టిడిపి బలం తగ్గింది. వైసిపి బలం పెరిగింది. కానీ, వైసిపి లో లోపం కనిపిస్తోంది. గెలుపు- ఓటమి మధ్య ఆ లోపం కీలక భూమిక పోషిస్తుంది. 2014 కంటే ఎక్కువగా ఈ సారి జగన్ ను లక్ష్యంగా చేసుకొని పచ్చ నేతలతో జగన్ ప్రత్యర్ధులు చేతులు కలుపుతున్నారు. అప్పటి కంటే జగన్ ఎక్కువగా ప్రజల్లో ఉంటున్నారు. జనం సైతం జగన్ ను ఆదరిస్తున్నారు. ఈ సారి గెలుపు ఖాయమనే ధీమా వైసిపి నేతల్లో కనిపిస్తోంది. 2014 లో సైతం ఇదే అది విశ్వాసం కొంప ముంచింది. ఈ సారి బహుముఖ పోరు తప్పేలా లేదు. పవన్ కళ్యాన్ ను పూర్తిగా విస్మరించటానికి వీల్లేదు. జగన్ ఏడు నెలలుగా నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్నారు. జగన్ వాయిస్ మాత్రమే అన్నట్లుగా ప్రజల్లో వైసిపి వాయిస్ గా వెళ్తోంది. మరి, పార్టీ సీనియర్లు ఏమయ్యారు? జగన్ అధికారంలోకి వస్తే మేము ఎంజాయ్ చేస్తాం..జగన్ కు మాత్రమే అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత అన్నట్లుగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.
బిజెపి తో లింకు పెట్టి..పవన్ తో పొత్తులు కట్టి.. వైసిపి లక్ష్యంగా దుష్ప్రచారం జరుగుతోంది. బిజెపి తో సంబంధాల పై జరగుతున్న ప్రచారానికి ధీటుగా వైసిపి నేతలు తిప్పి కొట్టే ప్రయత్నం కనిపించటం లేదు. ఈ ప్రచారాన్ని విస్మరిస్తే..ఎంతో కొంత శాతం ప్రజలు నిజమనే నమ్మే అవకాశం లేక పోలేదు. ప్రత్యేక హోదా పై ఎందుకో ఒక్క పోరాటమూ జరగటం లేదు. ఒక్క సమావేశం పెట్టటం లేదు. జగన్ పార్టీ ముఖ్య కార్యాలయంలో ఉన్న సమయంలో సమావేశాలు జరిగేవి. ఇప్పుడు ఏ ఒక్క సమావేశమూ లేదు. జగన్ పాదయా త్ర లో ఉంటే..మన పని మనదే అన్నట్లు గా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారి దీక్షలు చేస్తోంది. అది ప్రజలు ఎంత వరకు నమ్ముతారనే విషయం పక్కన పెడితే..ప్రతిపక్షం ప్రజల సమస్యల పై ఎక్కడ నిలదీస్తోంది.
జిల్లా స్థాయిలో మొత్తం 13 జిల్లాల్లో ఏం జరుగుతోంది. అక్కడక్కడా..అప్పుడప్పుడూ మీడియా సమావేశా లు మినహా..వైసిపి నేతలు ఏం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీల మీద సుప్రీం లో అఫిడవిల్ దాఖలు చేస్తే..వైసిపి నుండి వాయిస్ వినిపించే నాయకుడే లేరా. పార్టీలో ఎన్నకల ఏడాది లో ఏంటీ నిర్లిప్తత. జగన్ ఒక్కరిదే బాధ్యత అయితే..వీరంతా అధికారం పంచుకునే వారు మాత్రమేనా. సీట్ల కోసం ఆరాటం మినహా..పార్టీ భవిష్యత్ వీరికి పట్టదా? జనంతో ఎందుకు మమేకం కాలేకపోతున్నారు. నేతలు ఇలా వ్యవహరించటం పార్టీకి నష్టం కాదా. ఇది ఎవరి వైఫల్యం..నాయకులను నమ్ముకున్న జగన్ దా? ఇవన్నీ తెలిసినా? నేతలను దారిలో పెట్టని జగన్ దా? మీరే చెప్పండి. పార్టీ కి మీ సూచనలు కామెంట్ల రూపంలో తెలియచేయండి..