయంలో. కానీ, ఇప్పుడు టిడిపి,బిజెపి మధ్య పొత్తు తెగిపోయింది. జెడి లక్ష్మీనారాయన 2014 ఎన్నికల్లోనే టిడిపి తరపున ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి.
అయితే, అప్పటికే జగన్ పై కేసులు విచారిస్తున్న అధికారిగా జెడి టిడిపి లో చేరితే, అది రాజకీయంగా వైసిపికి కలిసొస్తుందనే అభిప్రాయంతో టిడిపి నేతలు ఆ ఎన్నికల్లో వద్దని భవిష్యత్‌లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక, ప్రస్తుతం అనంతపురంలోని ఎస్కేయు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసారు. ఆయన లక్ష్మీనారాయణకు స్వయానా తోడల్లుడు. ఆయన జనసేన ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ, లక్ష్మీనారాయణ సూచనల మేరకే ఆయన రాజీనామా చేసారని, జనసేనలో చేరుతున్నారని తెలుస్తోంది. మరి, జెడి ఇప్పుడు జనసేనలో చేరుతారా లేదా అంటే ఆయనకు సన్నిహితంగా ఉన్న వారు మాత్రం బిజెపి లోనే చేరుతారని చెబుతున్నారు. అయితే, ఏపిలో బిజెపి పూర్తిగా డామేజ్ అయిన పరిస్థితుల్లో ఆయన ఆ పార్టీలో ఎందుకు చేరుతారనే ప్రశ్న వినిపిస్తోంది.
కానీ, కర్నాటక ఎన్నికల తరువాత ఏపి పై బిజెపి అధిష్ఠానం పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి డామేజింగ్ కంట్రోల్ చర్యలు తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, జెడి ని బిజెపిలోకి చేరే విధంగా అప్పట్లో నిర్ణయం జరిగింది. కానీ, టిడిపి, బిజెపి పొత్తు లేకపోవటం తో ఆయన టిడిపి వైపు ఆసక్తిగా ఉన్నారని అయితే, కొన్ని ప్రత్యేక కారణాల వలన బిజెపి లోనే చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఏపిలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని పరిస్థితులు అనుకూలిస్తే రాజ్యసభ అభ్యర్ది గా అవకాశం ఇస్తామని హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఏపిలోనే క్రియాశీలకంగా వ్యవహరించాలని లక్ష్మీనారాయణ భావిస్తున్నారు. తన కారణంగా బిజెపికి మేలు జరగకపోయినా వైసిపి మాత్రం అధికారంలోకి రాకూడదనే ది లక్ష్మీనారాయణ లక్ష్యమని చెబుతున్నారు.
అంట, పరోక్షంగా టిడిపికి సాయపడటమే ఆయన ఉద్దేశమా అని రాజకీయ విశ్లేషకుల సందేహం. ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరిని ఎలాగైనా ఉపయోగించుకోవటానికి ఏ మాత్రం వెనుకాడని టిడిపి అధినాయ కత్వం సైతం లక్ష్మీనారాయణ తమకు మేలేచేస్తారని. ఆయనను ఏరకంగా ఉపయోగించుకోవాలనే దాని పై వేచి చూసే ధోరణితో ఉంది. దీంతో, ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజకీయ ఆరంగేట్రం. టిడిపి తో సంబంధాలు, ఏరకంగా ఉంటాయో చూసి, ఢీ కొట్టేందుకు వైసిసి సైతం సమాయత్తం అవుతోంది. అయితే, గతంలో అధికారిగా జగన్ కేసుల వ్యవహారంలో అత్యు త్సాహం చూపించారని ఆయన మీద వైసిపి నేతలతో పాటుగా జగన్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఇక, లక్ష్మీనా రాయణ పదవి వదిలి రాజకీయాల్లోకి వస్తే, జగన్ వర్సెస్ లక్ష్మీనారాయణ రాజకీయం రంజుగా మారనుంది.