చరిత్ర తిరగరాయాల్సిందే..!!
జగన్ వైఖరితో పార్టీలో టెన్షన్..టెన్షన్..!!
అభ్యర్ధుల స్థానాల మార్పులోనూ జగన్ మార్క్ నిర్ణయాలు..!!
జగన్ వైఖరితో అశావాహుల్లో కొత్త టెన్షన్..!!
వైసిపి అధినేత జగన్ తేల్చి చెప్పేసారు. మోహమాటాలు లేవు. గెలుపే ప్రామాణికం. బంధుత్వాలు..సాన్నిహిత్యాలు కాదు. గెలిచేదెవరు. వారే పార్టీ అభ్యర్ధులు. 2014 ఎన్నికల్లో చేసిన పొరపాట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు లేకుండా 2019 ఎన్నికల కోసం వైసిపి అధినేత పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యేలు..పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయి.. ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఎన్న మొతకతం 80 మంది కి తిరిగి టిక్కెట్లు ఖాయం గా కనిపిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు..నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ల సీట్లు విషయంలో మార్పులు చేర్పులు తప్పేలా లేవు. పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తున్ సర్వేలకు అనుగుణంగా ఈ మార్పుల పై తుది కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డిని..సత్తెనపల్లి నుండి పోటీ చేయించాలని..దీని కారణంగా..సత్తెనపల్లిలో సామాజిక సమీకరణాలు కలిసి వచ్చి పార్టీ అభ్యర్ధి గెలుస్తారి సర్వే నివేదిక సారాంశం. సత్తెనపల్లి నుండి 2014 ఎన్నికల్లో అంబటి రాంబాబు వైసిపి నుండి పోటీ చేసారు. టిడిపి నుండి పోటీ చేసిన కోడెల శివ ప్రసాద్ స్వల్ప మెజార్టీతో ఆ ఎన్నికల్లో గెలుపొందారు. అంబటి రాంబాబుకు సమీపంలోని మరో నియోజకవర్గం సూచిస్తున్నట్లుగా సమాచారం. ఇక, కృష్ణా జిల్లాలో మైలవరం బాధ్యతలు కొత్తగా పార్టీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు అప్పగించి..అక్కడ ఇన్‌ఛార్జ్ గా ఉన్న జోగి రమేష్ కు పెడన బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా..అనంతపురం ఎంపీగా పని చేసిన అ నంత వెంకట్రామరెడ్డికి అనంతపురం ఎమ్మెల్యే నియోజకవర్గ బాధ్యతలను కేటాయించారు.
ఇక, పార్టీ నుండి ఫిరాయించి న వారి నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అభ్యర్ధులే తిరిగి గెలవాలనే లక్ష్యంతో..ఆ సత్తా ఉన్న వారికే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాదయాత్ర ద్వారా దాదాపు 125 నియోజకవర్గాలు కవర్ చేస్తున్న జగన్.. పాదయా త్ర ముగిసిన వెంటనే బస్ యాత్ర ద్వారా మిగిలిన 50 నియోజకవర్గాల్లోనూ పర్యటించనున్నారు. ప్రస్తుతం లోక్‌సభ అభ్య ర్ధుల ఎంపిక పై సర్వే నివేదికలు తెప్పించుకుంటున్న జగన్..ముందుగా లోక్‌సభ అభ్యర్ధుల ఖరారు పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఢిల్లీలో పార్టీ బలం తెలియాలంటే ఎంపి సీట్లను అధిక సంఖ్యలో గెలుచుకోవాలనేది జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీని కోసం ఏ ఒక్క పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా.. ఏ ఒక్క ఛాన్స్ మిస్ కాకుండా..అన్ని రకాలుగా పక్కా వ్యూ హంతో ముందుకు వెళ్తున్నారు. అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర పై జగన్ ప్రత్యేకంగా ఈ వ్యూహాల అమలులో బిజీగా ఉన్నారు. చరిత్ర తిరగరాయాల్సిందే..అని జగన్ చాలా కసిగా పార్టీ నేతలకు తన ఉద్దేశం.. లక్ష్యం ఏంటో చాలా స్పష్టంగా చెబుతున్నారు. దీంతో..గతంలో లాగా వైసిపి టిక్కెట్లు దక్కించుకోవటం అంత సులువు కాద నే విషయం పార్టీ నేతలకు బోధపడుతోంది. ఎక్కడ ఏ మార్పు అవసయమైతే అక్కడ ఆ నిర్ణయం తీసుకోవటానికి వెనుకా డవద్దని పార్టీ వ్యూహకర్తలను జగన్ స్పష్టం చేస్తున్నారు.