మాజీ ముఖ్యమంత్రి తనయుడు వైసిపి బాట పట్టారు. త్వరలోనే అధికారికంగా వైసిపిలో చేరనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి – మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మీ కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వైసిపిలో చేరటానికి రంగం సిద్దమైంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి అను చరగణం ఎక్కువగా కనపిస్తెంది. నేదురుమల్లి-వైయస్ఆర్ కాంగ్రెస్ లో వైరి వర్గాలుగా ఉన్నప్పటికీ..వైయస్ ముఖ్యమంత్రి కాగానే నేదురుమల్లి సతీమణి రాజ్యలక్ష్మిని వైయస్ తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.
విద్యాశాఖ మంత్రిగా పని చేసరు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి బాపట్ల, విశాఖపట్నం, నర్సరావుపేట నుండి ఎంపీగా, వెంకటగిరి నుండి ఎమ్మెల్యేగా వ్యవ హరించారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మీ సైతం వెంకటగిరి నుండి రెండు సార్లు గెలిచారు. 2014 ఎన్నికల్లో నేదురుమల్లి తనయుడు రాంకుమార్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసారు. అయితే, తాజాగా జనార్ధనరెడ్డి వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న రాంకుమార్ రెడ్డి తాను నేదురుమల్లి అభిమానుల అభిప్రాయాలు తెలుసుకొని 2019 లో వెంకటగిరి నుండి ఏ పార్టీ నుండి పోటీ చేయాలో నిర్ణయించుకుంటానని ప్రకటించారు. దీని పై అభిమానులతో మాట్లాడుతున్న సమయంలోనే.. మధ్యలో ఓ అభిమాని మన పార్టీ ‘వైఎస్‌ఆర్ సీపీ’ అంటూ గట్టిగా అరిచాడు. దీనికి స్పందించిన ఆయన మీ అభిప్రాయాలను మరో 3 నెలలు మనసు లోనే ఉంచుకోవాలి.
మీ అందరి మనసుల్లో ఏ పార్టీ అనుకుంటున్నారో అదే పార్టీ నుంచి వెంకటగిరిలో పోటీ చేస్తానని చెప్పటం ద్వారా త్వరలో వైసిపిలో చేరటం ఖాయమనే సంకేతాలిచ్చారు. గత నెలలో గూడూరు వైసీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్ రాంకుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలసి చర్చించడం, ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్పడంపై ఆయన కచ్చితంగా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో మేకపాటి-నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఇప్పటికే వైసిపిలో ఉన్నారు. ఆనం కుటుంబం సైతం టిడిపిని వీడేందుకు సిద్దంగా ఉంది. ఇక, పనబాక కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉన్నా.. అంత యాక్టివ్ గా లేరు. ఇక, ఆదాల సైతం టిడిపిలో ఉన్నా…పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టిడిపి వెంకటగిరి, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాలను గెలుచుకోగా, మిగిలిన నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది.
జగన్ పాదయాత్ర సందర్భంలో నెల్లూరు జిల్లాలో విశేష స్పందన లభించింది. ఈ పరిస్థితుల్లో నేదురుమల్లి వారసుడు సైతం వైసిపి లో చేరటం ద్వారా ఆ జిల్లాలో పూర్తిగా వైసిపి పట్టు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఉన్నా..వారిద్ద రూ ఎమ్మెల్సీల కోటా నుండి మంత్రులైనవా రే. దీంతో..ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో వైసిపి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది