క‌ర్నాట‌క ఎన్నిక‌లు వైసిపికి ఏం చెబుతున్నాయి – Lessons for Jagan from Karnataka Politics

0
470

క‌ర్నాట‌క ఎన్నిక‌లు వైసిపికి ఏం చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో ముందుకెళ్తున్న వైసిపి ఈ ఫ‌లితాల‌తో మేల్కోవాల్సిందేంటి. వైసిపి కి జ‌నాద‌ర‌ణ కు ఢోకా లేదు. జ‌నం కోస్ జ‌గ‌న్‌..జ‌గ‌న్ కోసం జ‌న్ అన్న‌ట్లుగా ఏపి లో వైసిపికి విశేష ప్ర‌జాద‌ర‌ణ ఉంది. జ‌గ‌న్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాల‌నే ఆలోచ‌న రోజురోజుకీ బ‌ల‌ప‌డుతోంది. కానీ, వసిపి కి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా ఉన్న టిడిపి వ్యూహాల‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌టానికి లేదు. 2014 ఎన్నిక‌ల్లో వైసిపి ని ఎదుర్కో వ‌టానికి టిడిపి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. జ‌గ‌న్ వ్య‌తిరేక‌లంద‌రినీ చేరదీసింది. అలివికాని హామీల‌ను గుప్పించింది. కానీ, జగ‌న్ ఒంటి పోరాటం చేసారు. 1.95 శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూర‌మ‌య్యారు. 2014 ఫ‌లితాల‌ను వైసిపి ప్ర‌తీక్ష‌ణం స‌మీక్ష చేసుకోవాల్సిందే.

టిడిపి జనాద‌ర‌ణ లేదు. కానీ, వారికి ఉంది క్షేత్ర స్థాయిలో పోల్ అండ్ పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ . అస‌లు ఉనికే లేని త్రిపుర లో బిజెపి ఏం చేసింది. త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను ముందే రంగంలోకి దింపింది. బిజెపి జాతీయాధ్య క్షుడు ఎల‌క్ష‌న్ ఇంజ‌నీరింగ్‌లో తిరుగులేని నేత‌. అటువంటి వ్య‌క్తి సైతం నమ్ముకొనేది పోలింగ్ లో బూత్ లెవ‌ల్ మేనేజ్ మెంట్. త్రిపుర లో త‌మ మ‌ద్దతు దారుల‌ను ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల‌కు ముందే బరిలోకి దింపి పూర్తి స్థాయిలో త‌మ ప‌ట్టు పెంచుకున్నారు. ఉనికే లేని చోట తిరుగులేని మెజార్టీ సాధించారు. ఇక, కర్నాట‌క‌లోనూ బిజెపి అధికారంలోకి రావ‌టం సాధ్యం కాద‌ని తొలి నుండి పోటింగ్ ముగిసిన త‌రువాత వ‌చ్చిన స‌ర్వేలు సైతం ఊద‌ర‌గొట్టాయి. కానీ, ఎల‌క్ష‌నీరిం గ్‌లో బిజెపి అమ‌లు చేసిన వ్యూహాలు..ఆశించిన‌తంగా ఓట్లు రాక‌పోయినా..సీట్ల‌ను తెచ్చి పెట్టాయి.

ఇక‌, ఏపిలో చూసుకుం టే.. టిడిపి న‌మ్ముకొనేది మేనేజ్‌మెంట్ స్కిల్స్ నే. వైసిపి న‌మ్ముకొనేది ప్ర‌జ‌ల అభిమానాన్ని. కానీ, వైసిపి కి వ్యూహ‌క‌ర్త‌గా వ‌చ్చిన ప్ర‌శాంత్ కిషోర్ సైతం బూత్ లెవ‌ల్ మేనేజ్‌మెంట్ పై దృష్టి పెట్టాల‌ని పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్‌ల‌కు ప‌లుమా ర్లు సూచించారు. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో బూత్ లెవ‌ల్ లో శిక్ష‌ణా త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని..బూత్ లెవ‌ల్ మేనేజ‌మెం ట్ స‌క్ర‌మంగా చేసుకోగ‌లిగితే..వైసిపి విజ‌యాన్ని అడ్డుకొనే శ‌క్తి ఎవ‌రికీ లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. నంద్యాల ఫ‌లితం సైతం వైసిపి లోని మేనేజ్‌మెంట్ స్కిల్స్ లోపాల‌ను ఎత్తి చూపుతోంది. కానీ, అక్క‌డ‌క్క‌డ మిన‌హా వైసిపి లో ఈ బూత్ లెవ ల్ మేనేజ్‌మెంట్ కోసం బూత్ లెవ‌ల్ క‌మిటీలు ఏర్పాటు చేసారు కానీ, వారికి స‌రైన శిక్ష‌ణ పూర్తి చేయ‌టం లేదు. దీనికి తోడు టిక్కెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య‌..పార్టీలో చేరిక‌లు ఉంటున్నాయి కానీ, మాకు టిక్కెట్లు ముఖ్యం కాదు..పార్టీ గెలుపు ముఖ్య‌మ‌నే నేత‌లు క‌నిపించ‌టం లేదు. ఇక‌, ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ లో అనుభ‌వం ఉన్న నేత‌లు సైతం త‌మ టిక్కెట్ల కోస‌మే ప్రాధాన్య‌త ఇస్తున్నారు.

ఎల‌క్ష‌న్ మేనేజ్‌మెంట్ లో అనుభ‌వం..స‌మ‌ర్ధ‌త ఉన్న వారిని పార్టీ గెలుపు కోసం వినియోగించుకొని..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వారికి స‌ముచిత ప్రాధాన్య‌త ఇవ్వ‌చ్చ‌ని ..జ‌గ‌న్ ను సీయం గా చూడా ల‌నుకుంటున్న ల‌క్ష‌లాది మంది అభిమానులు సూచిస్తున్నారు. బిజెపి వ‌రుస గెలుప‌ల్లోనూ అనుస‌రించిన సూత్రం ఇదే. ఇదే జ‌రిగితే….ఇక‌, వైసిపి విజ‌యం ఖాయం. మ‌రి..వైసిపి చేయాల్సిందేంటో మీరే కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here