ముందస్తు ఎన్నికలకు సై అంటే సై – Early polls for AP Assembly

0
507

టిడిపి ముంద‌స్తు నిర్ణ‌యాలు…సై అంటున్న వైసిపి..
తెర వెనుక జ‌రుగుతోంది ఇదే..!!

ముంద‌స్తు ఎన్నిక‌ల కోస‌మేనే ముఖ్య‌మంత్రి ఈ హ‌డావుడి నిర్ణ‌యాలు. జ‌గ‌న్ ను ఎదుర్కోవ‌టం కోస‌మా. ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి..ఏపిలో ఏం జ‌రుగ‌బోతోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల తో పాటుగానే ఏపి అసెంబ్లీ ఎ న్నిక‌ల ముంద‌స్తు నిర్వ‌హ‌ణ‌కు అధికార పార్టీ సిద్దంగా ఉందా. వ‌చ్చే డిసెంబ‌ర్- జ‌న‌వ‌రలో పార్ల‌మెంట్ కు ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని ఢిల్లీ నుండి అందుతున్న అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇదే స‌మ‌యంలో జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది.

ఏపిలో నెల‌కొన్ని రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వైసిపి సిద్ద‌మ‌ని చెబుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటుగా పలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌ని ఢిల్లీలోని ప్ర‌ము ఖులు స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే, జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి సుముఖంగా ఉన్నారు. బిజెపితో తెగ తెంపులు చేసుకున్న త‌రువాత ఇప్పుడు ఏపి ముఖ్య‌మంత్రి కేంద్ర ప్ర‌తిపాద‌న‌కు అనుకూలంగా మ‌ద్ద‌తి స్తారా అంటే సందేహ‌మే. అయితే, ముఖ్య‌మంత్రి ఢిల్లీ టూర్ త‌రువాత అక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల పై స్ప‌ష్ట‌మైన అంచ‌నాకు వ‌చ్చారు. ఎన్నిక‌ల మాజీ క‌మిష‌న‌ర్ బ్ర‌హ్మ ఇప్ప‌టికే జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న పై సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.ఈ స‌మాచారంతో ముఖ్య‌మంత్రి సైతం ముంద‌స్తుగానే పార్ల‌మెంట్ ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన ట్లు స్ప‌ష్ట‌మైన స‌మాచారం. దీంతో..ఎన్నిక‌ల హామీల‌కు ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రిస్తున్నామ‌నే విధంగా ప్ర‌జ‌ల్లోకి సంకేతాలు ఇస్తున్నారు, అంగ‌న్ వాడీల జీతాలు పెంచారు.

అయితే, తాజాగా స‌ర్వేలు అధ్య‌య‌నం చేస్తే..పూర్తిగా వైసిపి అధిప‌త్యం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు ఏడు నెల‌ల‌కు పైగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల్లో సానుకూల సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్య‌తిరేక‌త‌తో పాటుగా..వైసిపి కి పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ..ఎమ్మెల్యేల పై ప్ర‌జ‌ల్లో నెల‌కొన్ని అసంతృప్తి ఇప్పుడు అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి. అయితే, ఏపి శాస‌న‌స‌భ‌కు ఇప్పుడున్న ప‌రిస్థితుల మేర‌కు ముంద‌స్తుకు అధికార పార్టీ సాహ‌సం చేయ‌క‌పోయినా..లోక్‌స‌భ ఎన్నిక‌లు ఎదుర్కోక త‌ప్ప‌దు. అందులో ఏ ఎదుర య్యే ఫ‌లితాలు ఏపి శాస‌న‌స‌భ ఎన్నిక‌ల పై స్ప‌ష్టంగా ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో..అధికార పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి కొద్ది రోజుల్లోనే ముంద‌స్తు లోక్‌స‌భ ఎన్నిక‌ల పై స్ప‌ష్ట‌త రానుంది. ఏపిలో ఏం జ‌రిగే అవ‌కాశం ఉంది..ముంద‌స్తుగా పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌రిగితే వైసిపి ప‌రిస్థితి ఏంట‌నే దాని పై క్షేత్ర స్థాయి స‌మాచారం ఆధారంగా మీ అభిప్రాయాలు తెలియ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here