సీయం ర‌మేష్ క‌నిపిస్తే కాల్చివేత రోజులొస్తాయి. మంత్రి ఆది హెచ్చ‌రిక‌ – Minister Adi Sensational Comments on CM Ramesh

0
466

సీయం ర‌మేష్ క‌నిపిస్తే కాల్చివేత రోజులొస్తాయి. టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు పై ఫిరాయింపు మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి హెచ్చ‌రిక‌. పోట్ల‌దుర్తి కుంటుంబీకుల‌ను చెప్పుల‌తో కొట్టే రోజులు వ‌స్తాయంటున్న మంత్రి ఆది. సీయం ర‌మేష్ పై మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి జ‌మ్మ‌ల‌మడుగు మ‌హానాడు వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. సీయం ర‌మేష్ ప్ర‌తీ ప‌నికి అడ్డు ప‌డ‌ట‌మే కాకుండా అన‌వ‌స‌ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. తాను గ‌న్ లాంటి వాడిన‌ని..కార్య‌క‌ర్త‌లు బుల్లెట్ ల‌ను అందిస్తే త‌న ప‌ని కాల్చ‌ట‌మేన‌ని మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేసారు. సీయం ర‌మేష్ ప్ర‌తీ ప‌నికీ అడ్డొస్తే క‌నిపిస్తే కాల్చివేత రోజులొస్తాయ‌న్నారు. త‌న పై కొంద‌రు నీచంగా మాట్లాడుతున్నార‌ని..రామ‌సుబ్బారెడ్డిగానీ, ఆయ‌న వ‌ర్గీ యులు దేనికి సిద్ద‌ప‌డినా ఎదుర్కొనేందుకు తాను సిద్ద‌మ‌ని స్ప‌ష్టం చేసారు.సీయం ర‌మేష్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసుకుంటున్నార‌ని..ఇక్క‌డ ఉన్న నాయ‌కులు కాకుండా వారు వంద‌ల కోట్ల పనులు చేసుకుంటున్నా తాము ప‌ట్టించుకో వ‌టం లేద‌ని చెప్పుకొచ్చారు. గ‌తంలో కొండాపురంలో ముంపువాసుల కాల‌నీల్లో చేప‌ట్టిన ప‌నుల‌కు అడ్డుప‌డితే ఏం జ‌రిగిం దో తెలుసుకోవాల‌ని హెచ్చ‌రించారు. తాను జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండి ఖ‌చ్చితంగా పోటీలో నిల‌బ‌డ‌తాన‌ని తేల్చి చెప్పారు. భ‌విష్య‌త్‌లో ఏం జ‌రిగినా కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాత‌నే నిర్ణ‌యాలు తీసుకుంటానంటూ ప్ర‌క‌టించారు. అయితే, ఇప్ప‌టికే జిల్లాలో బ‌ద్వేలు, ప్రొద్దుటూరు లో సైతం మంత్రి ఆదికి వ్య‌తిరేకంగా స్థానిక నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇక‌, ఇప్పుడు క‌డ‌ప జిల్లాకే చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్ పై మంత్రి ఆది చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. జ‌మ్మ‌ల‌మ‌డుగులో జ‌రిగిన మ‌హానాడు కు మంత్రి ఆది పాల్గొన‌టంతో..ఆ స‌మావేశానికి ఆయ‌న సోద‌రుడు, మాజీ ఎమ్మెల్సీ దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి గైర్హాజ‌ర‌య్యారు. క‌డ‌ప జిల్లాలో ఇప్పుడు టిడిపి నేతలంతా ఆదికి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వు తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీ ఫిరాయించి మంత్రి ప‌ద‌వి ద‌క్కించికొని త‌మ  మీదే పెత్త‌నం చేయ‌టం పై వారు బ‌హిరం గంగానే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో..రానున్న రోజుల్లో మంత్రి ఆది వ‌ర్సెస్ క‌డ‌ప టిడిపి గా ప‌రిస్థితులు మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here