కౌంట్ డౌన్ స్టార్ట్. వచ్చే వారమే ముహూర్తం. మూడో ఛార్జ్ షీట్‌లో టిడిపి అధినేత చంద్రబాబు. ఏపి-తెలంగాణ తో పాటుగా దేశ వ్యాప్తంగా సం చలనం సృష్టించిన ఓటు కు కోట్లు కేసులో కీలక అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ఏసిబి వచ్చే వారం మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది. అందులో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏ-1 గా పేర్కొంటూ ఏసిబి రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహిచటం..అప్పటి విచారణ అధికారులను పిలి పించటం తో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి 50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయనే దాని పైనా ఏసిబికి ఆధారాలు లభించినట్లు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ తో మాట్లాడిన వాయిస్ టిడిపి అధినేతదిగా హైదరాబాద్, చంగీఘడ్ కు చెందిన ఫోరెన్సిక్ విభాగాలు వెల్లడించినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ ఫోరె న్సిక్ నివేదిక ఆధారంగా మూడో ఛార్జ్ షీట్లో చంద్రబాబు పేరు చేర్చబోతున్నట్లు సమాచారం. దీని పై ఇప్పటికే తెలంగాణ న్యాయశాఖ పరిశీలనకు పంపుతున్నారు. అయితే, ఈ ఓటుకు కోట్లు కేసులో ఏ-1 గా చంద్రబాబు అవుతారని న్యాయనిపు ణులు చెబుతున్నారు. స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టట్ఏ ఈ కేసులో కీలకం అవుతుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో కర్నాటక ఎన్నికలు సైతం ముగియనున్నాయి.
ఇక, కేంద్రం ఏపిలో అధికారం మాటున సాగి న అవినీతి పైనా దృష్టి సారిస్తుందనే వాదన టిడిపి నేతల నుండే వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి వేగంగా పరిణామాలు చోటు చేసుకోవటం కూడా టిడిపి నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. దీని పై ఇప్పటికే టిడిపి లో ముఖ్యమైన నేతలతో సమావేశం సైతం జరిగిందని..అయితే, హైకోర్టు తమ అధినేత పై వచ్చిన ఆరోపణలపై విచారణకు తిరస్కరించిందని..ఈ కేసు కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని పైకి చెబుతున్నా..లోలోపల మాత్రం రాజకీయంగా తమకు నష్టం కలించే విధంగా పరి ణామాలు కనిపిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో..వచ్చే వారం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొ నే అవకాశాలు కనిపిస్తున్నాయి.