కొత్త సవాళ్లతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 30న జగన్ ప్రమాణం చేసిన రోజుకు కొన్ని గంటల ముందే 3500 కోట్లు ఏపీ ప్రభుత్వ ఖాతా నుంచి దారి మళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న ఏపీ ప్రభుత్వాన్ని కొత్త ముఖ్యమంత్రి మోయడం కష్టం. ఈ పదవి నాకు వద్దు బాబోయ్ అని జగన్ చేత అనిపించాలన్న ఎత్తుగడలో భాగంగానే 3500 కోట్లు ఉన్నపలంగా చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ విషయం జగన్ చేపడుతున్న వరుస సమీక్షల వల్ల బయటపడటంతో అధికారులు తలపట్టుకుంటున్నారు.
టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ అధికారి కారణంగా ఈ భారీ మొత్తం చేతులు మారినట్లు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే పోలవరం కాంట్రాక్టర్లకు ఏమీ మిగలదని భావించిన సదరు అధికారి కోట్ల బిల్లులు చెల్లించి కోట్ల నిధుల్ని దారి మళ్లించారని తెలుస్తోంది.దీనిపై ఎంక్వైరీ మొదలైతే ఎవరు కటకటాల్లోకి వెళతారో తెలియక అధికారులు భయపడుతున్నారట.
మే 22న 2025 కోట్లు, మే 23న 300 కోట్లు, మే 27న 1000 కోట్లు కాంత్రాక్టర్లకు చెల్లించినట్లు వినిపిస్తోంది. దీనికి తోడు చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేయించారని, టీడీపీ నేతలు తమకు అనుయాయులుగా వున్న వారికి లక్ష విలువ చేసే కాంట్రాక్టులు అప్పగించి ఆ పనికి పది లక్షల చొప్పున బిల్లులు ఇప్పించారని ఇలా తవ్వుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు గడిచిన ఐదేళ్లలో దారిమళ్లాయని తెలిసి వైసీపీ నేతలు నోళ్లు వెళ్లబెడుతున్నారట. దేశమే కాదు ప్రపంచమే నివ్వెరపోయే వేల కోట్ల కుంభకోణాలు ఏపీ రాజధాని పేరుతో జరిగాయని తెలుస్తోంది. అన్నీ బయటికి వస్తే దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.