2019 లో వైసిపి గెలుపు ఖాయ‌మా, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాబోతున్నారా ? – Jagan Will be CM of Andhra Pradesh in 2019?

0
432

2019 లో వైసిపి గెలుపు ఖాయ‌మా. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాబోతున్నారా. బిజెపి నేత‌లు అంత గ‌ట్టిగా ఎలా చెప్ప‌గ‌లుగుతు న్నారు.  ఉభ‌య గోదావ‌రి – ఉత్త రాంధ్ర లో వైసిపి గ‌త ఎన్నిక‌ల్లో ఆశించిన స్థాయిలో సీట్లు గెల‌వ‌లేక‌పోయింది. అయితే ఇప్పుడు విశాఖ‌లో సీన్ రివ‌ర్స్ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. విశాఖ కు చెందిన క‌న్న‌బాబు వైసిపి లో చేరుతున్నారు. ఇక‌, విశాఖ నార్త్ ఎమ్మెల్యే బిజెపి ఫ్లోర్ లీడ‌ర విష్ణుకుమార్ రాజు ఓపెన్ అయిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసిపి విజ‌యం ఖాయ‌మ‌ని తేల్చేసారు. జ‌గ‌న్ ముఖ్య మంత్రి అవ‌టం త‌ధ్య‌మ‌ని తేల్చిచెప్పేసారు.

వైసిపి కి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప‌ట్టు, న‌గ‌రాల్లో అంత‌గా లేద‌నే అభిప్రాయం నెల‌కొని ఉంది. కానీ, ఇప్పుడు అర్బ‌న్ ప్రాంతానికి చెందిన ఇత‌ర పార్టీల నేత‌లే వైసిపి లో చేరుతున్నారు. విష్ణుకుమార్ రాజు లాంటి వారు బిజెపి లో ఉన్నా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప్ర‌శంసించ‌టానికే ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ఇప్పుడు బిజెపి -టిడిపి మ‌ధ్య బంధం తెగిపోవ‌టంతో ఆ పార్టీ నేత‌లు టిడిపిని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే, విష్ణుకుమార్ రాజు మాత్రం కొంత కాలంగా జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త‌ను ప్ర‌శంసిస్తున్నారు. జ‌గ‌న్ విశాఖ వ‌చ్చిన‌ప్పుడు తాను క‌లుస్తా న‌ని చెబుతున్నారు. విశాఖ‌లో ప్ర‌జ‌ల్లో సైతం వైసిపి ప‌ట్ల ఆద‌ర‌ణ పెరుగుతోంది. విశాఖ పై ప్ర‌త్యేకంగా దృష్టి కేంద్రీక‌రించిన వైసిపి అధినేత అక్క‌డ పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ కు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ప‌బ్లిక్ మూడు లేకుండా నేతెల‌వ్వ‌రూ కూడా వైసిపి లో చేరే ఆలోచ‌న చేయ‌రు.

విశాఖ‌లో జ‌రిగిన భూ కుంభ‌కోణం మంత్రుల మ‌ధ్య ఆరోప‌ణ‌లు, అధికార పార్టీ ఎమ్మెల్యేల దౌర్జ‌న్యాలు, ఇలా ఎన్నో అంశాలు అక్క‌డ ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. దీనికి తోడు కేంద్ర నిఘా సంస్థ‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ఏపిలో స‌ర్వేలు చేస్తున్నాయి. జ‌గ‌న్ కు ఊహించ‌ని విధంగా కృష్ణా జిల్లాలో వ‌చ్చిన స్పంద‌న చూసిన త‌రువాత బిజెపి లోనే కాదు, టిడిపి లోనూ గుబులు మొద‌లైంది. అర్బ‌న్ ఓట‌ర్లు సైతం జ‌గ‌న్ ను ఆద రించ‌టం కొత్త స‌మీక‌ర‌ణ గా భావిస్తున్నారు. ఇది వైసిపికి క‌లిసొచ్చే అంశం. ఇక‌, రాష్ట్ర స్థాయి స‌ర్వేలే కాదు, జాతీయ నిఘా సంస్థ స‌ర్వేల్లోనూ జ‌గ‌న్ కు సానుకూల‌త క‌నిపిస్తోంది. ఇవ‌న్నీ చూస్తుంటే, జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్త‌వుతూనే ఇత‌ర పార్టీల నుండి పెద్ద ఎత్తున వైసిపి లోకి వ‌ల‌స‌లు ఉంటాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో ఏ మాత్రం అతి విశ్వాసం లేకుండా ముందుడుగు వేస్తే వైసిపికి తిరుగుండ‌ద‌ని తేల్చి చెబుతున్నారు. జ‌గ‌న్ క‌ష్ట‌ప‌డుతున్న త‌ర‌హాలో పార్టీ నేత‌లు 10 శాతం క‌ష్ట‌ప‌డ్డా వైసిపి కి ఈ సారి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here