రావడం కాస్త లేట్ అయ్యుండవచ్చు… రావడం మాత్రం పక్కా అంటున్న కన్నా – kanna Lakshminarayana to Join in YSRCP?

0
488

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసిపి ఎంట్రీ ముహూర్తం ఖ‌రారైంది. ఏప్రిల్ 25నే ఆయ‌న వైసిపి లో చేరాల్సి ఉంది. అయితే, స‌డ న్ గా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌టంతో అనుకున్న ముహూర్తానికి వైసిపిలో చేర‌లేదు. దీంతో అనేక ర‌కాలుగా క‌న్నా పై ప్ర‌చారం జ‌రిగింది. వైసిపి లో చేర‌టం లేద‌ని బిజెపి అధినేత క‌న్నాకు ఫోన్ చేసార‌ని, వైసిపి లో చేర‌కూడ‌ద‌నే కార‌ణం తో నే ఆస్ప‌త్రిలో చేరారంటూ ఒక వ‌ర్గం మీడియా ప్ర‌చారం చేసింది. ఇక‌, బిజెపి జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా వైసిపి అధినే త జ‌గ‌న్ కు ఫోన్ చేసి బిజెపి నేత‌ల‌ను చేర్చుకోవ‌ద్ద‌ని చెప్పార‌ని టిడిపి నేత‌లు ప్ర‌చారం చేసారు. కానీ, వాటిలో వాస్త‌వం లేద‌ని తేలిపోయింది. బిజెపి లో ఉన్న క‌న్నా ఆ పార్టీకి రాజీనామా చేసారు. వైసిపి లో చేరే స‌మ‌యానికి అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ఇక‌, టిడిపి నేత‌లు త‌మ‌తో పాటుగా మ‌ద్ద‌తు మీడియాలో క‌న్నా పై ర‌క‌ర‌కాలుగా ప్రచారం చేసారు. టిడిపిలో చేరే అంశం పై టిడిపి నేత‌లు క‌న్నా తో మంత‌నాలు చేస్తున్నార‌ని లీకులిచ్చారు. కానీ, క‌న్నా ఆస్ప‌త్రిలో ఉండ‌టంతో ఎక్క‌డా దీని పై స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ మార్పు విష‌యంలో ఎటువంటి పున‌రాలోచ‌న లేద‌ని త‌న స‌న్నిహితుల‌తో చెప్పిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

అస్వ‌స్థ‌త కార‌ణంగానే వైసిపిలో చేరిక వాయిదా ప‌డింద‌ని మే 9 న అనుచ‌రుల‌తో క‌లిసి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరుతాని క‌న్నా సన్నిహిత వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. తొలుత మే4న చేరాల‌ని భావించినా ఆ రోజు శుక్ర‌వారం కావ‌టంతో జ‌గ‌న్ కోర్టులో హాజ‌రు కోసం హైద‌రాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆయ‌న మే 9న వైసిపి లో చేరాల‌ని డిసైడ్ అయిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. క‌న్నా లాంటి నేత‌లు వైసిసిలో కి వ‌స్తుండ‌టంతో టిడిపి నేత‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో అనారోగ్యం కార‌ణంగా వాయిదా ప‌డిన చేరిక పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం మొద‌లు పెట్టింది. ఇక‌, య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన క‌న్నబాబు, కృష్ణా జి ల్లాకు చెందిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ను సైతం వైసిపిలో చేర‌కుండా నిలువ‌రించేందుకు టిడిపి నేతలు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, ఈ నేత‌లంతా తాము ఎవ‌రు ఆపినా, ఆగేది లేద‌ని ఖ‌చ్చితంగా వైసిపిలో చేర‌టం ఖాయ‌మ‌ని ఆ నేతలు తేల్చి చెబుతున్నారు. క‌న్నా వైసిపి ఎంట్రీ పై నెల‌కొన్ని సందిగ్ద‌త దాదాపు తొలిగిపోయింది. ఈ రోజో రేపో దీని పై అధికారంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here