ఎన్నికలకు ఏడాది సమయం ఇక లేదు. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు. కర్నాటక ఎన్నికల్లో విజయం ద్వారా లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో బిజెపి హైకమాండ్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ- ఏపి-తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఈ ఏడాది డిసెంబర్‌లో మధ్యప్రదేశ్-చత్తీస్‌ఘడ్
కర్నాటక ఎన్నికల్లో విజయంతో ఇక, నుండి లోక్‌సభ ఎన్నికలకు సిద్దం కావాలని బిజెపి హైకమాండ్ సూచిస్తోంది. అయితే, ఏపిలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలకు టిడిపి ప్రభుత్వం సిద్దంగా లేదు. డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే..వచ్చే మే లో ఏపిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభలో అటు టిడిపి – ఇటు వైసిపి ఇప్పటికే తమను 25 స్థానాల్లో గెలిపించాలని.. అప్పుడు తామే ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెబుతున్నాయి. ఇప్పటికే వైసిపి ప్రత్యేక హోదా కోసం తొలి నుండి పోరాడుతోంది. ఇక, ఇప్పుడు పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల్లోనే ఉన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారితోనే తాము పొత్తు పెట్టుకుంటామని జగన్ చాలా సార్లు స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు కర్నాటక ఎన్నికల ఫలితాలు కూడా తేలి పోవటంతో..ఇక ఏపి పై బిజెపి దృష్టి పెడుతుందని..టిడిపి నేతలకు కష్టాలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు గానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయనే సమాచారం ఇప్పుడు టిడిపి నేతలకు మింగుడు పడటం లేదు. అయితే, పార్లమెంట్ ఎన్నికలు కంటే తమకు ఏపి అసెంబ్లీ ఎన్నికలే కీలకమని టిడిపి నేతలు చెబుతున్నారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో హవా నిరూపించుకోవటం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి చరిత్ర సృష్టించాలనేది వైసిపి లక్ష్యంగా కనిపిస్తోంది.
టిడిపి దాదాపు ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసిపి సైతం ఎవరితో పొత్తు పెట్టుకొనే అవకాశాలు కనిపించ టం లేదు. ఇక, జనసేన-బిజెపి ఏ రకంగా ఎన్నికల్లో దిగుతాయనేది వేచి చూడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎ న్నికల్లో వచ్చే ఫలితాలు…ఓటింగ్ సరళికి అనుగుణంగా ఏపిలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఏపితో పాటుగా కేంద్రంలోనూ తమ సత్తా చాటాలని భావిస్తున్న వైసిపి పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మరి కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ముందస్తు ఎన్నికల పై అధికారికంగా స్పష్టత వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి..ముందస్తు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మీ అంచనాలు కామెంట్ల రూపంలో తెలియచేయండి..