జగన్ ని పొగడ్త లతో ముంచెత్తిన కేంద్ర మంత్రి – Minister Ramdas Athawale Praises YS Jagan

0
541

జ‌గ‌న్ బ‌ల‌మైన నేత‌గా జాతీయ నేత‌లే గుర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో జ‌గ‌న్ కు ఇంత గుర్తింపు రావ టానికి కార‌ణం ఏంటి. జాతీయ నేత‌లే జ‌గ‌న్ ను బ‌ల‌మైన నేత‌గా అభివ‌ర్ణిం చే స్థాయికి జ‌గ‌న్ ఎలా చేరారు. ఎపిలో బల మైన నేత వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామదాస్ అద్వాలే వ్యాఖ్యానించారు. ఆయ‌న టిడిపి మీద ఆగ్ర‌హంతో జ‌గ‌న్ గురించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌లేదు. చంద్ర‌బాబు ఇప్ప‌టి కైనా ఎన్డీఏతోనే ఉండాల‌ని కోరుకుంటున్న నేత‌. జ‌గ‌న్ బ‌లం గురించి బిజెపి నేత‌లు 2014 లోనే అంచ‌నా వేసారు. అందు కోస‌మే పొత్తు కోసం వారంత‌ట వారుగా ప్ర‌తిపాదించారు. ఇప్పుడు సైతం బిజెపి జ‌గ‌న్ తో పొత్తు పెట్టుకుంటారంటూ టిడిపి నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అటువంటి ఏదీ ఉండ‌ద‌ని వైసిపి నేత‌లు కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.

ఇక‌. నాడు సోనియా ను ఎదిరించిన నాటి నుండి నేడు మోదీ ప్ర‌భుత్వం పై అవిశ్వాసం పెట్టిన తీరు వ‌ర‌కు ఇద్ద‌రిని తొలుత ఎదిరించిన అతి త‌క్కువ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత జ‌గ‌న్‌. దీంతో అంద‌రి దృష్టిని జ‌గ‌న్ ఆక‌ర్షించారు. ఇక‌, ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఇంత గా ఉండే నేత‌ ఏ నేత‌కూ, ఏ సినీ యాక్ట‌ర్ కు లేని జ‌నాద‌ర‌ణ జ‌గ‌న్ సొంతం. జ‌గ‌న్ కోసం వ‌చ్చే జ‌న‌మే బ‌లం. అదే ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. అంత‌గా జ‌నాన్ని ఆకర్షించే నేత ద‌క్షిణాదిలో ప్ర‌స్తుతానికి క‌నిపించ టం లేదు. దీంతో అన్ని జాతీయ పార్టీల అధ్య‌క్షులు జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త‌ను గుర్తిస్తున్నారు. తాజాగా, రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత సైతం అదే విధంగా స్పందించారు. ఇక‌, కేసుల్లో జ‌గ‌న్ వాద‌న‌నే ఇప్పుడు జాతీయ పార్టీల నేత‌లు వినిపిస్తున్నారు.

జగన్ కాంగ్రెస్ లో ఉన్నంతకాలం కేసులు లేవని, కాని ఆయన పార్టీతో విబేధించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం కక్ష పెట్టి కేసులు పెట్టిందని కాని అవి నిరూపితం కలేదని అద్వాలే అన్నారు. ఇప్పుడు టిడిపి ప్ర‌భుత్వం పై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌తో..ఇక‌, వారు జ‌గ‌న్ పై చేసిందంతా దుష్ప్ర‌చార‌మ‌నే విష‌యం అంద‌రికీ అర్ద‌మైంది. ఒక వ‌ర్గం మీడియా జ‌గ‌న్ కు ప్ర‌తికూలంగా ఉన్నా, టిడిపి నేత‌లు ప్ర‌తీ అంశంలో జ‌గ‌న్ పై వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నా, జాతీయ నేత‌లు మాత్రం జ‌గ‌న్ ను బ‌ల‌మైన నేత‌గా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇది వైసిపి కి నైతికంగా అద‌న‌పు బ‌లంగా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here