జగన్ లో ఉన్నదీ, చంద్రబాబు లో లేనిదీ అదే. నాడు దేశంలోనే శక్తివంతురాలిగా ఉన్న సోనియా ను ఎదిరించి, కేసులు ఎదుర్కొని, జైలు శిక్ష అయినా ఎక్కడా లొంగని వ్యక్తిత్వం జగన్ సొంతం. నేడు టిడిపి అధినేత మాత్రం కేంద్రం తనకు ఏ ఆపద చేపట్టినా అండగా నిలవాలంటూ వేడుకుంటున్నారు. అసలు ఏ తప్పు చేయకపోతే..తమ పై చర్యలు తీసుకుంటా రనే భయం టిడిపి నేతల్లో ఎందుకు కనిపిస్తుందనేది అందరి ప్రశ్న. తన తండ్రి మరణించిన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు నల్లకాల్వ సాక్షిగా ఇచ్చిన మాట కోసం జగన్ ఎక్కడా రాజీ పడలేదు. నాడు దేశం లో సోనియా సర్వ శక్తి వంతురాలు.
ఓదార్పు యాత్ర అవసరం లేదు బాధితులను అందరినీ ఒకే చోట చేర్చి వారికి సాయం చేయాలని సూచించారు. అయినా జగన్ నో అన్నారు. తాను ఇచ్చిన మాట కోసం పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేసారు. ఫలితంగా జగన్ పై కేసులు.విచారణలు. జైలు శిక్ష అయినా ప్రజలనే నమ్ముకున్నారు. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, ఫలితంగా కడప ఉప ఎన్నికల్లో 5 లక్షల 45 వేల, మెజార్టీతో విజయం. తన పై కక్ష్య సాధింపు చర్యలు మొదల వుతున్నాయనే సమాచారం ఉన్నా ఎప్పుడూ ఆందోళన చెందలేదు. అన్నింటికీ సిద్దమన్నట్లుగా చెరగని చిరునవ్వు తోనే ప్రజల మధ్యనే నిలిచారు. అక్కడి నుండి నేటి ప్రత్యేక హోదా కోసం దేశం మొత్తం ప్రధానిని చూసి మోదీతోనా అనుకునే పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం పై తొలి అవిశ్వాసం పెట్టిన పార్టీ వైసిపి పెట్టిన నేత జగన్. ఆ వెంటనే టిడిపి అధినేతకు చరిత్ర గుర్తుకువచ్చింది. తాము ప్రభుత్వం పై అవిశ్వాసం ఇస్తున్నామంటూ ముందుకొచ్చారు. ఇక, ఇప్పుడు ప్రతీ వేదిక పై బిజెపి ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నారు. ఇంతలోనే ఆయన మాటల్లో ఎక్కడో భయం, ఆందోళన కనిపిస్తున్నాయి.
కేంద్రం నుండి సమస్యలు వస్తాయని టిడిఎల్పీ సమావేశంలోనూ పేర్కొన్నారు. తాజాగా కేంద్రం నుండి ఏ ఆపద వచ్చినా నా చుట్టూ ఉండాలి అంటూ ప్రజలను చంద్రబాబు అభ్యర్ధిస్తున్నారు. ఇదే జగన్ – చంద్రబాబు మధ్య ఉన్న నాయకత్వ లక్షణాలకు. తెగువ గురించి చర్చించుకోవటానికి కారణమైంది. ప్రతీ చోట లాలూచీ రాజకీయాలు. మద్దతు మీడియా తో నెట్టుకొస్తున్న టిడిపికి. జగన్ లాగా దేన్నైనా నేరుగా ఎదుర్కొనే శక్తి మాత్రం లేదనే విషయం స్పష్టమవుతోంది. జగన్ కు ఉన్న తెగువ చంద్రబాబులో లేదనే విషయం మరో సారి స్పష్టమైంది. అందుకనే జగన్ ను అభిమానులు అంతగా ఆరాధించేది..