సొంత నియోజకవర్గంలో గెలవలేరు…
జగన్ విజయాన్ని అడ్డుకుంటారట..!!
ముసుగు తొలిగింది….రీ ఎంట్రీ
టార్గెట్ జగన్ అంట..అయ్యే పనేనా..!!
ఆఖరి బంతికి సిక్స్ కొడతా..ఈ డైలాగ్ వినగానే ఆ వ్యక్తి గుర్తుకు వచ్చేస్తాడు. సొంత నియోజకవర్గంలో సొంత తమ్ముడిని గెలిపించుకోలేని ఆ మాజీ ముఖ్యమంత్రి..ఇప్పుడు వైసిపి ని లక్ష్యంగా చేసుకొని మరోసారి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారట. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..తిరిగి కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్దమైపోయారు. ఏపి ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను ఆపుతానని చెప్పి..చెప్పుల పార్టీ పెట్టి..పరోక్షంగా టిడిపికి సహకరించిన వ్యక్తి. సీయంగా ఉన్న సమయంలో టిడిపి సహకారంతో ముఖ్యమంత్రిగా కొనసాగారు.
వైసిపి..టిఆర్‌యస్ అవిశ్వాసం పెడితే చంద్రబాబు సహకారంతో గట్టెక్కారు. తెలుగు – కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన ప్రక్రియ ను అసెంబ్లీలో పూర్తి చేసిన నేతగా చరిత్రలో నిలిచిపోయారు. ఇక, రోశయ్య ను ముఖ్యమంత్రి గా దించి..తనకు సీయంగా అవకాశం ఇస్తే..కాంగ్రెస్ ను ధిక్కరించిన జగన్ ను తాను కంట్రోల్ చేస్తానని సోనియా కు హామీ ఇచ్చారు. కిరణ్ సీయం కాగానే..జరుగుతున్న కుట్రల ను గుర్తించి జగన్ కాంగ్రెస్ ను వీడారు. జగన్ పై కేసులు పెట్టి లోపల వేయమని సలహా ఇచ్చింది కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డే.
ఇక, జగన్ అరెస్ట్ సమయంలో వైయస్ కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించిందీ కిరణ్ సర్కార్‌లోని పోలీసులే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..ఇప్పటి వరకు క్రియా శీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక, కిరణ్ సోదరుడు కిషోర్ టిడిపిలో చేరారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి పీలేరు అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. తండ్రి రాజకీయంగా విబేధించి పోరాడి న చంద్రబాబు వద్దకే తమ్ముడు కిషోర్ చేరాడు. కిరణ్ ను సైతం చంద్రబాబు టిడిపిలోకి ఆహ్వానించారు. ఇక, కిరణ్ రేపో మాపో కాంగ్రెస్ లో తిరిగి చేరటం లాంఛనమే. ఏపిలో టిడిపిని కాదు..వైసిపి ని టార్గెట్ చేయమని సలహా ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డేనని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జగన్ మీద ఉన్న అక్కసు తోనే కాంగ్రెస్ -టిడిపి ని కలిపి..వచ్చే ఎన్నిక ల్లో కొత్త వ్యూహాలు అమలు చేయటమే కిరణ్ అసలు లక్ష్యంగా తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రిగా ఉండగానే..జగన్ జైళ్లో ఉన్నా..జగన్ ప్రభంజనాన్ని కిరణ్ అడ్డుకోలేక పోయారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ నేతగా జగన్ ను నిలువరించటానికే కిరణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని టిడిపి మద్దతు పత్రికలు రాస్తున్నాయి.
ఇప్పుడు కిరణ్ కు అంత సీన్ ఉందా. అసలు పీలేరు లో సొంత తమ్ముడిని గెలిపించుకోగలరా. ఏపిలోనే కాదు..సొంత నియోజకవర్గంలోనే ప్రభావితం చేయలేని వ్యక్తి కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనంటే నమ్మదగిన విషయమేనా. ఇప్పటి వరకు ఉన్న ముసుగు తొలిగించుకొ ని..టిడిపి పరోక్షంగా సహకరించటం..జగన్ వ్యతిరేకులకు సాయం అందించటమే లక్ష్యంగా పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్న కిరణ్ లక్ష్యం నెరవేరటం సాధ్యపడుతుందా.. సాధ్యం కాదని ప్రస్తుత రాజకీయ సమీకరణాలే తేల్చి చెబుతున్నాయి.