జ‌గ‌న్ మొన‌గాడు అని తేల్చిన‌ట్లేనా, మోదీ వ్యాఖ్య‌ల వెనుక ప‌ర‌మార్ధం ఇదేనా, Modi’s Inner Voice Behind Praise for YS Jagan

0
472
జ‌గ‌న్ మొన‌గాడు అని తేల్చిన‌ట్లేనా..!!
మోదీ వ్యాఖ్య‌ల వెనుక ప‌ర‌మార్ధం ఇదేనా..!!
అవిశ్వాసం త‌రువాత జ‌రిగేదేంటి. జ‌గ‌న్ కు వ‌చ్చిన గుర్తింపు ఏంటి. టిడిపి అధినేత సాధించేందేంటి. ఏపి ప్ర‌జ‌ల దృష్టిలో నే కాదు, ఇప్పుడు ఈ అవిశ్వాసం పై చ‌ర్చకు స‌మాధానం ఇచ్చే  స‌మ‌యంలోప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌ల ద్వారా జ‌గ‌న్ ని మొన‌గాడు గా, ప‌రోక్షంగా ప్ర‌ధాని సైతం ఒప్పుకున్నారు. తొలి నుండి జ‌గ‌న్ ఒకే మాట మీద ఉన్నారు. ఏపికి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని చెబుతూనే ఉన్నారు. వైసిపి నేత‌లు చివ‌ర‌కు జ‌గ‌న్ అంగీక‌రించినా లేకున్నా ప్ర‌ధాని మోదీ చెప్పింది నిజం. ఏపిలో వైసిపి ట్రాప్‌లో టిడిపి ప‌డింద‌నేది వాస్త‌వం. జ‌గ‌న్ బాట‌లోనే టిడిపి న‌డిచింది అనేది నిజం.
హోదా కాదు, ప్యాకేజి ఏపికి ప్ర‌యోజ‌నం విజ్ఞత క‌లిగిన నేత‌గా ప్యాకేజికి అంగీక‌రించాను ఏపి ప్ర‌భుత్వంతో పాటుగా ప్ర‌జ‌ల త‌ర‌పున కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా అంటూ శాస‌న‌స‌భా వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అటువంటి ముఖ్య‌మంత్రి తో ప్యాకేజి కాదు, హోదానే కావాలి అని యూ ట‌ర్న్ తీసుకొచ్చే విధంగా చేసింది జ‌గ‌న్‌. హోదా అంశాన్ని స‌జీవంగా ఉంచుతూ, ప్ర‌జ‌ల్లో హోదా సాధించే నేత‌గా గుర్తింపు పొందారు. టిడిపి స‌ర్వేల్లోనూ ఆదే తేలింది. అంతే కాదు, అవిశ్వాసం పెడితే మొస్తుంద‌న్న నోటితోనే, మేమే అవిశ్వాసం పెడ‌తామ‌ని ముందుకొచ్చేలా చేసారు. జ‌గ‌న్ ట్రాప్ లో టిడిపి చిక్క‌కుంది. ఊహించిందే జ‌రిగింది. ఇక, స‌భ‌లో ప్ర‌ధాని అధికారిక హోదాలో ఏపిలో రాజ‌కీయంగా ఎవ‌రి శ‌క్తి సామ‌ర్ధ్యాలు ఏంటో ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు.
వైసిపి ట్రాప్‌లో టిడిపి ప‌డింద‌ని తేల్చేసారు. అక్క‌డి రాజ‌కీయాల కోసం పార్ల‌మెంట్ ను వాడుకుటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌నిలో ప‌నిగా కెసిఆర్ ను ప‌రిణితి చెందిన నేత‌గా ప్ర‌స్తావించి ప‌రోక్షంగా చంద్ర‌బాబు లో ఆ ప‌రిణితి లేద‌నే విధంగా వ్యాఖ్యానించారు. ఇక‌, చంద్ర‌బాబు యూ ట‌ర్న్ తీసుకున్నారంటూ వైసిపి ఏదైతే చెబుతూ వస్తుందో అదే చెప్పేసారు. ఇక‌, స‌భ‌లో జ‌య‌దేవ్ సైతం శాస‌న‌స‌భ‌లో జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగాల‌నే గుర్తు చేసేలా మాట్లాడార‌ని ప్ర‌చారం మొద‌లు కావ‌టం, టిడిపికి అస‌లు మింగుడు ప‌డ‌టం లేదు. ఒక వైపు ప్ర‌ధాని, టిడిపి అధినేత వైఖ‌రిని రెండే రెండు మాట‌ల్లో తేల్చి చెప్పేసారు. వెంట‌నే ఢిల్లీ వెళ్లి త‌మ‌కు స‌హ‌క‌రించిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతామంటూ వెళ్లి కేవలం మీడియా స‌మావేశానికి సొంత పార్టీ ఎంపీల‌తో మీటింగ్ కు ప‌రిమిత‌మ‌య్యారు.
జ‌గ‌న్ ట్రాప్ లో చంద్ర‌బాబు చిక్కుకున్నార‌ని ప్ర‌ధాని గ‌తంలోనే స్వ‌యంగా ముఖ్య‌మంత్రికే చెప్పారు. మీరు తీసుకుంటున్న నిర్ణ‌యం తో వైసిపి బ‌ల‌ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. అది టిడిపి అధినేత‌కు న‌చ్చ‌లేదు. కానీ, ఇప్పుడు దేశం మొత్తం చూస్తండ‌గా న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఉన్న త‌న‌ను జ‌గ‌న్ ట్రాప్ లో ప‌డ్డాన‌ని అంటారా అంటూ సీయం మ‌ధ‌న ప‌డుతున్నారు. జ‌గ‌న్ తో త‌న‌ను పోలుస్తారా అంటూ ఆవేద‌న చెందుతున్నారు. కానీ, మోదీ ప‌రోక్షంగా జ‌గ‌న్ మొన‌గాడు అని తేల్చిన‌ట్లేనా..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here