పార్టీలో చేరిక‌ల పై జగన్ కొత్త స్ట్రాటజీ – Jagan Mind Blowing Strategy

0
569
జ‌గ‌న్ కొత్త స్ట్రాట‌జీ  పార్టీలో చేరిక‌ల పై కొత్త స‌మీక‌ర‌ణాలు. చంద్ర‌బాబు రాజ‌కీయం పై అణువ‌ణువు తెల‌సిన నేత‌ల‌కు ప్రాధాన్య‌త‌. బ‌లంగా పార్టీ వాయిస్ వినిపించ‌టంతో పాటుగా టిడిపి కంచుకోట‌ల‌ను బ‌ద్ద‌లు చేయ‌గ‌లిగిన నేత‌ల వైపే జ‌గ‌న్ మొగ్గు. అందులో భాగంగానే తాజాగా వైసిపి లో మొద‌లైన చేరిక‌లు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, 25 సాయంత్రం వైసిపి లో చేర‌నున్నారు. తొలి నుండి చంద్ర‌బాబు అంటే విరుచుకుపడే క‌న్నా వైసిపి లో చేర‌టం అద‌న‌పు బ‌లంగా మార‌నుంది. 14 ఏళ్ల పాటు మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం తో పాటుగా ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ లో అనుభ‌వం ఉన్న నేత‌. పెద‌కూర‌పాడు, నుండి నాలుగు సార్లు గుంటూరు వెస్ట్ నుండి ఒక సారి ఎమ్మె ల్యేగా గెలిచారు. టిడిపి రాజ‌కీయాల పై నాడు వైయ‌స్ తో క‌లిసి పోరాడారు. అమ‌రావ‌తి కేంద్రంగా చంద్ర‌బాబు శైలి పై విరుచ‌కుప‌డే బ‌ల‌మైన వాయిస్ ఇప్పుడు వైసిపి కి దొరికింది. పాల‌నా ప‌రంగా ఉన్న అనుభ‌వంతో పాటుగా పెద‌కూర‌పాడు, గుంటూరు వెస్ట్‌, స‌త్తెనప‌ల్లిలో, నూ కన్నా ప్ర‌భావం చూపించ‌గ‌ల‌రు.
టిడిపి వ్యూహాలు ఎలా ఉంటాయ‌నే దాని పైనా పూర్తి అవగాహ‌న ఉన్న నేత‌. క‌న్నాకు పెద‌కూర‌పాడు నుండి సీటు ఇస్తామ‌ని వైసిపి అధినేత హామీ ఇచ్చారు. ఇక‌, క‌ర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటిషియ‌న్ కాట‌సాని రాంభూపాల్ రెడ్డి, ఈ నెల 29న వైసిపి లో చేర‌నున్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి ఐదు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని  2014 ఎన్నికల్లో స్వతంత్ర, అభ్యర్థిగా బరిలో దిగారు. 60వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. కాట‌సానికి నంద్యాల లేదా డోన్ నుండి అవ‌కాశం ఇచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
నంద్యాల ఎంపీ తో పాటుగా శ్రీశైలం సీటును శిల్పా కుటుంబానికి ఇవ్వ‌టం ద్వారా నంద్యాల సీటు కాట‌సానికి ఇస్తార‌ని ఒక స‌మీక‌ర‌ణ వినిపిస్తోంది. డోన్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండ‌టంతో ఈ ఫార్ములా తెర మీదకు వ‌చ్చింది. గౌరు కుటుంబానికి జ‌గ‌న్ బుజ్జ‌గించి స‌ర్దుబాబు చేయ‌గ‌లిగితే డోన్ నుండే కాట‌సాని పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇక‌, కృష్ణా జిల్లా లో టిడిపి మ‌ద్ద‌తుగా నిలిచే ఓ కీల‌క సామాజిక వ‌ర్గానికి చెందిన నేత వ‌సంత కృష్ణ ప్ర‌సాద ఈ నెల 30న వైసిసి లో చేర‌నున్నారు. కాట‌సారి, కృష్ణ ప్ర‌సాద్ ఇద్ద‌రూ గుడివాడ‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరుతారు. ఇలా..టిడిపి రాజ‌కీయాల పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న వారు సామాజికంగా వారి ప్రాంతాల్లో ప్ర‌భావితం చేయ‌గ‌లిగిన వారు  వైసిపి లో టిడిపి కి వ్య‌తిరేకంగా గ‌ట్టి వాయిస్ వినిపించ‌టం తో పాటుగా పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ చేయ‌గ‌లిగిన స‌త్తా ఉన్న వారినే పార్టీలోకి జ‌గ‌న్ ఆహ్వానిస్తున్నారు. దీని ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ల‌క్ష్యం ఏంటో స్ప‌ష్టం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here