ఏపికి కాబోయే సీయం జ‌గ‌న్‌.. తేల్చి చెప్పిన గుగూల్‌ – Jagan tops in Google Search as next CM

0
499

ఏపికి కాబోయే సీయం జ‌గ‌న్‌..
తేల్చి చెప్పిన గుగూల్‌..

ఏపికి కాబోయే సీయం జ‌గ‌న్‌. ఇది వైసిపి మాట కాదు. గుగూల్ తేల్చి చెబుతున్న విష‌యం. గుగూల్ లో 2019 లో ఆంధ్రప్ర‌దేశ్ కు కాబోయే సీయం అంటూ టైపు చేయ‌గానే జ‌గ‌న్ పేరు ద‌ర్శ‌న మిస్తోంది. అంతే కాదు..కోరా అంత‌ర్జాతీయ సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నే ప్ర‌శ్న తో 2016 నుండి పోలింగ్ కొన‌సాగిస్తోంది. అది ఇంకా కొనసాగుతోంది . అందులోనూ కాబోయే సీయం జ‌గ‌న్ అని  నెటిజెన్లు అనుకూలంగా ఓటింగ్ చేస్తున్నారు. ఇందులో టిడిపి మ‌ద్ద‌తు దారులు ఉన్నారు. 2016  కంటే 2017 లో మ‌రింత‌గా..అతంకంటే 2018 మరింత మెరుగ్గా జ‌గ‌న్ ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఏపి లో టిడిపి- బిజెపి క‌లిసి ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ వైపే నెటిజెన్లు ఓటింగ్ లో మొగ్గు చూపారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల హామీల అమ‌లులో టిడిపి వైఫ‌ల్యం చెందింద‌ని..ఏపి అభివృద్దిలో విఫ‌ల‌మైంద‌ని అధికార పార్టీ పై నెటిజెన్లు త‌మ అభి ప్రాయాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఏపి విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరు పైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇక‌, వైసిపి అధి నేత జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా అన్ని వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర‌వుతున్న విష‌యాన్ని నెటిజెన్లు తమ అభిప్రాయాల‌ను విశ్లేషించారు. ఇక‌, క‌ర్నాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కొంత మంది ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమానులు త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకు న్నారు. క‌ర్నాట‌క లో జెడిఎస్ త‌ర‌హాలో ఏపిలో జ‌న‌సేన కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని వారు అభిప్రాయ ప‌డ్డారు. టిడిపి కి సంబంధించిన అభిమానులు సైతం ఈ ఓటింగ్ లో త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేసుకున్నారు. ఇక‌, తాజాగా చేసిన పోస్టింగ్స్‌లో జ‌గ‌న్ కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న బ‌లంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ద్వారా అన్ని వ‌ర్గాల‌ను ఆకట్టుకుంటూ బ‌ల‌మైన నేత‌గా ఎదిగార‌నే అభిప్రాయం ఎక్కువ‌గా క‌నిపించింది.  ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రూ ప‌రిశీలించే గుగూల్‌లో ఏపి భ‌విష్య‌త్ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ పేరు క‌నిపించ‌టం పైనా ర‌క‌ర‌కాల ప్రచారాలు జ‌రుగుతున్నాయి. ఇక‌, సాధార‌ణ ప్ర‌జానీకంతో పాటుగా గుగూల్ సైతం ఇప్పుడు దీనినే స‌ర్య్కులేట్ అవటం హాట్ చ‌ర్చ‌గా మారింది. జ‌గ‌న్ ఫ్యాన్స్ ఈ వార్త‌తో మ‌రింత జోష్‌లో క‌నిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here