డ్వాక్రా మహిళల”కి జగన్ గుడ్ న్యూస్, మొదటి విడత రుణమాఫీ ఆ రోజే – Good news to Dwakra Women, AP CM YS Jagan Issues First Phase Loan Waiver

0
1384

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునుంచే, ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో తాను ఏవైతే  హామీలు ఇచ్చారో, అన్ని హామీలపై శాఖలు వారీగా సమీక్షలు జరుపుతూ వచ్చారు. ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం జగన్ తీసుకుంటున్న చర్యలు చూసి రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చింది అంటూ ఏపీ ప్రజలు కూడా ఎంతో సంబరపడుతున్నారు. ఇదిలాఉంటే వైసీపీని అధికారంలోకి కూర్చోపెట్టి, చంద్రబాబుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన జగన్ ఏకైక అస్త్రం “నవరత్నాలు”. ఈ ఒక్క హామీతో జగన్ ఏపీ  ప్రజలకి ఎంతో చేరువ అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకే కాబోలు ఎన్నికల నెల రోజుల ఉన్నాయనగా చంద్రబాబు డ్వాక్రా మహిళల  ఓట్ల కోసం పసుపు కుంకుమ స్కీమ్ క్రింద ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు ఇచ్చివారిని మభ్య పెట్టాలని చూసినా సరే చంద్రబాబుని కాదని, జగన్ పై నమ్మకంతో డ్వాక్రా మహిళలు గంపగుత్తంగా ఓట్లు వేసి జగన్ ని గెలిపించుకున్నారు.

వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ  మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ  వైఎసార్ ఆసరా. తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని, దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి, ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలకి వైఎసార్ ఆసరా ఓ భరోసా ఇస్తుందని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే  “వైఎస్ఆర్ ఆసరా” పధకంపై సమీక్షలు జరిపిన జగన్ ఆ శాఖ అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు ఎన్ని, ప్రస్తుతం వారి అప్పు ఖాతాలలో ఉన్న సొమ్ము ఎంత, అనే విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జిల్లా కలక్టర్లు ఈ వివరాలని సేకరించి ప్రభుత్వానికి తెలిపాలని ఆదేశించారు. దాంతో ఏపీ వ్యాప్తంగా డ్వాక్రా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆయా సంఘాల వివరాలని ఓ నివేదికలో పొందు పరిచి ఉన్నత అధికారులకి అందచేస్తున్నారు. అతి త్వరలోనే జగన్ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here