చంద్రబాబు 40 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడు, అపర చాణక్యుడిగా పేరు కానీ, అసలే అప్పుల్లో ఉందంటూ ఆయన పాలన నిర్వహించిన తీరుపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. లక్ష కోట్లు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని ఆయన తరచూ చెబుతుండేవారు.
రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతూనే ఉన్నా చంద్రబాబు, లోకేష్ లు మాత్రం దుబారాలో ఎక్కడా వెనుకాడలేదు. పొదుపు ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువగానే ఖర్చులు చేసేవారు. ఇక ఇప్పుడు జగన్ వంతు వచ్చేసింది. మరి ఆయన ఎలా సర్కారును నడుపుతున్నారు. చంద్రబాబు అధికారులతో సమీక్షల్లో తాను తాగే నీటి బాటిల్ 700 రూపాయల విలువ చేసే హిమాలయ మినరల్ వాటర్ మాత్రమే వాడేవారు. కానీ జగన్ తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
40 సంవత్సరాల అనుభవం విజనరీ అలా ఉంటే కుర్రాడైన జగన్ మాత్రం సింపుల్ గా 20 రూపాయల కిన్లే వాటర్ బాటిలే వాడుతున్నారు. ఇప్పుడు వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు ఈ తేడాను సోషల్ మీడయాలో బాగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు దుబారా చేస్తూ దోచుకోబట్టే కదా ఈ ఐదేళ్లలో కొత్తగా లక్ష 58 వేల కోట్లు అప్పు చేశాడని చెబుతున్నారు. జగన్ మాత్రం 20 రూపాయల విలువ చేసే మామూలు మినరల్ వాటర్ త్రాగుతూ ఆదా చేస్తున్నారని పోస్టులు పెడుతున్నారు.