ప్రతి అడుగు ఏ ప్రభంజనం. ప్రతీ సభకు నీరాజనం. జనం కోసం జగన్. జగన్ కోసం జనం. అన్న వస్తున్నాడు అంటూ నవరంబర్ 6, 2017 న ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రజల్లోనే ఉంటూ..ప్రజల కోసమే అంటూ జగన్ ప్రారంభించిన పాదయాత్ర చారిత్రాత్మక అధ్యయానికి శ్రీకారం చుట్టింది. నడుము నొప్పితో బాధిస్తున్నా.. బెల్టుతో ఆ నొప్పిని అణిచివేస్తూ..కాళ్లకు బొబ్బలు అయినా..చిరునవ్వుతో ఆ నొప్పిని చిదిమేస్తూ..జగన్ ప్రారంభించిన పాదయాత్ర రెండు వేల కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని పశ్చిమ గోదావరి జిల్లాలోని మాదేపల్లి-ఏలూరి మధ్యలో జగన్ 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్న ప్రాంతంలో 40అడుగుల భారీ పైలాన్ ను ఏర్పాటు చేస్తున్నారు. జగన్ పాదయాత్రకు స్పందనే లేదంటూ టిడిపి నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా..లోపల మాత్రం ఓ ప్రత్యేక టీం ద్వారా జగన్ యాత్రకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
ఏ జిల్లాలో యాత్ర జరిగినా..ఎక్కడ సభ పెట్టినా ప్రతీ చోట జన నీరాజనమే. ఇప్పటి వరకు 160 రోజుల యాత్ర పూర్తి చేసుకొని..161 రోజున రెండు వేల కిలో మీటర్ల మైలు రాయి చేరుకున్నారు. ఈ అకుంఠిత దీక్షకు గుర్తుగా 40 అడుగుల పైలాన్ ఆవిష్కరిం చనున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది జిల్లాల్లో 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 122 మండలాల్లో.. వెయ్యికి పైగా గ్రామాల్లో జగన్ పాదయాత్ర పూర్తి చేసారు. జగన్ పట్టుదల..తెగువ చూసి తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేక పోయినా.. పచ్చ మీడియా పట్టించుకోకపోయినా… ఢిల్లీ పెద్దలు సైతం జగన్ కార్యదక్షత చూసి అబ్బుర పడుతున్నారు. నేషనల్ మీడియా సైతం ఫ్లాట్ అయింది.
జగన్ యాత్రకు స్పందన రాయలసీమకే పరిమితం అన్నారు. కాదు..జగన్ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని రుజువు చేసారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జగన్ తనసత్తా చాటారు. తమకు తిరుగులేదని టిడిపి నేతలు విర్రవీగే కృష్ణా జిల్లా అందునా విజయవాడ ఎంట్రీ సమయంలో కనకదుర్గ బ్యారేజీ జన ప్రవాహంతో ఊగిపోయింది. తన యాత్రలో చంద్రబాబు మూలాలనే దెబ్బ తీస్తూ..ఇక, చంద్రబాబు ఏం చెప్పినా నమ్మలేని పరిస్థితి కల్పించారు. చంద్రబాబు హామీల అమలు లో వైఫల్యాలను ఎండగడుతూ..తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తానో స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో అమలు చేసే హామీల ను వివరిస్తూనే.. నియోజకవర్గ స్థాయి సమస్యలను ప్రస్తావిస్తున్నా రు. తన తండ్రి ప్రజల కోసం చేసిన దాని కంటే..వైయస్ కుమారుడిగా రెండగులు ముందుకు వేస్తానని చెబుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన జగన్ కు ఈ జిల్లాతో పాటుగా మిగిలిన అయిదు జిల్లాలు కీలకం కానున్నా యి. పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. మొత్తంగా మూడు వేల కిలో మీటర్ల లక్ష్యంగా మొదలైన పాదయాత్రలో ఇదొక కీలక ఘట్టం. వచ్చే ఎన్నికల్లో నవర్ ఆర్ నెవర్ అనే విధంగా ముందకెళ్తున్న జగన్ కు అభిమానులు సాహో అంటూనే..నీ వెనుక మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఇక, ఇక్కడ నుండి జగన్ వేసే ప్రతీ అడుగు కీలకమే