పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్‌. తేల్చి చెప్పిన జాతీయ స‌ర్వే – Jagan Tops In National Survey

0
526
అనూహ్యంగా పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్‌. తేల్చి చెప్పిన జాతీయ స‌ర్వే. ఓ జాతీయ మీడియా సంస్థ..మ‌రో సంస్థ‌తో చేసిన స‌ర్వే ఇప్పుడు ఏపిలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌లు..ఏపిలో పాల‌న ప్ర‌ధాన అంశాలుగా ఈ సర్వే జ‌రిగింది. ఇందులో వ‌చ్చిన ఫ‌లితాల‌ను చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసిపికి 42 శాతం మంది ఓటు వేస్తామ‌ని చెప్పిన‌ట్లు తేలింది. అదే విధంగా అధికార పార్టీకి 30.85 శాతం ఓట్లు వేస్తామ‌ని తేల్చి చెప్ప‌న‌ట్ల స‌ర్వేలో గుర్తించారు. వారం రోజుల పాటు ఏపి లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 12.83 లక్ష‌ల మంది ఈ స‌ర్వేలో పాల్గొన్నారు. ప్ర‌స్తుత పాల‌న పై 57 శాతానికి పైగా సంతృప్తి క‌రంగా లేర‌నే విష‌యం తేలింది. ముఖ్య‌మంత్రి అనుభ‌వం ఏపికి ప‌నికొచ్చింని కేవ‌లం 33.18 శాతం మంది మాత్ర‌మే అంగీక‌రిం చిన‌ట్ల స‌ర్వే తేల్చింది. ఇక‌. ప‌వ‌న్ క‌ళ్యాన్ వైపు 19.36 శాతం మంది మొగ్గు చూపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌టం పై 80 శాతానికి పైగా ప్ర‌జ‌లు స‌మ‌ర్ధనీయం కాద‌ని వ్య‌తిరేకించారు.
ఏపిలో కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదా విష‌యంలో సైతం అధికార పార్టీ తీరును ప్ర‌జ‌లు వైఫ‌ల్యం చెందిన‌ట్లుగా అభిప్రాయ‌ప‌డ్డారే. ఇక‌, ఏపిలో అవినీతి పైనా అత్య‌ధిక ప్ర‌జ‌లు పెరిగింద‌నే స‌మాధానం ఇచ్చిన‌ట్లు స‌ర్వే తేల్చింది. ఈ స‌ర్వేలోనే జ‌గ‌న్ కు గ‌త ఎన్నిక‌ల్లో అశించిన ఫ‌లితాలు ఇవ్వ‌ని ఉభ‌య గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌, గుంటూరు-కృష్ణా జిల్లాల్లో సైతం జ‌గ‌న్ పై ప్ర‌జాద‌ర‌ణ పెరిగింద‌నే లెక్క ల‌ను ఈ సర్వే స్పష్టం చేసింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌తంలో వైసిపికి ఒక్క సీటు రాలేదు. కానీ, ఈ స‌ర్వేలో అదే జిల్లా లో ప్ర‌స్తుతం 40-45 శాతం ఓట‌ర్లు మొగ్గు చూపుతున్న‌ట్లు లెక్క‌లు తేల్చారు. ఇక‌, తూర్పు గోదావ‌రి జిల్లాలోనూ ఇదే ప‌రిస్థితి .
అక్క‌డ జ‌గ‌న్ వైపు 40 శాతంకు పైగా ఓటర్లు మొగ్గు చూపుతున్న‌ట్లు తేలింది. అనూహ్యంగా కృష్ణా -గుంటూరు జిల్లాల్లో జ‌గ‌న్ పాదయాత్ర ద్వారా ప్ర‌జ‌ల అంచ‌నాల్లో మార్పు క‌నిపించింద‌ని స‌ర్వేలే తేల్చి చెప్పారు. అక్క‌డ స‌హ‌జంగా ఉండే ప‌రిస్థితికి భిన్నంగా వైసిపి వైపు ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ట్లు గుర్తించారు. దాదాపు 50 శాతం వ‌ర‌కు ఓట‌ర్లు వైసిపికి అండ‌గ నిలుస్తామ‌ని చెబుతున్న‌ట్లు స‌ర్వే గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు చేసిన ఈ స‌ర్వేలో దాదా పుగా వైసిపికి అనుకూల ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి..ఈ ఏడాది కాలంలో టిడిపి ఎటువంటి దిద్దుబాటు చ‌ర్య‌లు తీసు కుంటుందో..వైసిపి ఈ ఫ‌లితాల స‌ర‌ళిని నిల‌బెట్టుకోవ‌టానికి ఎటువంటి ప్ర‌య‌త్నాలు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here