జంప్ జిలానీల్లో ఆ ఇద్దరే..!!
ఆ సర్వే తేల్చింది తెలిస్తే షాకింగే..!!
ఫిరాయింపు ఎమ్మెల్యేల పొలిటికల్ లైఫ్ రిస్క్‌లో పడిందా. జంప్ జిలానీలను టిడిపి ఏం చేయబోతోంది. వారికి వచ్చే ఎన్నికల్లో వారిలో సీట్లు ఇచ్చేది ఎంతమందికి. ఇచ్చినా గెలిచేదెవెరు. ముందస్తు ఎన్నికల పై చర్చ జోరుగా సాగుతుండటం తో అధికార పార్టీ పార్టీ ఫిరాయించి తమ వద్దకు వచ్చిన 22 మంది విషయంలో ఏం చేయాలనే దాని పై తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే మంత్రి పదవులు దక్కించుకున్న నలుగురిలో ఇద్దరు మాత్రమే సంతృప్తి గా ఉన్నారు. మిగిలిని ఇద్దరు పేరుకు మాత్రమే మంత్రులుగా చెలామణి అవుతున్నారు. ఇక, మిగిలిన ఎమ్మెల్యేల్లో ఒకరికి నామినేటెడ్ పదవి దక్కింది. ఇక మిగిలిని ఎమ్మెల్యేల్లో అనేక మంది తాము పార్టీ ఎందుకు ఫిరాయించామా అనే పశ్చాత్తాపం పడే పరిస్థితుల్లో ఉన్నారు.
పార్టీ కార్యక్రమాల్లో అసంతృప్తుల బెడద..తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం..ఏ పని మీద వెళ్లినా పట్టించుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. అటు డిడిపిలో ఉండలేక..ఇక తిరిగి వైసిపికి రాలేక సతమతమవుతున్నారు. కర్నూలు జిల్లా కు చెందిన ఎమ్మెల్యే మణిగాంధీ లాంటి వారు ఈ విషయాన్ని ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక, కడప-కర్నూలు- ప్రకాశం జిల్లాకు చెందిన జంప్ జిలానీల పరిస్థితి అదే విధంగా ఉంది. అద్దంకి లాంటి ప్రాంతాల్లో నేతలు బాహా బాహీకి దిగుతన్నారు. ఇక, 22 మంది జంప్ జిలానీలు ఉండటంతో..ఎంత మందికి టిక్కెట్లు ఇవ్వాలి..వారిలో ఎంత మంది గెలుస్తారనే అంశం పై తాజాగా అధికార పార్ట ఓ ప్రముఖ సంస్థతో సర్వే చేయించింది. అందులో మెజార్టీ సభ్యుల అవే స్థానాల్లో తిరిగి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని ఆ సర్వే తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో ఏ ఒక్కరు గెలవరని కుండ బద్దలు కొట్టింది. ఇక, మంత్రులుగా ఉన్న నలుగురిలో విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే.. ప్రస్తుత మంత్రి అమరనాధ రెడ్డి మత్రమే తిరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయని.
ప్రభుత్వ పెద్దలు చేయించిన సీక్రేట్ సర్వేలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది ఇప్పుడు జంప్ జిలానీలను పరీక్షగా మారింది. ఈ సర్వే వారికి లీక్ కావటంతో రాజకీయంగా తమ భవిష్యత్ ఏంటనే టెన్షన్ వారిలో పెరిగిపోతోంది. తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇక, వీరు సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాల్సిందేనా.