ఆ వారసుడు వైసిపికి వస్తే..ఫ్యూజులు పోతాయి.
వైసిపి ప్రయత్నాలు ఫలిస్తాయా..!!
వైసిపి లోకి నందమూరి వారసుడు ఎంట్రీ ఇస్తున్నారా. పార్టీలోని అత్యంత ముఖ్యులతో రాయబారాలు జరుగుతున్నాయా . వైసిపిలోకి ఊహాంచని ఎంట్రీ. ఎంతో కాలంగా టిడిపి అధినాయకత్వ తీరు పై మానసికంగా ఆవేదన చెందుతున్న నందమూరి వారసుడు వైసిపి లోకి రావటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి, రాజ్యసభ మాజీసభ్యు డు నందమూరి హరికృష్ణ ను వైసిపలోకి తీసుకొచ్చి..ఎన్నికల ముందు టిడిపికి షాక్ ఇచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారం కోసం వాడుకోవటం..ఆ తరువాత పూర్తిగా పక్కన పెట్టే యటంతో జూనియర్ ఎన్టీఆర్ సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
నందమూరి హరికృష్ణ సైతం పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. దీంతో..ఆయన తో సన్నిహితంగా ఉండే వైసిపిలోని ఓ ఎమ్మెల్యే దీని కోసం చొరవ తీసుకున్నట్లు ప్రచారం జరగుతోంది. కృష్ణా జిల్లాలో పర్యటన సందర్భంగా జగన్ ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ప్రకటించారు. దీనిపై నందమూరి వారసుల నుండి హర్షం వ్యక్తం అయింది. ఈ ప్రకటన అధికారంలో ఉ న్నటిడిపి ప్రభుత్వం ఎందుకు చేయలేదని ప్రశ్నలు వినిపించాయి. జగన్ ప్రకటన పై అప్పట్లోనే హరికృష్ణ సైతం సంతోషం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల ముందు వైసిపి నుండి మరి కొంత మంది నేతలను తమ పార్టీ లోకి చేర్చుకొని వైసిపిని దెబ్బ కొట్టాలని టిడిపి ఆలోచనలకు కౌంటర్ గా వైసిపి కొత్త ఎత్తుగడలను సిద్దం చేస్తోంది. అ యితే, హరికృష్ణ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. హరికృష్ణను ఒప్పించేందుకు ఆ ఎమ్మెల్యేతో పాటు గా ఇద్దరు సీనియర్లు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ పాదయాత్ర ముగిసే లోగానే దీని పై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతన్న పరిస్థితుల్లో.. టిడిపిని కాదని హరికృష్ణ వైసిపిలో చేరితే మాత్రం టిడిపికి అది కోలుకోలేని దెబ్బగానే మారుతుంది.