కర్నాటక రాజకీయంలో కీలక మలుపు. కాంగ్రెస్-జెడిఎస్ శిబిరం నుండి ఎనిమిది మంది జంప్. ఢిల్లీ బిజెపి నేతల కంట్రోల్ లో ఎనిమిది మంది కాంగ్రెస్-జెడిఎస్ కూటమి ఎమ్మెల్యేలు. మరి కొద్ది గంటల్లో విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్న బిజెపి సునాయసంగా గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యంతరాలను పట్టించుకోని గవర్నర్ బిజెపికి చెందిన బోపయ్యను ప్రొటెమ్ స్పీకర్ గా నియమించారు. ప్రొటెమ్ స్పీకర్ గా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిని కాంగ్రెస్ కు చెందిన దేశ్ పాండేనున నియమించాలని కాంగ్రెస్ కోరుకుంది. అయితే, గతంలో యడ్యూరప్ప రాజకీయంగా క్రైసిస్ ఎదుర్కొంటున్న సమయంలో అండగా నిలిచిన నాటి స్పీకర్ బోపయ్యనే తిరిగి గవర్నర్ ఇప్పుడు ప్రొటెమ్ స్పీకర్ గా నియమించారు. ఇక, 104 మందిస సభ్యుల బలమే బిజెపికి ఉందని భావిస్తున్న సమయంలో జాతీయ మీడియా ఓ సంచలన కధనం ఇచ్చింది.
కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి వారిని బెంగళూరుకు తరలించనున్నారు. నిజానికి బెంగళూరు ఈగిల్టన్ రిసార్ట్స్, షాంగ్రీలా హోటల్‌ల్లో శిబిరాలు ఏర్పాటేచేసేనాటికే ఆ ఎనిమిది మంది జంప్ అయ్యారని జాతీయ మీడియా కధనం ఇచ్చింది. గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలోనూ ఈ ఎనిమిది మంది సంతకాలు చేయలేదని… దీంతో ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ నుంచి సంతకాలను సేకరించి.. ఫోర్జరీ చేశారని ఆ కధనం లో పేర్కొంది. ఆ ఎనిమిది ఫోర్జరీ సంతకాల జాబితానే కాంగ్రెస్, జేడీఎస్‌లు ఆగవర్నర్‌కు, ఆపై సుప్రీంకోర్టుకు పంపాయని ఆ కథనంలో వెల్లడించారు. అలా 104కు మరో ఎనిమిది మంది జంప్ జిలానీలు తోడుకాగా బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్(112)కు చేరుకుంటుంది కాబట్టి బలపరీక్షలో యడ్యూరప్ప సునాయాసం గా గెలుస్తారన్నది ఆ కధనం సారాంశం. అయితే, కాంగ్రెస్ శిబిరం నుండి మాత్రం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే తమవద్ద లేరని చెబుతున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేల మిస్సింగ్ పై కాంగ్రెస్ నేతలు స్పందించటం లేదు. దీంతో..ఏది ఏమైనా తాము విశ్వాస పరీక్షలో నెగ్గుతామని బిజెపి ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్-జెడిఎస్ శిబిరం మాత్రం కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు. మరి కొద్ది గంటల్లో యడ్యూరప్ప సీయం గా కొనసాగుతారా..లేక కుమారస్వామి సీయం అవుతారా అనేది చూడాలి