అశోక్‌ బాబుకు అంత సీన్ ఉందా? ఆఫ‌ర్ వెనుక అసలు రాజ‌కీయం? – How Much Capabulity of Ashok Babu? What is The Secret Behaind Offere?

0
511

అశోక్‌ బాబుకు  అంత సీన్ ఉందా..!!
ఆఫ‌ర్ వెనుక అసలు రాజ‌కీయం….!!

అశోక్‌బాబు లేక‌పోతే టిడిపి గెల‌వ‌లేదా. అశోక్‌బాబుకు ఎందుకు ముఖ్య‌మంత్రి ఇన్ని సార్లు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘ నేత‌కు ముఖ్య‌మంత్రి హోదా ఇంత‌లా అడ‌గాల్సిన అవ‌స‌రం ఉందా. అస‌లు ముఖ్య‌మంత్రి ఆలోచ‌న ఏంటి. ఏపి ఎన్టీఓ సంఘ అధ్య‌క్షుడు అశోక్ బాబు రిటైర్‌మెంట్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. జూన్ రెండున జ‌రిగిన న‌వ నిర్మాణ దీక్ష లో ఆశోక్‌బాబును రాజ‌కీయాల్లోకి రావాల‌ని ముఖ్య‌మంత్రి ఆహ్వానించారు. ఆప్ప‌ట్లోనే దీని పై అనేక విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. ఇక‌, తాజాగా ఏలూరులో ఏపి ఎన్టీఓ హోం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి మ‌రో సారి అదే అంశం పై మాట్లాడారు. అశోక్‌బాబును టిడిపిలోకి ర‌మ్మ‌ని ఆఫ‌ర్ ఇచ్చాన‌ని..నిర్ణ‌యం మీదేన‌ని సీయం వ్యాఖ్యానించారు. ఇంత లా ఎంతో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న వారి విష‌యంలోనూ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించ‌లేదు. కానీ అశోక్‌బాబు వ్య‌వ‌హారంలో మా త్రం ఎందుకో వ‌ల్ల‌మానిని అభిమానం చూపిస్తున్నారు. ఉద్యోగ సంఘ నేత‌గా ఉన్న‌ప్ప‌టికీ..అశోక్ బాబు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం ఉద్యోగ సంఘాల్లోనూ వ్య‌క్తం అవుతోంది.

కర్నాట‌క ఎన్నిక‌ల స‌మ‌యం లోనూ అక్క‌డ ప్ర‌చారం కోసం వెళ్లి, అక్క‌డ ఎదురైన వ్య‌తిరేక‌త‌తో తిరిగి వ‌చ్చేసారు. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం వైసిపి ఎంపీలు దీక్ష చేస్తే..క‌నీసం సంఘీభావం కూడా ప్ర‌క‌టించని అశోక్‌బాబు..టిడిపి యూ ట‌ర్న్ తీసుకోగానే..ప్రభుత్వ పెద్ద‌ల వ‌ద్ద మార్కుల కోసం అన్న‌ట్లుగా మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, తాజాగా, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప‌దో పీఆర్సీ బకాయిల విష‌యంలో ఎన్నిక‌ల ముందు అన్న‌ట్లుగా న‌వంబ‌ర్ లో క్లియ‌ర్ చేసే విధంగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది . ఆ వెంట‌నే ఆ బకాయిల చెల్లింపు నుండి ఉద్యోగుల వంతుగా రాజ‌ధానికి 200 కోట్లు ఇస్తున్న‌ట్లు అశోక్‌బాబు సొంత నిర్ణ యాన్ని ప్ర‌క‌టించారు. ఇది కూడా అనేక ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు రుచించ‌టం లేదు.

ఇక‌, స్వ‌యంగా అశోక్‌బాబును ముఖ్య‌మంత్రి త‌న పార్టీలోకి ఆహ్వానించిన స‌భ‌లోనే..మ‌రో ఉద్యోగ సంఘ నేత ఆను ఎన్జీవో భ‌వ‌న్ కోసం క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. ముఖ్య‌మంత్రి త‌మ లాంటి వారిని ప‌ట్టించుకోవ‌టం లేద‌ని సీయం స‌మ‌క్షంలోనే విమ‌ర్శించారు. అయితే, అశోక్ బాబు పార్టీలోకి వ‌స్తే.. ఉద్యోగులంతా టిడిపి వైపే ఉంటారనే భ్ర‌మ‌లో ముఖ్య‌మంత్రి ఉన్నారా..లేక త‌మ పార్టీలో ఉద్యోగ సంఘ నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌టం ద్వారా..ఉద్యోగుల‌ను ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అనే చ‌ర్చ సాగుతోంది. అయితే, ఆశోక్‌బాబు పై ఇప్ప‌టికే ఉద్యోగుల్లో అధిక శాతం మంది వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. దీంతో..ముఖ్య‌మంత్రి ఒక ఉద్యోగ సంఘ నేత‌గా అశోక్‌బాబు కు ఇస్తున్న ప్ర‌యార్టీ పై సొంత పార్టీ సీనియ‌ర్ల‌కే అంతు బ‌ట్ట‌టం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here