నారా వర్సెస్ నాని..గెలుపెవరది..!!
అసలు..సిసలు మజా ఈ పోరుతోనే..!!
గుడివాడ లో బస్తీమే సవాల్…!!
ఎవరి సత్తా ఏంటో తెలియాలంటే…ఇది చూడాల్సిందే..!!
బస్తీమే సవాల్. నాని వర్సెస్ నారా. అసలైన రాజకీయ రంజుకు వేదిక. గుడివాడ కేంద్రంగా పొలిటికల్ వార్. ఎపిలో ఇప్పటి కే ఎన్నికల వాతావారణం కనిపిస్తోంది. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చినా..ఏపి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..ఈ సారి టిడిపి వర్సెస్ వైసిపి పోరు హోరా హోరీ గా సాగటం ఖాయం. ఇక, కొద్ది రోజులుగా మంత్రి లోకేష్ చేస్తున్న రాజకీయ కామెంట్లు కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతున్నాయి. తాను వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని లోకేష్ తేల్చి చెప్పారు. అయితే, ఎక్కడి నుండి పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేసారు. కానీ, టిడిపిలో..పార్టీ ప్రముఖుల మధ్య జరుగుతున్న చర్చను పరిశీలిస్తే లోకేష్ కోసం పార్టీ అధినేత కుప్పం నియోజకవర్గం సురక్షితంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కుప్పం నుండి లోకేష్ ను దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో మామ బాలకృష్ణ ఖచ్చితంగా హిందూపూర్ నుండే పోటీ చేస్తారని లోకేష్ చెబుతున్నారు.
అయితే, కుప్పం నుండి లోకేష్ ను దింపితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లోని ఒక నియోజకవర్గాన్ని ఎంచు కోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మరో వాదన వినిపిస్తోంది. లోకేష్ కు కుప్పం అప్పగిస్తే..వేరే నియోజకవర్గం నుండి గెలిచే అవకాశం లేక కుప్పం నుండి పోటీ చేయించారని విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. దీంతో..లోకేష్ ను రాజధాని ప్రాంతం నుండి ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయించే అవకాశామూ పరిశీలనలో ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా మంత్రి లోకేష్ ఒకరు కుప్పం నుండి పోటీ చేస్తే..మరొకరు వేరే నియెజక వర్గం నుండి పోటీ చేయాలి. ఇందు కోసం కృష్ణా జిల్లా గుడివాడ పై ఇప్పుడు టిడిపిలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తొలి నుండి గుడివాడ టిడిపికి అనుకూలంగా ఉందని..అక్కడి నుండి ఎన్టీఆర్ సైతం 1983, 1985 ఎన్నికల్లో గెలిచారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
అయితే, ప్రస్తుతం వైసిపి ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని 2004,2009 లో టిడిపి నుండి…2014 లో వైసిపి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు అక్కడ ఎలాగైనా కొడాలి నాని గెలవకుండా చూడాలని టిడిపి హైకమాండ్ నుండి లోకల్ టిడిపి నేతలకు సూచనలు వెళ్తున్నాయి. టిడిపి టార్గెట్ చేసిన వైసిపి ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు. దీంతో..కొడాలి నాని ని గుడివాడలో ఈ సారి ఢీ కొట్టటానికి నారా వారి కుటుంబం నుండి పోటీకి నిలవాలనే ఆలోచన చాలా సీరియస్ గా జరుగుతోంది. ఫలితం ఎలా ఉంటుందనే దాని పైనే తర్జన భర్జన పడుతున్నారు. ముఖ్యమంత్రి లేదా మంత్రి హోదా నుండి వచ్చిన వ్యక్తి గుడివాడలో బరిలోకి దిగి కొడాలని నానిని ఎదుర్కోవాలనేది ఆలోచనగా తెలుస్తోంది. మరి ఇదే విధంగా గుడివాడలో ..నారా వర్సెస్ నాని అన్నట్లుగా వార్ జరిగితే..ఫలితం ఏమవుతుంది. గెలిచేదెవరు. కొడాలి నాని ..నారా అభ్యర్ధిని ఎలా ఎదుర్కొంటారు. ఇప్పుడు…ఇదే హాట్ టాపిక్. మరి..ఈ రసవరత్త పోరు జరిగితే ..ఏం జరుగుతుందో..మీ అంచనాలేంటో..మీ కామెంట్ల రూపంలో తెలిచ చేయండి.