జగన్ వాదనకే సీయం మద్దతు ఇస్తున్నారా..!!
నాడు జగన్..నేడు వైయస్ పై వాస్తవాలు చెప్పేస్తున్నారు…!!
వైయస్ ను చంద్రబాబు పరోక్షంగా కీర్తిస్తున్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైసిపి ఇమేజ్ ను పెంచేవే. ఏది ఎక్కడ చంద్రబాబు వైయస్ గురించి మాట్లాడారు అని మీ అనుమానమా. అవసరమే లేదు. ఎందుకంటే గతంలో జగన్ కేసుల విషయంలోనూ చంద్రబాబు నిజాలు ఒప్పుకోక తప్పలేదు. జగన్ పై అవినీతి కేసులంటూ 2014 ఎన్నికల ముందు నుండి చంద్రబాబు అండ్ టీం తో పాటుగా మద్దతు మీడియా ఊదర గొట్టింది. కానీ, కొంత కాలం క్రితం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టిడిపి లో చేరే సమయంలో జగన్ కేసుల గురించి స్పష్టత ఇచ్చేసారు. సోనియ ను ఎదిరించినందుకే జగన్ పై కేసులు నమోదయ్యాయని కుండ బద్దలు కొట్టారు.
ఇక, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోలవరం -రాజధాని తర ఘనతగా చెప్పుకొని మరో సారి తాను అధికారంలోకి వస్తేనే అభివృద్ది కొనసాగుతుందని అప్పుడే చంద్రబాబు అండ్ టీం ప్రచారం మొదలు పెట్టింది. అయితే, పోలవరం పై బిజెపి క్రెడిట్ గేమ్ మొదలు పెట్టింది. అదే సమయంలో పోలవరం-పట్టిసీమ లో జరిగిన అవినీతి బయట పెట్టకపోతే జైలుకైనా వెళ్తానని ఏపి బిజెపి అధ్యక్షుడు కుండ బద్దలు కొట్టారు. దీంతో..బిజెపికి క్రెడిట్ రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కొత్త పల్లవి అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఘనత కాంగ్రెస్ దేనని చెప్పుకొచ్చా రు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసిందీ కాంగ్రెస్సే..విభజన చట్టంలో పెట్టందీ కాంగ్రెస్సే అంటూ ముఖ్యమంత్రి వ్యా ఖ్యలు చేసారు. అయితే, అసలు వైయస్ హయాంలోనే పోలవరం కు ఒక రూపు వచ్చిందని.. ఆయన హాయంలోనే పోలవరంతో పాటుగా ప్రాణహిత-చేవెళ్ల కు జాతీయ హోదా కోసం వైయస్ హాయంలోనే సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. దీనిపై అప్పట్లోనే ముఖ్యమంత్రి గా కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు.
ఇక, ఇప్పుడు వైయస్ త్రవ్వించిన కాల్వనుండే నీరు మళ్లించి నదుల అనుసంధానం అంటూ మద్దతు మీడియా సహకారంతో ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా, ముఖ్య మంత్రి బిజెపికి క్రెడిట్ ఇవ్వకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు…ఖచ్చితంగా పరోక్షంగా వైయస్ ఇమేజ్ ను పెంచేవే. దీనిని వైసిపి శ్రేణులు సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే..పోలవరం క్రెడిట్ వైయస్ ఖాతాలోకి వెళ్లటం ఖాయం. తొలి నుండి జగన్ పోలవరం పై చేస్తున్న వాదనకు బలంగా ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి పరోక్షంగా జగన్ వాదననే సమర్ధించేలా మాట్లాడారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది..వైసికి ఎంత వరకు అనకూలంగా మలచు కుంటుందో చూడాలి.