నువ్వూ జంప్ జిలానీవే..టిక్కెట్ ఇచ్చేది నీవు కాదు …ఆది ర‌చ్చ‌ – Heat Politics In Kadapa Minister Adinarayana Reddy Vs Rama Subba Reddy

0
508

మంత్రి ఆదికి క‌ష్ట‌కాలం వ‌చ్చింది. సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు. క‌డప జిల్లాలోనే ఇతర నేత‌లు మంత్రి ఆది ప్ర‌తీ అంశంలో జోక్యం చేసుకోవాటాన్ని స‌హించ‌టం లేదు. దీంతో ఇప్పుడు ఫిరాయింపు మంత్రి వ‌ర్సెస్ ఫిరాయింపు ఎమ్మెల్యేగా పొలిటిక‌ల్ వార్ మొద‌లైంది.  జమ్మలమడుగు ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు మద్య పంచాయతీ కడప జిల్లాలో పెద్ద రచ్చగా మారింది. ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి నువ్వు కూడా నా మాదిరి జంప్ జిలానివేనని జయరాములు వ్యాఖ్యానించారు. సైకిల్‌ ర్యాలీ గురించి మాకు చెప్పారా, మా హక్కులు కాలరా యాలని చూస్తారా, దళితులమని చిన్నచూపు చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. టిక్కెట్ ఇచ్చేది మంత్రి కాదని, అదిష్టానం అని ఆయన అన్నారు. అణగారిన కులాలవారి మనోభావాలు దెబ్బతినేలా మంత్రి మాట్లాడారని విరు చుకుప‌డుతున్నారు.

ఎమ్మెల్యే విజయమ్మ కు మంత్రి ప్రాదాన్యం ఇవ్వడంపై ఆయన మండిపడుతున్నారు. ఫిరాయించి మంత్రి పదవిని తీసుకున్న ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు తమ నియోజకవర్గంలో వేలు పెడుతున్నాడని, తమ వ్యవహా రాల్లో జోక్యం చేసుకుంటున్నాడని విరుచుకుప‌డుతున్నారు. ఇక్కడ వేరే వ్యక్తులను తెరపైకి తేవాలని, వారే వాళ్లను అ భ్యర్థులుగా తెరపైకి తేవడానికి ఆది ప్రయత్నిస్తున్నాడని, ఆయన తన నియోజకవర్గం వరకూ పరిమితం అయితే బాగుం టుందని వీళ్లు సూచిస్తున్నారు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి పుణ్యమా అని టీడీపీలో మరో నియోజకవర్గంలో ర చ్చ రేగు తున్న‌ది. జ‌మ్మ‌ల మ‌డుగులో ఇప్ప‌టికే ఆది వ‌ర్సెస్ రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ప‌తాక స్థాయికి చేరింది. ఇప్పు డు అది జ‌మ్మ‌ల మ‌డుగు నుండి బ‌ద్వేలు కు చేరింది. జిల్లా మంత్రితా త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఆదినారా య‌ణ రెడ్డి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఏ నేత స‌హించ‌టం లేదు. దీంతో.సొంత ఇంటి నుండి మొద‌లైన అస‌మ్మ‌తి పోరు సొంత నియోజ‌క‌వ‌ర్గం దాటి క‌డ‌ప జిల్లాలో ఆది అనుకూల‌..వ్య‌తిరేక గ్రూపులు టిడిపి లో పెరిగిపోతున్నాయి. దీంతో.. క‌డ‌ప టిడిపి లో ఇప్పుడు మంత్రి ఆదినారాయ‌ణ కు వ్య‌తిరేకంగా గ్రూపులు పెరిగిపోతున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here