శరణు కోరారా..సంధి కుదిరిందా..!!
ఏపి లో బిజెపి కొత్త ఫార్ములా ఇదేనా..!!
జగన్ సమర్ధతకు అసలు పరీక్ష..!!
అసలు కధ మొదలైంది..వాట్ నెక్స్ట్..!!
ఢిల్లీ వర్సెస్ అమరావతి ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. టిడిపి వర్సెస్ బిజెపి ఇది రోజు వినిపించే మాట. చంద్ర బాబు అవినీతిని బట్ట బయలు చేస్తాం. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తాం ఇది బిజెపి నేతలు హోరెత్తించిన అంశం. మోదీ ప్రభుత్వంలో అవినీతిని నెల రోజుల్లో సాక్ష్యాధారాలతో సహా బయట పెడతాం ఇది ఏపి ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షు డు కుటుంబరావు హెచ్చరిక.
కర్నాటక ఎన్నికల తరువాత ఏపిలో మా తడాఖా చూస్తారు ఇది బిజెపి నేతలు లీకులు. ఏ మైంది బిజెపి -టిడిపి మధ్య ఒకరి పై ఒకరు దూసుకున్న ఆ కత్తులు ఏమయ్యాయి. ఒక వైపు బిజెపి తో వైసిపి – జనేసన కలిసాయని ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయని టిడిపి పదేపదే విమర్శిస్తోంది. తాము మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపి తో పోరాడుతున్నామని చెప్పుకొస్తోంది. కానీ, కొద్ది రోజులుగా బిజెపి ముఖ్యుల పై టిడిపి నేతలు చేస్తున్న విమర్శల్లో పస తగ్గుతోంది. అదే విధంగా బిజెపి ఢిల్లీ పెద్దలు ఇప్పటి వరకు నేరుగా టిడిపి పై ఎటువంటి కామెంట్లు చేయటం లేదు. ఏపిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పై దాడులు జరుగుతున్న ఢిల్లీ పెద్దలు స్పందించిన దాఖలాలు లేవు. తిరుపతిలో ఏకంగా బిజెపి జాతీయాధ్యక్షుడి కాన్వాయ్ పై దాడికి ప్రయత్నం జరిగినా సీరియస్‌గా తీసుకున్నారా అంటే పైకి సీరియస్ లోప ల మాత్రం కనిపించని ఆ సీరియస్ నెస్.
పోలవరంలో అవినీతి జరిగిదంటూ రాష్ట్ర బిజెపి నేతలు విమర్శిస్తుంటే గడ్కరీ లాంటి సీనియర్ బిజెపి నేత ఏపికి వచ్చి పోలవరం పనులు బేష్ అంటూ కితాబిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగి న నీతి అయోగ్ సమావేశం తరువాత ఈ మార్పులు కనిపిస్తున్నాయి. టిడిపి మీద దండయాత్ర తప్పదని హెచ్చరిస్తూ వచ్చిన బిజెపి నేతల్లో క్రమంగా మార్పు కనిపిస్తోంది. తాము ఏపిలో బిజెపి పై ఫైట్ చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్న టిడిపి ఢిల్లీ స్థాయిలో కొందరు మాజీ లతో సఖ్యత కొనసాగిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ గమనించిన వైసిపి అధినేత వెంటనే అప్రమత్తవయ్యారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కు వైసిపి మద్దతు ఉండదని తేల్చి చెప్పారు. తాము బిజెపికి మద్దతు ఇవ్వటం లేదని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి స్పష్టత ఇచ్చేసారు. ఇక, టిడిపి -బిజెపి మధ్య కయ్యం కంటే తటస్థం మేలనే అభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో జగన్ మరింత అప్రమత్తం కావాల్సి న సమయం ఏర్పడింది.
టిడిపి – బిజెపి వైఖరి పై అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ ఉచ్చులో చిక్కుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం జగన్ కు ఏర్పడిందని విశ్లేషకులు అలర్ట్ చేస్తున్నారు. ఇక, సమరమే అంటూ ముందకొచ్చిన టిడిపి నేతలు ఇప్పుడు శరణు కోరారో లేక సంధి కోసం రెండు పార్టీల నుండి ప్రయత్నాలు జరుగుత్నాయో కానీ ఈ పరిణామాలు జగన్ రాజకీయ చతురతకు వ్యూహాలకు సవాల్ గా మారుతున్నాయి.