వచ్చే ఎన్నికల్లో టిడిపి ఆటలు సాగవా. ప్రధాని మోదీ ఈ మేరకు హామీ ఇచ్చారా. వైసిపి నిజంగా బిజెపి పరోక్ష సహకారం అందుకుంటుందా. ఏం జరుగుతోంది. ఆంధ్రజ్యోతి కొత్తపలుకులో ప్రస్తావించిన ఈ అంశం ఇప్పుడు వైసిపి తో పాటుగా టి డిపిలోనూ చర్చకు కారణమైంది. పార్లమెంట్‌లో అవిశ్వాసం ఎపిసోడ్ పై ప్రధానంగా కొత్తపలుకు టార్గెట్ చేసింది. అందులో మోదీ వైఖరిని తూర్పారబడుతూ టిడిపిని ఆకాశానికెత్తేసారు. పనిలో పనిగా రాహుల్‌గాంధీ కిమంచి మర్కులే వేసారని కదనంలో ప్రముఖంగా పేర్కొన్నారు.
చంద్రబాబు పై చులకన భావం ఏర్పడటానికి గవర్నర్ – ప్రధానికి ఇచ్చిన బ్రీ ఫింగ్ కారణమని కొత్తపలుకులో తేల్చేసారు. అయితే ఢిల్లీలో మాత్రం చంద్రబాబు వర్సెస్ కెసిఆర్ గా సాగిన బ్రీఫ్‌డ్ మి కేసు అని ప్రచారం జరుగుతోంది. ఇక ఎప్పటి లాగానే బిజెపి- వైసిపి మధ్య సంబంధాలు ఉన్నాయని నమ్మించే విధంగా ఈ సారి కూడా కొత్త పలుకులో శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు జరిగాయి. బిజెపి నుండి అందుతున్న పరోక్ష సహకారం తో వచ్చే ఎన్నికల తరువాత అధికారంలోకి రావచ్చని వైసిపి నేతలు భావిస్తున్నారని కొత్త పలుకులో రాపుకొచచారు. అదే వ్యాసంలో ఎన్నికలలో చంద్రబాబు డబ్బు పంచుతారని మీరు ఆందోళన చెందవద్దు. ఆయన ఆటలు సాగకుండా నేను చూస్తా నంటూ ప్రదాని మోదీ వైసిపి నేతలకు హామీ ఇచ్చారట, అంటూ కొత్త విషయాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే ఇది ఒక రకంగా వైసిపి కి బిజెపి మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పటానికి రాసుకొచ్చే అంశం అయినా, అందులో ఎ న్నికల్లో డబ్బులతోనే టిడిపి గెలుస్తుందనే భావన ఇప్పటికే ఉండగా తాజా వ్యాఖ్యానాలతో మరో సారి చర్చకు వచ్చింది.
టిడిపి ఎంపీలు లోక్‌సభలో చేసిన ప్రసంగాలను అవీ స్పీచ్‌లంటే అంటూ కొత్త పలుకులో టిడిపి ఎంపీలను ప్రశంస లతో ముంచెత్తారు. ఆ ఇద్దరు యువ కిశోరాలంటూ కీర్తించారు. అందులో రామ్మోహన్ నాయుడును యువ కిశోరం అంటే ఆర్దం చేసుకోవచ్చు. కానీ, గల్లా జయదేవ్ వయసు 50 ఏళ్లు పై మాటే. ఆయన్ను కూడా యువ కిశోరం అంటూ కీర్తించటం తో దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది స్పష్టమవుతంది. ఇక, ఇదే జయదవ్ ప్యాకేజికి అనుకూలంగా 2017, మార్చి 12న ప్యాకేజి బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలను అప్పట్లోనే జాతీయ దిన పత్రికలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఇక, జగన్ నాలుగేళ్లుగా చెబుతున్న అంశాలనే జయదేవ్ లోక్‌సభలో ప్రసంగించారు. కానీ, ఇదే అంశం పై జగన్ చెబుతున్న సమయం లో ఇదే కొత్తపలుకులో ఏనాడు అభినందించలేదు. పైగా కేంద్రం ఇస్తామన్నది తీసుకోవటం వివేకులు చేసే పని అంటూ సూచనలు చేసారు. ఇప్పుడు జగన్ వాదనే టిడిపి వినిపిస్తుంటే వారికి భజన చేస్తున్నారు. మొత్తానికి ప్రధాని వ్యాఖ్యలత ఏపికి ఎటువంటి లాభం లేదనే విషయంలో ఎంత వాస్తవం ఉందో చంద్రబాబు యూ టర్న్ ద్వారా ఆత్మరక్షణలో పడ్డార నే విషయం ఆయన ఢిల్లీ పర్యటన ప్రెస్‌మీట్ లోనే అర్దమైంది.