బ్బకు దెబ్బ..!!
వైసిపి షాక్ నుండి టిడిపి కోలుకుంటుందా…!!
ప్రకాశం జిల్లాలో టిడిపికి భారీ షాక్. వైసిపిలోకి టిడిపి సీనియర్ నేత. ప్రకాశం జిల్లాల్లో టిడిపి సీనియర్ నేతగా ఉన్న కరణం బలరాం పార్టీ వీడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయన తన కుమారుడితో సహా త్వరలోనే వైసిపిలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఎంతో కాలంగా దీని పై చర్చలు సాగుతున్నప్పటికీ..ఇప్పుడు నిర్ణయం ఖరారైందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో టిడిపిలో తొలి నుండి కరణం ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో అద్దంకి నుండి వైసిపి ఎమ్మెల్యే గా గెలిచిన గొట్టిపాటి రవి టిడిపి లోకి ఫిరాయించారు. అప్పటి నుండి అక్కడ పరిస్థితి గొట్టిపాటి వర్సెస్ కరణంగా మారింది. ఎప్పటి నుండో ఈ రెండు వర్గాల మధ్య అక్కడ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక, ఇద్దరూ ఒకటే పార్టీలో ఉండటం అప్పటి నుండి కష్టంగా మారింది. వాగ్వాదాలే కాదు..ఒకరి వర్గం పై మరొకరు దాడులు చేసుకోవటం కూడా జరిగాయి. టిడిపి అధినేత సైతం అద్దంకి బాధ్యతలు గొట్టిపాటి రవి చూసుకుంటారని తేల్చి చెప్పారు. ఇది..కరణం వర్గీయులకు నచ్చటం లేదు. కరణం బలరాంను శాంత పరచటానికి ఎమ్మెల్సీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్ కు అద్దం కి సీటు టిడిపి నుండి ఇస్తామంటే పార్టీలో ఉంటామని..లేకపోతే పార్టీని వీడుతామని గతంలోనే కరణం బలరాం స్పష్టం చే సినట్లు సమాచారం. అయితే, అద్దంకి సీటు టిడిపి నుండి గొట్టిపాటి రవికే ఇవ్వాలని టిడిపి డిసైడ్ అవ్వటంతో వారు పార్టీ వీడటం కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే, వైసిపి నుండి కరణం కు ఎటువంటి హామీ లభించిందనే దా ని పై ఇంకా స్పష్టత రాలేదు. ఇదే జల్లా నుండి మరో ఎమ్మెల్సీ సైతం టిడిపిని వీడటానికి సిద్దంగా ఉన్నారని సమాచారం. ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి పై ఆ పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా..పార్టీ నేతలు కొందరు టిడిపిని వీడుతున్నారనే సమాచారం అప్రమత్తమైన టిడిపి అధినాయకత్వం వారిని బుజ్జగించే పనిలో పడింది.కానీ, ఇప్పుడు జిల్లాలో ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రచారం టిడిపిలో టెన్షన్ పుట్టిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీకి చెందిన నేతలు ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అవుతే ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. తమ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహించిన టిడిపి నేతలకు వణుకు పుట్టించేలా తమ అడుగులు ఉంటాయని వైసిపి నేతలు తేల్చి చెబుతున్నారు.