నాడు – నేడు మాజీ జెడి లక్ష్యం అదేనా..!!
లక్ష్మీనారాయణ చేస్తుందిదీ..మరి జగన్ ఏం చేస్తారు..!!
నాడు జగన్ ను వేధించారు..!!
నేడు జగన్ వ్యతిరేకులతో కలిసిపోతున్నారు..!!
సిబిఐ మాజీ జెడికి టిడిపి నేతలపై ప్రేమ పెరిగిపోతోంది. ఓపెన్ గానే వారితో ఉన్న సంబంధాలు బయట పడుతున్నాయి. ఇప్పడు ఇది పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ కడపలో ఉక్క ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్‌ను పరామర్శించారు. కడప పర్యటనలో భాగంగా రమేష్ దీక్షా స్థలి వద్దకు వెళ్లి పరామర్శించారు. అయితే, గతంలో ఏపికి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన వైసిపి ఎంపీలకు కనీసం సంఘీ భావం తెలియ చేయని మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఇంత ఆప్యాయతలు కురిపించటం పైభిన్న వాదనలు విని పిస్తున్నాయి. ఇప్పటి వరకు జెడి చేసిన జిల్లా పర్యటనల్లో ఎక్కవగా టిడిపి సంబంధీకులే అయనతో కలిసి ఉండటం పై అనేక విమర్శలు ఉన్నాయి. తాజాగా, సీయం రమేష్ ను పరామర్శిచిన విషయంలో రాజకీయంగానే కాకుండా…నెటిజెన్లు సైతం లక్ష్మీనారాయణ మీద సెటైర్లు వేస్తున్నారు. బిపి, సుగర్ పేషంట్ అన్నపానీయాలు మాని పది రోజులు ఉండగల డా…?కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి చెబుతారా ?స్టాఫ్ లేరని మాత్రం చెప్పకండి సార్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబుపై కేసుల విచారణ పై ప్రశ్నించిన సందర్భంలో స్టాఫ్ లేరంటూ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
ఇక, 2014 ఎన్నికల సమయంలో లక్ష్మీనారాయణ టిడిపిలో చేరాలని ప్రయత్నించినా..అప్పటికే జగన్ కేసులు విచారిస్తున్న అధికారిగా టిడిపిలోకి వస్తే..అది జగన్ కు అనుకూలంగా మారుతుందనే సంశయంతో టిడిపి నేతలు కొంత కాలం ఆగాలని సూచించారు. ఇక, తాజాగా ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ తరువాత ఆయన బిజెపి లోకి వెళ్తారని..జనసేన లోకి వెళ్తారనే వాదనలు ఉన్నాయి. కానీ, తాను జిల్లాల పర్యటనల తరువాతనే రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇస్తానని మాజీ జెడి చెబుతున్నారు. ఇక, లక్ష్మీనారాయణ అడుగులు చూస్తుంటే..ఏది చేస్తే రాజకీయంగా టిడిపికి ప్రయోజనం కలుగుతుం అదే విధంగా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయంగా లక్ష్మీనారాయన ఏ నిర్ణయం తీసుకున్నా…జగన్ అభిమానులు మాత్రం జెడిగా వ్యవహరించిన సమయంలో ఆయన వ్యవహరించిన తీరు ను మాత్రం మరిచిపోవటం లేదు. దీంతో..రాజకీయంగా జగన్ కు ప్రత్యర్ధిగా మారితే లక్ష్మీనారాయణ అనే క రకాలుగా విమర్శలు ఎదుర్కోవటం తో పాటుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.