టిడిపికి నిద్ర పట్టనీయని ఆది..
ఆది ఎంట్రీ ఎటు.. వైసిపి లోకా..జనసేన లోకా
హైపర్ ఆది. జబర్డస్త్ ఫేం. ఏ పార్టీలో చేరబోతున్నారు. జనసేన లోకా..వైసిపి లోకా. ఆది.. ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. ఇప్పుడు ఆది తన స్కిట్స్ లో రాజకీయ పంచ్ లకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆది రాజకీయ ఆరంగేట్రం చేస్తారా. కొద్ది రోజులుగా ఆది తన స్కిట్స్‌లో ఇన్ డైరెక్ట్ గా టిడిపిని టార్గెట్ చేస్తున్నారు. కొంత కాలం క్రితం తన స్కిట్ లో ఒక సారి పొరపాటు చేస్తే తప్పు అంటారు..పదే పదే చేస్తే పప్పు అంటారు అని పంచ్ పేల్చారు. అయితే ఎడిటింగ్ లో తీవ్రత తగ్గించేసారు. జబర్డస్త్ ఈ టివి లో వచ్చే కార్యక్రమం. సహజంగా ఈనాడు గ్రూపు మీడియా లో టిడిపి కి వ్యతిరేకం గా ఏవీ ఉండవనేది టిడిపి నేతల ఆశాభావం. కానీ, ఈటీవీ యాజమాన్యం సైతం ఎడిటింగ్ చేయటం మినహా..కంట్రోల్ చేయలేని స్థాయిలో అభిమానుల వద్ద ఆది పంచ్ లకు క్రేజ్ పెరిగిపోయింది. ఆది స్కిట్స్ పరిశీలిస్తే ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాన్ ల పై అభిమానం చూపిస్తూ ఉంటారు. జడ్జిగా ఉన్న నాగబాబాబు ను ఆకర్షించటం కోసమా..లేక ఆదికి రాజకీయ లక్ష్య చేరువలో భాగమా అనేది చర్చ సాగుతోంది. ఇక, గత వారం ఆది తన స్కిట్ లో సైకిల్ పై ప్రస్తావన తీసుకొచ్చా రు. సైకిల్ చైన్ లాగే సన్నివేశం క్రియేట్ చేసి ఆ సమయంలో తన ఉద్దేశాన్ని పంచ్ ద్వారా పేల్చేసారు. సైకిల్ పని అయి పోయింది…ఆ సైకిల్ చైన్ లాగా సన్నివేశం తెర కెక్కించిన డైరెక్టర్ పని అయిపోయిందంటూ పంచ్ విసిరారు.
ఇక, తాజా ఎపిసోడ్ లో తన స్కిట్ లో దీక్షల గురించి సన్నివేశం క్రియేట్ చేసారు. దీక్షల పేరుతో చేసే ఖర్చుతో దీపిదా పదుకొనేతో సినిమా తీయవచ్చంటూ తాజాగా..టిడిపి అధినేత 30 కోట్లతో ధర్మదీక్ష పేరుతో చేసిన ఖర్చును తన స్కిట్ లో భారీ పంచ్ తో పేల్చారు. ఇక, వచ్చే వారంకు సంబంధించిన ప్రోమోలో మరో భారీ పంచ్‌ను ఆది సిద్దం చేసేసారు. పవన్ కళ్యాన్ ను.. జగన్ ను అభనువం గురించి ప్రశ్నించే టిడిపి నేతలకు తన స్కిట్ ద్వారా సమాధానం చెప్పారు. సైడ్ యాక్టర్ మీకు అను భవం ఉందా అని ప్రశ్నిస్తే…స్వాతంత్ర పోరాటం చేసామని చెప్పుకొనే అనుభవం తమకు లేదని పరోక్షంగా టిడిపి అధినేత తిరుపతి సభలో టిడిపి స్వాతంత్ర పోరాటం చేసిన పార్టీ అని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ పంచ్ వేసినట్లు స్పష్ట మవుతోంది. ఆది తన పంచ్‌లకు ఎడిటింగ్ సమస్య ఉన్న విషయాన్ని తన స్కిట్స్ లోనే స్ఫష్టంగా చెబుతున్నారు. ఇక, టిడిపి తో పాటుగా వివాదాస్పద వ్యక్తులు డేరాబాబాబ, కత్తి మహేష్, ఆర్జీవి, శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ, పరోక్షంగా శ్రీరెడ్డి, తెలుగు టీవీ ఛానల్స్..ఇంటర్వ్యేలు చేసే వ్యక్తులను ఇన్ డైరెక్ట్ తగిలేలా తన పంచ్‌లతో ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు. ఆది వేసే ఈ పంచ్‌ల కారణంగానే ఆకర్యక్రమానికి రేటింగ్స్…యూట్యూబ్‌లో ఆది స్కిట్స్‌కు వచ్చే హిట్స్.. లైక్స్ లక్షలు దాటి కోట్ల వరకు వెళ్తున్నాయి. అయితే, న్యాయ నిర్ణేతలుగా ఉన్న నాగబాబు, రోజా ఇద్దరి వద్ద మార్కులు కొట్టేందుకా..లేక జనాల్లో చర్చ జరుగుతున్న చర్చ ఆధారంగా వీటిని ఆది తన స్కిట్స్‌లో జోడిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అయితే, ఇదంతా కామెడీ కోసం క్రియేట్ చేస్తున్న అంశాలుగా పేర్కొంటున్నారు. కానీ, జబర్దస్త్ ఆది మాత్రం టిడిపి నేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. రానున్న రోజుల్లో టిడిపి నేతలు ఈ టీవి యాజమాన్యం పై ఒత్తిడి తెచ్చి ఆది స్కిట్స్ ను కంట్రోల్ చేసినా ఆశ్చర్య పోవక్కర్లేదు.