చంద్ర‌న్నా..ఇక్క‌డ ఉన్న‌ది జ‌గ‌న‌న్న – Jagan Mania In Mahanadu

0
509

జ‌గ‌న్ కు భ‌యం అంటే తెలుసా..
చంద్ర‌న్నా..ఇక్క‌డ ఉన్న‌ది జ‌గ‌న‌న్న..!!
మ‌హానాడు కు జ‌గ‌న్ ఫోబియా..!!

ఇది 1990 ద‌శకం కాదు. 2018. ఇప్పుడు ఇక్క‌డ ఉన్న‌ది జ‌గ‌న్‌. ఏపి శ‌శి క‌ళ అవుతాన‌నే భ‌యం జ‌గ‌న్ లో ఉందా. జ‌గ‌న్ లో ఆ భ‌యం అనేది ఉంటే..ఇంత భారీ ప్ర‌జాద‌ర‌ణ ఎలా పొందుతారు. జ‌గ‌న్ కేసుల గురించి అస‌లు టిడిపి నేత‌ల‌కు ఎందుకు ఇంత భ‌యం. మ‌హానాడు వేదిక‌గా టిడిపి అధినేత జ‌గ‌న్ నామ స్మ‌ర‌ణ‌తో స‌భ‌ను మారు మ్రోగించారు. మోదీ భుజం పై తు పాకీ పెట్టి..జ‌గ‌న్ ను కార్న‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ వాద‌న‌ను టిడిపి నేత‌లు..మ‌ద్ద‌తు మీడియా త‌మ శ‌క్తి కొల‌దీ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఎన్డీఏ తో విడిపోయిన నాటి నుండి నేటి వ‌ర‌కు కేంద్రం త‌మ పై కేసులు పె డుతుంద‌ని భ‌య ప‌డుతుంది ఎవ‌రు. ఏ త‌ప్పు చేయ‌ని వారికి ఆ ఆలోచ‌న ఎందుకు వస్తుంది. కేంద్రం త‌న మీద‌కు వ‌స్తే అండ‌గా నిల‌వండంటూ వేడుకుంది ఎవ‌రు. జ‌గ‌న్ త‌న పై ఉన్న కేసుల‌ను ఎదుర్కొంటున్నా రు. ఏనాడా అండ‌గా నిల‌వ మ‌ని వేడుకున్న సంద‌ర్భం లేదు. జ‌గ‌న్ కేసుల ద‌ర్యాప్తు నెమ్మ‌దించినాయ‌ని టిడిపి అధినే త వాపోతున్నారు. జ‌గ‌న్ కేసుల పై చంద్రబాబు ఎందుకు అంత ఆస‌క్తి చూపిస్తున్నారు. కేసులు తేలిపోతే..వీగిపోతే..తాము చేసిన దుష్ప్ర‌చారం త‌ప్ప‌ని తేలిపోతుంద‌నా. జ‌గ‌న్ అనుభవం గురించి ప్ర‌శ్నిస్తున్నారు. కొంత కాలంగా ఏపిలో ఏం జ‌రుగుతుందో అంద‌రూ చూస్తు న్నారు.

జాతీయ నేత‌ల‌తో పాటుగా నేష‌న‌ల్ మీడియా సైతం టిడిపి అధినేత ప‌క్కా గా జ‌గ‌న్ ను ఫాలో అవుతున్నార‌ని..జ‌గన్ డిసైడ్ చేసిన ఎజెండానే టిడిపి ఫాలో అవుతుంద‌ని నేష‌న‌ల్ మీడియా సైతం చెప్పుకొస్తోంది. ఇక‌, జ‌గ‌న్ కు భ‌యం అంటే తెలుసా. దేశంలో ఇద్ద‌రు ప్ర‌ధాన వ్య‌క్తులు సోనియా..ప్ర‌ధాని మోదీ. ఆ ఇద్దరినీ దేశంలో ఎదిరించిన మొద‌టి వ్య‌క్తి జ‌గ‌న్‌. సోనియా ను ధిక్క‌రించి పార్టీ పెట్టారు. ఎదురైన క‌ష్టాల‌ను చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఇక‌, ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం మోదీ ప్ర‌భుత్వం పైనే అవిశ్వాసం పెట్టిన తొలి పార్టీ వైసిపి. ఇక‌, కాంగ్రెస్ కు అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌. బిజెపికి అస‌లే లేదు. తామే కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిసైడ్ చేసేది అంటూ చెప్పుకొచ్చారు. మూడో ఫ్రంట్ అంటూ చెప్పుకొచ్చిన జెడిఎస్ ఎవ‌రితో క‌లిసింది..బెంగుళూరు వేదిక‌గా చంద్ర‌బాబు ఎవ‌రితో చట్టా ప‌ట్టాల్ వేసుకుంటూ ఫొటోల‌కు ఫోజులిచ్చారు. టిడిపికి నిర్దిష్ట స్టాండ్ లేదు. ఎప్పుడు ఎవ‌రితో క‌లుస్తారో న‌మ్మ‌కం లేని పార్టీ. క్రెడిబులిటీ క్రైసిస్ ఎదుర్కొంటున్న పార్టీ టిడిపి. ఇక‌, ఏపిలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోంది. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా వైసిపి ఉంది. ఉన్న‌వే 25 సీట్లు. ఎన్ని గెలుస్తారో తెలియ‌దు. ఏపిలో ప్ర‌భుత్వం తిరిగి నిల‌బెట్టు కోవ‌ట‌మే ఇప్పుడు అస‌లైన ఛాలెంజ్‌. ఈ ప‌రిస్థితుల్లో మ‌హానాడు వేదిక‌గా మ‌భ్య‌పెట్టే మాట‌ల‌తో..జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొనే టిడిపి మ‌హానాడు ను జ‌గ‌న్ నామ స్మ‌ర‌ణ స‌భ‌గా మార్చేసారు. కానీ, అప్పుడు ఏకైక రీజ‌న‌ల్ పార్టీగా ఏపిలో చంద్ర‌బాబు ప్ర‌భావం చూపించారు. 2014 ఎన్నిక‌ల్లో మోదీ-ప‌వ‌న్ స‌హ‌కారం లేకుంటే ఫ‌లితాలు మ‌రోలా ఉండేవి. ఇప్పుడు ఆ ఇద్ద‌రూ దూర‌మ‌య్యారు. జ‌గ‌న్ను ఒంట‌రిగా ఎదుర్కోవటానికి 2014లో టిడిపి జంకింది. మ‌రి..ఇప్పుడు జ‌గ‌న్ ను ఏ విధంగా ఎదుర్కోగ‌ల‌దు..అంత‌గా గ‌న్ ఫోభియా టిడిపిని వెంటాడుతోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here