ముహూర్తం ఖారారైంది. సంచలన నిర్ణయం దిశగా వైసిపి అధినేత జగన్. పాదయాత్ర కు గ్రాండ్ ముగింపు ఇచ్చేందుకు జగన్ సిద్దమయ్యారు. అక్టోబర్ 6, 2017 న ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటికే తొమ్మది జిల్లాల్లో పూర్తయింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాల్లో సాగుతోంది. ఈ జిల్లాల్లో జులై మొదటి వారం వరకు సాగే అవకాశం ఉంది .ఆ తరువాత విశాఖ జిల్లా లో ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆ జిల్లాలో టిడిపి నుండి భారీ చేరికలు వైసిపిలోకి ఉండనున్నాయి. 2014 ఎ న్నికల్లో వైసిపికి అక్కడ నష్టం జరిగింది. దీంతో..ఈ సారి విశాఖపై వైసిపి అధినేత తొలి నుండి ప్రత్యేక దృష్టి సారించారు.
అధికార పార్టీలో నెలకొన్ని గ్రూపు రాజకీయాలు వైసిపి బలంగా మారుతున్నాయి. ఉత్తరాంధ్ర లో వైసిపి గతం కంటే బలంగా ఉన్నట్లు తాజా సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. విశాఖ -విజయనగరం జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అక్కడ కొత్త నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇక, జులై మొదటి వారంలో విశాఖలో ప్రారంభ మయ్యే పాదయాత్రను ఆగస్టు చివరి నాటికి విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వైయస్ మరణించిన రోజు అయిన సెప్టెంబర్ 2న ఇచ్చాపురం లో పాదయాత్ర ముగించాలని సూత్ర ప్రాయం గా నిర్ణయించారు. అదే రోజు అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు మూడు వేల కిలో మీట ర్లు..11 నెలల పాటు సాగించిన పాదయాత్రకు గుర్తుగా సభతో పాటుగా…పార్టీ తొలి నుండి పోరాడుతున్న ప్రత్యేక హోదా కు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకోవాలని పార్టీ యోచిస్తోంది. ఇక, ముందస్తు ఎన్నికల దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్న ఈ సమయంలో కేంద్రం పై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలనేది పార్టీ యోచనగా తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని పాదయాత్ర ముగింపు రోజున జరిగే భారీ బహిరంగ సభలో జగన్ ప్రకటించనున్నారు. అయి తే, ఈ నిర్ణయం ద్వారా..టిడిపి కి కొత్త అస్త్రం ఇచ్చిన వారవుతారని..ఫిరాయింపు ఎమ్మెల్యేల తో టిడిపి కొత్త రాజకీయం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నా..జగన్ వాటిని ఖాతరు చేయటం లేదు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన తరువాత టిడిపి ఏం చేసినా..ప్రజల్లో మరింతగా డామేజ్ అవుతారని..తాము సిన్సియర్‌గా పోరాటం చేద్దామని జగన్ పార్టీ నేతలతో చెబుతున్నారు. దీంతో..ఇడుపుల పాయలో ఘనంగా ప్రారంభమైన పాదయాత్ర అంతే ఘనంగా ఇచ్ఛాపురంలో ముగించే దిశగా కార్యాచరణ సిద్దమవుతోంది. దీంతో..రికార్డు స్థాయిలో సాగిన పాదయాత్ర లో సంచలన నిర్ణయం ద్వారా..ఏపి రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించటానికి సిద్దమవుతున్నారు.