జగన్ కేబినెట్ లో వుండే మంత్రులు జిల్లాల నుండి వీరే, List of YS Jagan Cabinet Ministers District Wise

0
456

జగన్ కేబినెట్ లో మంత్రులుగా అవకాశం దక్కేదెవరికి?  మొత్తం 175 స్థానాలున్న అసెంబ్లీలో ఏకంగా 151 స్థానాల్లో స్వీప్ చేసేసిన వేళ, మంత్రి పదవి కోసం ఆరాటపడేవారికి కొదవ ఉండదు. ఎన్నికల్లో తన విజయం పక్కా అన్న విషయం మీద స్పష్టత ఉన్నా, ఇంత భారీ ఎత్తున గెలుస్తానన్న ఊహ కూడా జగన్ కు ఉండకపోవచ్చు. తొలుత తాను అనుకున్న ఫార్ములా ప్రకారం కాకుండా, తాజాగా మారిన ఫలితాల నేపథ్యంలో కేబినెట్ కూర్పు ఉండక తప్పనిసరి పరిస్థితి.తన తండ్రికి సన్నిహితులుగా ఉన్న వారు, తాను పార్టీ పెట్టాక తనను నమ్ముకొని నడిచిన వాళ్లు, విధేయులుగా ఉంటూ వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్న వారికే జగన్ మంత్రివర్గంలో పెద్ద పీట వేస్తారన్న ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో గతంలో తన ప్రచారంలో భాగంగా కొందరికి మంత్రి పదవి ఇస్తానన్న మాటను చెప్పారు.తానిచ్చిన హామీలు నెరవేర్చేలా చేయటంతో పాటు, తనను నమ్ముకున్న నేతల ఆశల్ని వమ్ము చేయకుండా జగన్ తన మంత్రివర్గ కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. జగన్ మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలు కూడా కీలక భూమిక పోషిస్తాయంటున్నారు. ఇప్పటికే కేబినెట్ రేస్ లో ఉన్న నేతలు, వారి సామాజిక వర్గాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే, జగన్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉన్న నేతలు, వారి సామాజిక నేపథ్యాలకు సంబంధించిన లిస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ జాబితాను చూస్తే..

List of District Wise Ministers in Jagan’s Cabinet

1. శ్రీకాకుళం

కంబాల జోగులు (రాజాం-ఎస్సీ)
తమ్మినేని సీతారాం (ఆమదాలవలస–బీసీ)
ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం)/ ధర్మాన కృష్ణదాసు (నరసన్నపేట-బీసీ)
కళావతి (పాలకొండ-ఎస్టీ)

2. విజయనగరం

బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి–బీసీ)
కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం- ఓసీ-వైశ్య)
పుష్పశ్రీవాణి (కురుపాం-ఎస్టీ)

3. విశాఖ

అవంతి శ్రీనివాస్ (భీమిలి-కాపు)
కరణం ధర్మశ్రీ (చోడవరం-కాపు)
గుడివాడ అమరనాథ్(అనకాపల్లి-కాపు)
ముత్యాల నాయుడు (మాడుగుల-బీసీ)

4. తూర్పు గోదావరి

ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ)
పినిపె విశ్వరూప్ (అమలాపురం-ఎస్సీ)
దాడిశెట్టి రాజా (తుని-కాపు)

5. పశ్చిమగోదావరి

ప్రసాదరాజు (నరసాపురం-క్షత్రియ)
గ్రంథి శ్రీనివాస్ (భీమవరం-కాపు)

6. కృష్ణా

కొడాలి వెంకటేశ్వరరావు-(నాని) (గుడివాడ-కమ్మ)
కొలుసు పార్థసారథి (పెనమలూరు-బీసీ)
పేర్ని నాని (బందరు-కాపు)
సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట-కాపు)

7. గుంటూరు

మేకపాటి సుచరిత (ప్రత్తిపాడు-ఎస్సీ)
మర్రి రాజశేఖర్ (ఎమ్మెల్సీ ఇస్తారు- కమ్మ)
ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి-రెడ్డి)
అంబటి రాంబాబు (సత్తెనపల్లి-కాపు)

8. ప్రకాశం

బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు- రెడ్డి)
ఆదిమూలపు సురేశ్ (యర్రగొండపాలెం-ఎస్సీ)

9. నెల్లూరు

మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు-రెడ్డి)
కాకాణి గోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి-రెడ్డి)
అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ-బీసీ)

10. చిత్తూరు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు-రెడ్డి)
ఆర్.కె.రోజా (నగరి-రెడ్డి)

11. YSR కడప

అంజాద్ బాషా (కడప- ముస్లిం)
కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు-ఎస్సీ

12. అనంతపురం

అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్-రెడ్డి)
శంకరనారాయణ (పెనుకొండ-బీసీ)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం-బీసీ)

13. కర్నూలు

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్-రెడ్డి)
శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం-రెడ్డి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here