వైసిపి అభిమానులు స్పందించాలి. వచ్చే ఎన్నికల్లో వైసిపి పొత్తు ఎవరితో. ఒంటరి పోరుకే జగన్ మొగ్గు చూపుతున్నారు. కానీ, అంతర్గతంగా వైసిపి లో అనేక చర్చలు నడుస్తున్నాయి. పొత్తు ఎవరితో పెట్టుకోవాలి. కాంగ్రెస్ – బిజెపి లతో కలిసి ఎన్నికల్లో అడుగు వేసే అవకాశం లేనే లేదు. ఇక, వామపక్షాలు పవన్ తో ఉన్నాయి. సీపియం వైసిపి వైపు ఆసక్తిగా ఉన్నా అది ఎంత వరకు ఎన్నికల్లో మేలు చేస్తుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అటు టిడిపి నేతలు మాత్రం ఇచ్చే ఎన్నికల నాటికి జరిగే పరిణామాలు తమకు సహకరిస్తాయని ధీమాగా చెబుతున్నారు. వచ్చేది సంకుల సమరమంటూనే.. అనేక పార్టీలు పొత్తులు లేకుండా బరిలోకి దిగటం ద్వారా..బహుముఖ పోరు జరుగుతుందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని..తాము తిరిగి అధికారంలోకి రావాటం ఖాయమని చెబుతున్నారు. ఇక, పోల్ మేనేజ్‌మెంట్..పొలిటికల్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అధికారంలో ఉండటంతో తమకే కలిసి వస్తాయని వారు ఈలెక్కలన్నీ చెప్పుకొస్తున్నారు. ఇదే సమయంలో..టిడిపి వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే..జగన్ – పవన్ తో కలవా లని కొందరు సీనియర్ పొలిటిషియన్లు సూచన చేస్తున్నారు. దీని కారణంగా.. హోదా సెంటిమెంట్ తో పాటుగా టిడిపిని అడ్రస్ లేకుండా చేయగలుగుతారని వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ తాను ఇప్పటికే సీయం అభ్యర్ధిని కానని ప్రచారం చేసు కుంటున్నారని..ఇద్దరి ఉమ్మడి శత్రువు టిడిపి నే కాబట్టి..ఈ ప్రయోగం ద్వారా..ఓట్ల చీలికను నివారించి టిడిపి అధికారం లోకి రాకుండా చేయవచ్చేనేది వారి వాదన. అయితే, జగన్ మద్దతుదారులు మాత్రం ఒంటరి పోరు ద్వారా తాము ఈ సారి గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పొత్తు అవసరం లేదని చెబుతున్నారు. జగన్ – పవన్ కలవటం…జనసేన కు కొన్ని సీట్లు కేటాయించటం ద్వారా జగన్ లబ్ది పొందుతారని వారు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రతిపాదన పై రెండు పార్టీల్లోని కొందరు నేతలు చర్చలు చేస్తున్నా..జనసేన నుండి అవునని..కాదని సంకేతాలు రావటం లేదు. ఇక, వైసిపి నేతలు మాత్రం కార్యకర్తల్లో ఎటువంటి గందరగోళం లేకుండా వైసిపి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. మరి..జగన్ అభిమానుల అంచనాలు ఏంటి. వారి సూచనలు ఏంటి. జగన్ కు పొత్తు అవసరమా.. టిడిపిని ఓడించా లంటే నవ్ ఆర్ నెవర్ అనే రీతిలో సాగే వచ్చే ఎన్నికల్లో జగన్ -పవన్ కలవాల్సిన అవసరం ఉందా..ఇక, మీరే కామెంట్ల రూపంలో స్పందించండి…