అదే జరిగితే… జగన్ అభిమానులకు పండగే పండగ – Jagan Fans celebrations started

0
438

వైసిపి కి కొత్త జోష్‌. ఏపి ప్ర‌జ‌లు వైసిపి ని గుండెల్లో పెట్టుకొనే రోజు ఇది. హోదా పేరుతో టిడిపి ఆడుతున్న డ్రామాల‌ను తొక్కిపెట్టి..ప్ర‌జ‌ల్లో వైసిపి ఎంపీలు హీరోలుగా నిలిచే రోజు. ఈ రోజే వైసిపి ఎంపీల రాజీనామాకు ఆమోదం. ఏపి కి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ ద‌శ‌ల వారీ పోరాటంలో భాగంగా వైసిపి కి చెందిన అయిదుగురు ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీ నామా చేసి దీక్ష‌లు చేసారు. అప్ప‌టి దాకా హోదా పై అనేక యూ ట‌ర్న్‌లు తీసుకున్న టిడిపి..అప్ప‌టి దాకా ఏపికి హోదా అవ‌స‌రం లేద‌న్న నోటితోనే..ఏపికి హోదా కావాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇక‌, లోక్‌స‌భ స్పీక‌ర్ పిలుపు మేర‌కు వైసిపికి చెం దిన అయిదుగురు ఎంపీలు స్పీక‌ర్ తో స‌మావేశ‌మ‌వుతున్నారు. రాజీనామాల పై పునరాలోచ‌న ఉందా అని స్పీక‌ర్ మ‌రోసారి వైసిపి ఎంపీల‌ను అడ‌గ‌నున్నారు. అయితే, వైసిపి ఎంపీలు ఇప్ప‌టికే స్పీక‌ర్ తో ఏం చెప్ప‌బోతున్నారో స్ప‌ష్టం చేసారు. త‌మ రాజీనామాల విష‌యంలో వెన‌క‌డుగు లేద‌ని..ఇస్తే ఏపికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని..లేకుంటే రాజీనామాలు ఆమో దించాల‌ని డిమాండ్ చేస్తామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో..వైసిపి ఎంపీల రాజీనామాల ఆమోదం ఖాయంగా క‌నిపిస్తోం ది. ఇక‌, రాజీనామాలు ఆమోదించిన త‌రువాత ఏం జ‌రుగుతుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తి క‌ర అంశం. ఆ వెంట‌నే లోక్‌స‌భ కా ర్య‌ద‌ర్శి కార్యాల‌యం ఆ అయిదు లోక్‌స‌భ స్థానాలు ఖాళీలుగా గుర్తిస్తూ నోటిఫై చేస్తారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం ఉపఎన్నిక‌ల నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఉప ఎన్నిక‌ల కోసం సిద్దంగా ఉన్నామ‌ని వైసిసి ప్ర‌క‌టించింది. ఇక‌, ఏపి అధికార పార్టీకి ఇప్పుడు ఇదే కొత్త టెన్ష‌న్ తెచ్చి పెడుతోంది. రాజీనామాలు ఆమోదం ఖాయ‌మ‌ని టిడిపి సైతం భావిస్తోంది. అయితే, ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఉప ఎన్నిక‌లు వ‌స్తే త‌మ‌కు భారీ న‌ష్ట‌మ‌నే విష‌యా న్ని టిడిపి అంత‌ర్గ‌తంగా అంగీక‌రిస్తోంది. దీంతో..టిడిపి అధినేత బ‌య‌ట‌కు ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని…ఒక వేళ వ‌చ్చినా..సిద్దంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. దీంతో..స్పీక‌ర్.. ఎన్నిక‌ల సంఘం ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే టెన్ష‌న్..మ‌హానాడు వేడుక‌ల్లో ఉన్న టిడిపి నేత‌ల్లో క‌నిపిస్తోంది. నిన్న మోత్కుప‌ల్లి..నేడు వైసిపి ఎంపీలు మ‌హానాడు వేడు క‌ల‌ను డామినేట్ చేసేలా ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఇదే..టిడిపికి మింగుడు ప‌డ‌టం లేదు. రాజీనామాలు ఆమోదం పొంద‌టంతోనే..తాము ప్ర‌త్యేక హోదా పై చేస్తున్న పోరాటానికి ప్ర‌జా మ‌ద్ద‌తు ఉంద‌ని మ‌ద్ద‌తు మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్న ట‌డిపి నేత‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌టం ఖాయం. హోదా కోసం రాజీనామాలు చేసిన ఎంపీల పై పోటీకి పెటినా.. పోటీకి దిగ‌క‌పోయినా..రెండు ర‌కాలుగా టిడిపికి న‌ష్ట‌మే. దీంతో…ఇది వైసిపి-బిజెపి డ్రామా అంటూ టిడిపి డొల్ల ప్ర‌చారాన్ని తెర మీద‌కు తెస్తోంది. కేంద్ర తీరుకు వ్య‌తిరేకంగా రాజీనామాలు చేస్తే..బిజెపి తో క‌లిసి ఆడుతున్న డ్రామా గా చెప్ప‌టం ద్వారానే టిడిపి డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుతోంది. అయితే, మ‌హానాడు ముగింపు వేల‌..టిడిపి కి ఢిల్లీ నుండి భారీ షాకింక్ న్యూస్ ఖాయంగా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here