వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటమేనని జగన్ తేల్చేసారు. టిడిపి ది దాదాపు ఒంటరి పోరే. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపిలో బహుముఖ పోరు తప్పేలా లేదు. అదే జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం. వైసిపి 2014 ఎన్నికల్లోనూ ఒంటరి పోరుతోనే ప్రజల్లోకి వెళ్లింది. అధికారానికి దాదాపు అయిదు లక్షల ఓట్ల తేడాతో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. టిడిపి ఒక వైపు, పవన్-వామపక్షలు, బి
గత ఏడాది నంద్యాల ఉప ఎన్నికల్లో చూస్తే వైసిపి కి 2014 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు వచ్చాయి. 82 వేల పై చిలుకు ఓట్లు వైసిపి అభ్యర్ధి భూమా నాగిరెడ్డికి దక్కాయి. ఇక, 2017 లో జరిగిన ఉప ఎన్నిక చూస్తూ, వైసిపికి 69,610 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో టిడిపి-బిజెపి-పవన్ కలిసి 46.86 శాతం ఓట్లను దక్కించుకున్నారు. కాగా, వైసిపి కి 44. 80 శాతం ఓట్లు దక్కాయి. 2019 ఎన్నికల నాటికి దాదాపు 14 లక్షల మంది యువ ఓటర్లు ఏపిలో కొత్తగా ఓటు హక్కు దక్కించుకోబోతున్నారు. ఇక, పవన్ విడిగా పోటీ చేస్తే ప్రతీ నియోజకవర్గంలో నాలుగు వేలకు తక్కువ కాకుండా ఆయన అభిమానుల ఓట్లు ఉంటాయనేది ఒక అంచనా. అవి జనసేనకు పడటం వలన టిడిపికి నష్టం. ఇక, బిజెపి ఓట్లు చీలిపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఓట్లు టిడిపి – వైసిపి మధ్య ఎంత మేర షేర్ అవు తాయనేది చూడాలి. అయితే, పవన్ కళ్యాన్, బిజెపి విడివిడిగా పోటీ చేసినా, తమ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందని టిడిపి నేతల అంచనా. అయితే, వైసిపి వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఎవరెంత మంది పోటీలో ఉన్నా, తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని, ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిపోయారు కానీ, కేడర్ వెళ్లలేదని 20 14 ఓటు బ్యాంకు కు అదనంగా ఈ సారి మరి కొన్ని వర్గాల మద్దతు వైసిపికే ఉంటుందని వారి విశ్లేషణ. ప్రత్యేకించి, గత ఎన్నికల్లో రుణమాఫీ కారణంగా, రైతులు-డ్వాక్రా మహిళలు కొందరు టిడిపి కి ఓట్లు వేసారని ఈ సారి వారు వైసిపి వైపు మొగ్గుతారని వైసిపి అంచనా వేస్తోంది.
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీగా కొత్త తరం ఓటర్లు వైసిపి కి మద్దతుగా నిలుస్తారని లెక్కలు చెబుతున్నారు. ఇక, జగన్ కు ఒక్క సారి అవాకశం ఇద్దామనే చర్చ నడుమ ఖచ్చితంగా వైసిపి కి న్యూట్రల్ ఓటర్ల నుండి సానుకూలంగానే ఓట్లు పడతాయని విశ్లేషకులు చెబుతున్న మాట. ఒంటరి పోరు అంటూ నవ్ ఆర్ నెవర్ అనే సిట్యుయేషన్ లో బరిలోకి దిగుతున్న జగన్..ఈ సారి ఏ అవకాశాన్ని విడిచిపెట్టేందుకు సిద్దంగా లేరు. దీంతో..ప్రతీ నియోజకవర్గంలో అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్ధి ఎంపిక మొదలు..పోల్ బూత్ లెవల్ మేనేజ్‌మెంట్ వరకు ప్రతీ అంశాన్ని సున్నితంగా పరిశీలిస్తున్నారు. మరి..బహుముఖ పోరుగా మారుతున్న 2019 ఎన్నికల్లో ఎవరెటువైపు ఉంటున్నారో..క్షేత్ర స్థాయిలో అంచనాలేంటో కామెంట్ల రూపంలో వాస్తవ పరిస్థితిని మీరే తెలియచేయాలి.