వైసిపి అధినేత జగన్ సంచలన ప్రకటన. అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లా నిమ్మకూరు లో పాదయాత్రలో భాగంగా జగన్ ఈ ప్రకటన చేసారు. ఇది వ్యూహాత్మకంగా చేసిన ప్రకటనగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచి టిడిపి ని హైజాక్ చేసిన వ్యక్తిగా చంద్రబాబును జగన్ ప్రతీ సభలో విమర్శిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఆయన ఫొటోకే దండ వేసి నివాళి అర్పించే ఘనుడు చంద్రబాబు అని జగన్ ప్రతీ సందర్భంలో చేసే ఆరోపణ. అయితే, ఎన్టీఆర్ మరణం తరువాత సమైక్య రాష్ట్రంలో, రాష్ట్ర విభజన తరువాత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ఆలోచన చేయలేదు. ఇప్పటికీ, ఎన్టీఆర్ పేరుతోనే టిడిపి నేతలు రా జకీయాలు చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పై అభిమానంతోనే టిడిపికి మద్దతుగా నిలుస్తు న్నారు. చంద్రబాబు పై నమ్మకం లేకపోయినా, ఎన్టీఆర్ పెట్టిన పార్టీగా ఆదరిస్తున్నారు.
ఎన్టీఆర్ అభిమానులకు ఆకట్టుకొని చంద్రబాబుకు పై వ్యతిరేకత పెంచేలా జగన్ ఈ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులంతా ఒక్కసారిగా జగన్ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక, టిడిపిలోనూ జగన్ ప్రకటన పై కలకలం మొదలైంది. ప్రధానంగా కృష్ణా జిల్లాలో టిడిపికి అండగా నిలుస్తున్న ఓ ప్రధన సామాజిక వర్గ ఓటర్లు సైతం జగన్ నిర్ణయం తో ఆలోచనలో పడ్డారు. ఇటువంటి నిర్ణయం టిడిపి అధినేత అధికారంలో ఉన్నా, తీసుకోలేకపో యారనే చర్చ మొదలైంది. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం సైతం పురంధేశ్వరి కేంద్రమంత్రి గా ఉన్న సమయంలోనే సాధ్యమైంది.
ఎన్టీఆర్ కు భారతరత్న విషయాన్ని కేవలం ఎన్టీఆర్ జన్మదినం నాడు మినహా టిడిపి నేతలు ప్రస్తావించరు. ఇటువంటి సందర్బంలో నిమ్మకూరులో కాలు పెట్టిన జగన్ చేసిన సంచలన ప్రకటన తో చంద్రబాబు ను ఆత్మరక్షణలోకి పడేయటంతో పాటుగా, కొత్త రాజకీయాలకు జగన్ తెర లేపినట్టైంది. జగన్ ప్రకటనతో ఇక, అధికారంలో ఉన్న టిడిపి ఇప్పుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినా, ఆ క్రెడిట్ జగన్ కే దక్కుతుంది. ఇక, నిమ్మకూరు లో ఎన్టీఆర్ బంధువుల అక్కడ టిడిపి నేతలు చేస్తున్న అన్యాయాలను, దౌర్జన్యాలను జగన్ కు చూపించారు. దీని ద్వారా జగన్ తాను అందరివాడినని టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన గ్రామంలోనే చాటి చెప్పారు. టిడిపి ని నైతికం గా కోలుకోలేని దెబ్బ తీసారు. మరి జగన్ తాజా నిర్ణయం పై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.