పార్ల‌మెంట్ లో మోదీ, ఏపిలో గెలిచెందెవ‌రు, Modi In Parliament and Who Will Win In Andhra Pradesh 2019 Election ?

0
504

పార్ల‌మెంట్ లో మోదీ గెలిచారు. మ‌రి ఏపిలో గెలిచెందెవ‌రు. అవిశ్వాసం పేరుతో జ‌రిగిన రాజ‌కీయ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుందెవ‌రు. 2014 నుండి ఏపిలో ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతోంది వైసిపి.  ప్ర‌త్యేక హోదా స్థా నం లో ప్ర‌త్యేక ప్యాకేజి కి రూప‌క‌ల్ప‌న చేసింది బిజెపి ఆహ్వానించింది టిడిపి. ఇక‌, హోదా విష‌యంలో వైసిపి వేసిన వ్యూ హాత్మక ఎత్తుగ‌డ‌లతో 40 ఏళ్ల అనుభ‌వం, వైసిపి ని అనుస‌రించ‌క త‌ప్ప‌లేదు. ప్ర‌త్యేక హోదా పై పూర్తిగా అప్ప‌ర్ హ్యాండ్ సాధించిన వైసిపి ఏ నిర్ణ‌యం తీసుకుంటే టిడిపి ఫాలో అయిపోయింది.

స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ ఇదే విష‌యాన్ని పార్ల మెంట్ సాక్షిగా బ‌హిర్గ‌తం చేసారు. ఈ రోజు కాదు టిడిపి త‌న మంత్రుల‌ను క్యాబినెట్ నుండి విత్ డ్రా చేసుకున్న టైం లో నే ప్ర‌ధాని ముఖ్య‌మంత్రికి ఫోన్ చేసి ఈ హెచ్చ‌రిక చేసారు. మీరు రూటు మారిస్తే ఏపిలో వైసిపి బ‌ల‌ప‌డుతుంద‌ని మోదీ స్ప‌ష్టంగా నాడే చెప్పారు. ఆ త‌రువాత చెప్పిన మాట ప్ర‌కారం వైసిపి ఎంపీలు రాజీనామా చేసారు. ఇంకే ముంది వైసిపి గ్రౌండ్ మ‌న‌కు వ‌దిలేసింది. ఇక‌, పార్ల‌మెంట్ లో అవిశ్వాస నోటీసు తో మ‌రి కొంత మైలేజ్ సాధించ‌వ‌చ్చు స‌భ‌లోని లేని వైసిపిని ఇర‌కాటంలో ప‌డేయ‌చ్చ‌ని టిడిపి భావించింది. ఇక‌, నోటీసు ఇవ్వ‌టం దాని పై చ‌ర్చ జ‌ర‌గ‌టం పూర్త‌యింది. ఇక‌, స‌భ‌లో టిడిపి ఎంపి మాట్లాడిన స్పీచ్ మొత్తం ఏపి అసెంబ్లీలో జ‌గ‌న్ స్పీచ్ అనే విష‌యం రాజ‌కీయంగా ఏ మాత్రం అవ‌గా హ‌న ఉన్న వారికైనా అర్ద‌మ‌వుతుంది. ఇక‌, వైసిపి ట్రాప్‌లో టిడిపి ప‌డింద‌ని మోదీ ఓపెన్‌గా చెప్ప‌టాన్ని టిడిపి అధినేత జీర్ణించుకోలేక‌పోతున్నారు. నేనేంటి 40 ఏళ్ల అనుభ‌వం నేను వైసిపి ట్రాప్‌లో ప‌డ‌టం ఏంటంటూ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, జ‌గ‌న్ సైతం రియాక్ట్ అయ్యారు.

టిడిపితో పాటుగా బిజెపి-మోదీ-కాంగ్రెస్ ను సైతం నిల‌దీసారు. బంద్ కు పిలుపునిచ్చారు. పార్ల‌మెంట్‌లో టిడిపి ఎంపీ జ‌గ‌న్ చెబుతూ వ‌చ్చిన అంశాల‌నే ప్ర‌స్తావించటం. రాజ్‌నాధ్ త‌మ‌కు చంద్ర‌బాబు ఎప్ప‌టికీ మిత్రుడంటూ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధాని మోదీ టిడిపి వైసిపి ట్రాప్ లో ప డిందంటూ చంద్ర‌బాబుకు చేసిన హెచ్చరిక‌ను స్వ‌యంగా  బ‌య‌ట పెట్ట‌టం. ఇలా టిడిపి త‌మ‌కు అనుకూలంగా మారు తుంద‌నుకున్న అవిశ్వాసం చివ‌ర‌కు వైసిపి చేతికి ఆయుధాన్ని అందించిన‌ట్లుగా అయింది. దీంతో డామేజ్ కంట్రోల్ కోసం ఢిల్లీ వెళ్లి మ‌రీ ఇక్క‌డ చెప్పిన విష‌యాల‌నే అక్క‌డా చెప్పారు. ఇప్పుడు తిరిగి వైసిసి చేతికి ఆయుధం చిక్కింది. టిడిపి మ‌రోసారి వైసిపి ఏం చేస్తుంద‌నే ఉత్కంఠ తో ప్ర‌తీ నిమిషం వాచ్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రి వైసిపి ఏం చేస్తుంది. పార్ల‌మెంట్ లో అవిశ్వాసం త‌రువాత ఏపి ప్ర‌జ‌ల్లో ఎవ‌రి ఇమేజ్ పెరిగింది ఎవ‌రి ఇమేజ్ డామేజ్ అయిందో, మీరే మీ అభిప్రాయాల‌ను కామెంట్ల ద్వారా తెలియ‌చేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here