నారా బ్రహ్మాణి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేయబోతున్నారు. టిడిపి అధినేత మనోగతం ఏంటి. కొంత కాలం గా నారా బ్రహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బ్రహ్మణి టిడిపిపి స్టార్ క్యాం పెయినర్ గా ఉంటారని విజయవాడ నుండి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. అయితే, హెరిటేజ్ ఇడి గా బ్రా హ్మణి సక్సెస్ అయ్యారు. నిజంగా రాజకీయాల్లోకి వస్తారా రారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఎక్కడా ముఖ్య మంత్రి కానీ, బ్రహ్మణి భర్త మంత్రి లోకేస్ కానీ బ్రహ్మణి రాజకీయా ఎంట్రీ పై స్పందించలేదు. హెరిటేజ్ తో పాటుగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి సేవా కార్యక్రమాల పై ఆమె దృష్టి సారిస్తూ వచ్చారు. హెరిటేజ్ ఇడి గా ఉత్తర భారతం లో సంస్థ విస్తరణే తన లక్ష్య మని బ్రాహ్మణి చెబుతూ వచ్చారు. తాజాగా విదేశాల్లోని ఇతర సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకు న్నట్లు చెబుతున్నారు. ఇటీవల దావోస్ లో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులోనూ బ్రాహ్మణి పాల్గొన్నారు. బ్రాహ్మణి రాజకీయంగానూ రాణిస్తారంటూ టిడిపి నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అయితే, తొలి సారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై స్పష్టత ఇచ్చేసారు. తెలంగాణ టిడిపి నేతల సమావేశంలో భాగంగా పార్టీ నేతలు తెలంగాణలో బ్రహ్మణికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాల ని పార్టీ అధినేత ముందు మొరపెట్టుకు న్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పార్టీ కేడర్ ఇంకా నాయకత్వం పై ఆశగా చూస్తుందని అధినేత ముందు వాపోయారు. నందమూరి – నారా కుటుంబాలకు చెందిన బ్రహ్మణికి బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా పార్టీకి పునర్జీవం వస్తుందని వివరించారు. కానీ, చంద్రబాబు సమాధానం విన్న తెలంగాణ టిడిపి నేతలు నిరాశ చెందారు. బ్రహ్మణికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చంద్రబాబు తేల్చి చెప్పేసారు. అయితే, తెలంగాణలో ఏం చేసినా పార్టీకి జోష్ తేలేమని ఏపిలో వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య గా మారుతున్న సమయంలో బ్రహ్మణిని అవసరమైతే ఎంపి సీటును ఎంచుకొని పోటీ చేయించాలనేది టిడిపి అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. దీని కోసమే తెలంగాణ నేతల వినతిని చంద్రబాబు పక్కన పెట్టేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు రాజకీయాలకు దూరంగానే ఉంటారో చూడాలి.