మాజీ జెడి లక్ష్మీనారాయణ కు జగన్ ఫోబియా. రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలంటే వెంటాడుతున్న జగన్ ఫీవర్. మాజీ అధికారిగా ఎక్కడున్నా..మనసంతా ఆ పార్టీ మీదే. ఏపి లో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి..ఏదో చేద్దామనుకున్న మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. ఉద్యోగాని కి స్వచ్చంద రాజీనామా చేసిన సమయంలో లక్ష్మీనారాయణ బిజెపి లో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఏపి లో టిడిపి -బిజెపి మధ్య మైత్రి కొనసాగుతూ ఉంది. కానీ, బిజెపి తో టిడిపి సంబంధాలు బెడిసి కొట్టటంతో లక్ష్మీనారాయణ నిర్ణయం లోనూ మార్పు కనిపిస్తోంది. దీంతో..ఆయన జనసేన లో చేరుతారనే ప్రచారం జరిగింది. దీనిని ఆయన తోసి పుచ్చారు. ప్రస్తుతం రైతుల సమస్యలు..గ్రామీణాభివృద్ది అనే అంశాల పై జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. రెండు నెలల్లో తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని చెబుతున్నారు. అయితే, ఎక్కడికెళ్లినా..ఆయనకు జగన్ కేసుల అంశమే ప్రధాన ప్రశ్నగా ఎదురవుతోంది.
జగన్ పై కేసుల ద్వారానే జగన్ వ్యతిరేకుల్లో ఆయన పై ఆసక్తి పెరిగింది. లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల సమయంలోనే టిడిపి లో చేరాలని భావించారు. అయితే, అప్పటి వరకు పరోక్షంగా ఉన్న సంబంధాలు ప్ర త్యక్ష సంబంధాలుగా మారితే ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయనే భావనతో టిడిపి నేతలు తాత్కాలికంగా ఆ నిర్ణయా న్ని పక్కన పెట్టారు. జగన్ పై కేసులు నమోదు చేసిన వ్యక్తి నేరుగా పార్టీలోకి ఎంట్రీ ఇస్తే..ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే ఆందోళనతో నిర్ణయం వాయిదా వేసుకు న్నారు. లక్ష్మీనారాయణ బిజెపి లో చేరుతారని టిడిపి మద్దతు మీడియా సైతం కధనాలు ఇస్తోంది. కానీ, ఖచ్చితంగా లక్ష్మీ నారాయణ ఏ పార్టీ లో చేరుతారనే విషయాన్ని మాత్రం ప్రకటించటం లేదు. కొత్తగా పార్టీ పెట్టే అవకాశాలు లేకపోలేదని కధనాలు వస్తున్నాయి. ప్రస్తుతం బిజెపి పై ఏపి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో బిజెపి లో చేరటం పై లక్ష్మీ నారాయణ ముందుకు వస్తారా అనేది సందేహమే. ఇక, టిడిపిలో నేరుగా చేరే పరిస్థితులు కనిపించటం లేదు. కానీ, టిడిపికి మేలు చేసే విధంగానే లక్ష్మీనారయణ అడుగులు ఉంటాయనేది వైసిపి నేతల అంచనా. కొత్తగా పార్టీ పెట్టటం ద్వారా.. కీలకమైన ఫైట్ ఉండే స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు లక్ష్మీనారయణ ప్రయత్నిస్తారనే అనుమానాలను వైసిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు నెలలు వేచి ఉండటం ద్వారా టిడిపి పై కేంద్రం ఎలాంటి నిర్ణయాలను అమలు చేస్తుందనే విషయంతో పాటుగా..ప్రజల్లో టిడిపి ప్రభుత్వం పై ఏ రకమైన అంచనా తో ఉన్నారో.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితా లు వచ్చే అవకాశం ఉందనే అంశం పై మరింత క్లారిటీ రానుంది. దీంతో..ఏ పార్టీలో చేరాలనే దాని పై లక్ష్మీనారాయణ రాజకీయంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
నేరుగా టిడిపి లో చేరినా..ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇక, లక్ష్మీనారాయణ జిల్లాల పర్యటన లో ఇప్పటికే టిడిపి నేతలు స్వచ్చంద నేతల ముసుగులో సహకారం అందిస్తు న్నట్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో తేలి పోయింది. అయితే, నేరుగా టిడిపి నేతలతో రాజకీయంగా సంబంధాలు పెట్టుకోవాలంటే..జగన్ కేసుల వ్యవహారంలో తన పై వచ్చిన అభియోగాలు ఇప్పుడు ప్రభావం చూపే అవకాశం ఉందనే భయం జెడిని వెంటాడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయంగా లక్ష్మీనారాయన ఎంట్రీ ఖరారు అవుతే..ఇక, వైసిపి నేతలు..అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.