బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ కి సంబందించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్స్ లో రాజకీయ సంచలనం కెఏ పాల్, పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా ఉండనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కెఏ పాల్, రేణుదేశాయ్‌లతో సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం. ఇదే జరిగితే ‘బిగ్ బాస్ 3′ సృష్టించే సంచలనాలు ఊహించగలమా? చెప్పండి!. కెఏ పాల్ కామెడీ, రేణుదేశాయ్ ముచ్చట్లతో ‘బిగ్ బాస్ 3′ హౌస్ అంతా కళకళలాడటం ఖాయమే. అంతేకాదు ఈ ఇద్దరి పార్టిసిపేషన్ సదరు టీవీ ఛానెల్‌కి బెస్ట్ టీఆర్ఫీ రేటింగ్ తెచ్చిపెడుతుందనటం లోనూ ఎలాంటి సందేశం లేదు. ఇక ఈ షోకి హోస్ట్ విషయమై రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి, కానీ క్లారిటీ సమాచారమైతే లేదు.
బిగ్ బాస్ షో ప్రారంభ సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొట్టేశాడు. ఆ తర్వాత సెకండ్ సీజన్ లో ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా హోస్ట్ బాధ్యతలను నాని భుజాలపై వేసుకున్నాడు. ఈ రెండు సీజన్స్ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న మూడో సీజన్ హోస్ట్ కోసం నాని, ఎన్టీఆర్ లతో పాటు నాగార్జున, అనుష్క లాంటి ఇతర తారల పేర్లు పరిశీలిస్తున్నారని తెలిసింది. కాగా బిగ్ బాస్ నిర్వాహకులు చివరకు ‘బిగ్ బాస్ 3′ హోస్ట్ గా నాగార్జునను ఫైనల్ చేశారనేది లేటెస్ట్‌గా వినిపిస్తున్న మాట.
ఈ మేరకు నాగార్జునకు భారీ పారితోషికమే ఆఫర్ చేయడంలో నాగ్ కూడా ఓకే చెప్పేశారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇతర భాషల్లో ‘బిగ్ బాస్ 3′ ప్రారంభం అయిపోగా తెలుగులో మాత్రం జులై చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బుల్లితెర విందుకు దిగనుందని అంటున్నారు. మరోవైపు ప్రేక్షకులంతా ఈ షో కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ 3 పై వస్తున్న వార్తలన్నీ కేవలం చెప్పుకోవడానికే తప్ప షో నిర్వాహకుల నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇప్పటికే నాగార్జున, అనుష్క, రేణు దేశాయ్, కేఏ పాల్ లాంటి ఎందరో ప్రముఖుల పేర్లైతే బయటకు వచ్చాయి గానీ చివరకు ఏం జరిగేనో! అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం.