ప్రభుత్వంలో అవినీతి స్కెచ్ ఇది. 400 కోట్ల పెట్టుబడి కోస 400 కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించే అందులో పారిశ్రామిక రాయితీ పేరుతో మినహయింపులు ఇస్తూ అడ్డంగా దోపిడికి వేసిన అధికారిక మ్యాప్. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యుషన్స్-ప్రభుత్వం మధ్య జరిగిన వ్యవహారం, అసలు ఈ కంపెనీ వెనుక ఉన్న కధ తెలిస్తే ఎవరికైనా ఏం జరుగుతుందనేది అర్దమైపోతుంది. ఈ స్కాం ను సరిదిద్దుకొనే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రెండు కంపెనీల ఏర్పాటు కోసం విశాఖ లో రుషికొండ ప్రాంతంలో 40 ఎకరాల భూమిని ధారాధత్తం చేయాలని, నిర్ణయించి, దీని ప్రతిఫలంగా 10 వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వంతో ఎంఓయు జరిగింది. దీని కోసం జనవరి 11న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో ఈ రెండు కంపెనీలకు సంబంధించి అనేక రాయితీలు, మినహాయింపులు ఇచ్చింది. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు, నిర్ణయాల పై విచారణ తప్పదనే ప్రచారం నడుమ ప్రభుత్వం తామిచ్చిన ఉత్తర్వులను సరి చేస్తూ ఏప్రిల్ 30న మరో జీవో జారీ చేసింది. అందులో ఇన్నోవా సంస్థ పేరు లేదు. అసలు ఈ ఇన్నోవా సంస్థ ఓ బోగస్ కంపెనీగా అధికారులే చెబుతున్నారు. ఇది కేవలం ఒక బాడీ షాపింగ్ నిర్వహించే సంస్థ. ఎక్కడ వెతికినా ఈ సంస్థ చిరు నామా, వివరాలు దొరకటం లేదు. దొరకటం లేదనే దాని కంటే, దొరకకుండా చేసారనటం కరెక్ట్ అనిపిస్తోంది.
ఆ కంపెనీకి చెందిన 20 లేబర్ అప్లికేషన్లను తిరస్కరించినట్లు మై వీసా జాబ్స్ అనే సంస్థ రెడ్ కలర్‌లో చూపిస్తోంది. ఇదే సంస్థ ఇన్నోవా కు దారుణమైన రేటింగ్, రివ్యూలు ఇచ్చింది. అసలు లేని సంస్థను తొలుత ఇచ్చిన జీవో లో ప్రభుత్వం ఎందుకు చూపించింది, ఇప్పుడు తాజాగా ఇచ్చిన జీవో లో ఆ పేరు ఎందుకు తొలిగించింది ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఈ సంస్థ అసలు బోగస్ సంస్థ అని ప్రచారం జరుగుతున్న సమయంలో కాదు, అనే వివరణ ప్రభుత్వం నుండి ఎందుకు రావటం లేదు. 25 ఎకరాలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు 15 ఎకరాలు ఇన్నోవా కు ఇవ్వవాలనేది ప్రభుత్వ నిర్ణయం. తాజాగా ప్రభుత్వం జాతీ చేసిన సవరణ ఉత్తర్వుల్లో ఇన్నోవా సంస్థ పేరు లేకపోవటం తో అసలు గుట్టు రట్టు అయింది. దీని పై నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభ్యంతరం వ్యక్తం చేసినా, ప్రభుత్వం మాత్రం తొలుత తమ ఇష్టానుసారం అదేశాలు ఇవ్వటం.
తాజాగా ఇప్పుడు సవరణ జీవో ఇచ్చుకోవటం చూస్తుంటే, ఇటువంటి నిర్ణయాలు ఎన్ని ఈ ఐటి మినహాయింపు ల పేరుతో జరుగుతున్నాయనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ కధనానికి సంబంధించి పూర్తి ఆధారాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అసలు చిరునామా సైతం దొరకని సంస్థకు ఎలా భూములు కట్టబెడుతున్నారు, ఆ సంస్థ ఎలా ఉద్యోగాలు కల్పిస్తుందీ, ఆ తరువాత ఆ సంస్థ పేరునే ఉందుకు తొలిగించాల్సి వచ్చింది, వీటన్నింటకీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అసలు రెండు సంస్థలకు ఒకే జీవోలో ఎలా భూమి కేటాయించారో, ఇది మంత్రి స్థాయిలో జరిగిన నిర్ణయమేనా, దీనికి ఆ శాఖ కార్యదర్శి బాధ్యత వహించాల్సిందేనా అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఐటి శాఖ మెడకు చుట్టుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.