Home Blog Page 17

ఆర్. నారాయణమూర్తి జగన్ బంపర్ ఆఫర్ ?, AP Chief Minister YS Jagan bumper offer to actor R Narayana Murthy?

0

ఆర్. నారాయణమూర్తి.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు, ఇప్పుడు అంత హవా లేదు కానీ, ఓ 15, 20 ఏళ్ల క్రితం ఆయన తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు వంటి సినిమాలతో తెలుగు తెరకు విప్లవం అద్దాడు, కోట్ల రూపాయలు సంపాదించినా, ఆ కోట్లు తన కోసం ఏమాత్రం ఖర్చు చేయని సినీయోగి ఆర్. నారాయణ మూర్తి, అలాంటి నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. అందుకే ఆయనకు అనేక పార్టీలు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించాయి కూడా. కానీ ఆయనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. వైసీపీ అధినేత జగన్ తుని టికెట్ ఇస్తామని ప్రపోజ్ చేశారట.

టీడీపీ కూడా  కాకినాడ సీటు ఇప్పటికి మూడుసార్లు ఆఫర్‌ చేసిందట. గతంలో పీఆర్పీ కూడా రాజకీయాల్లోకి రమ్మని అడిగిందట. కానీ ఇష్టం లేక ఆ రంగంలోకి వెళ్లలేదట.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయటపెట్టారు ఆర్. నారాయణమూర్తి. ప్రజలతో ఉంటున్నా. ఉద్యమ సినిమాలు తీస్తున్నా.. అంతకంటే ఏం కావాలి అంటారు నారాయణమూర్తి.  రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ప్రత్యక్షంగానే సేవ చేయొచ్చు కదా? అని అడిగితే..  ఏ రాజకీయ పార్టీలో అయినా చేరానే అనుకోండి. వాళ్లు చెప్పింది నేను చేయాలి. నాకు నచ్చకపోతే ఘర్షణ పడాలి. అది నాకు అవసరమా? నా రాజ్యంలో నేను రాజులా ఉంటున్నా. అక్కడకి వెళ్లి ఎందుకు తలొంచాలి? అంటూ తన ఫిలాసఫీ చెప్పారు ఆర్ నారాయణమూర్తి, దటీజ్ ఆర్.నారాయణమూర్తి.

జగన్ కేబినెట్ లో వుండే మంత్రులు జిల్లాల నుండి వీరే, List of YS Jagan Cabinet Ministers District Wise

0

జగన్ కేబినెట్ లో మంత్రులుగా అవకాశం దక్కేదెవరికి?  మొత్తం 175 స్థానాలున్న అసెంబ్లీలో ఏకంగా 151 స్థానాల్లో స్వీప్ చేసేసిన వేళ, మంత్రి పదవి కోసం ఆరాటపడేవారికి కొదవ ఉండదు. ఎన్నికల్లో తన విజయం పక్కా అన్న విషయం మీద స్పష్టత ఉన్నా, ఇంత భారీ ఎత్తున గెలుస్తానన్న ఊహ కూడా జగన్ కు ఉండకపోవచ్చు. తొలుత తాను అనుకున్న ఫార్ములా ప్రకారం కాకుండా, తాజాగా మారిన ఫలితాల నేపథ్యంలో కేబినెట్ కూర్పు ఉండక తప్పనిసరి పరిస్థితి.తన తండ్రికి సన్నిహితులుగా ఉన్న వారు, తాను పార్టీ పెట్టాక తనను నమ్ముకొని నడిచిన వాళ్లు, విధేయులుగా ఉంటూ వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్న వారికే జగన్ మంత్రివర్గంలో పెద్ద పీట వేస్తారన్న ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో గతంలో తన ప్రచారంలో భాగంగా కొందరికి మంత్రి పదవి ఇస్తానన్న మాటను చెప్పారు.తానిచ్చిన హామీలు నెరవేర్చేలా చేయటంతో పాటు, తనను నమ్ముకున్న నేతల ఆశల్ని వమ్ము చేయకుండా జగన్ తన మంత్రివర్గ కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. జగన్ మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలు కూడా కీలక భూమిక పోషిస్తాయంటున్నారు. ఇప్పటికే కేబినెట్ రేస్ లో ఉన్న నేతలు, వారి సామాజిక వర్గాలకు సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే, జగన్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఎక్కువగా ఉన్న నేతలు, వారి సామాజిక నేపథ్యాలకు సంబంధించిన లిస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ జాబితాను చూస్తే..

List of District Wise Ministers in Jagan’s Cabinet

1. శ్రీకాకుళం

కంబాల జోగులు (రాజాం-ఎస్సీ)
తమ్మినేని సీతారాం (ఆమదాలవలస–బీసీ)
ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం)/ ధర్మాన కృష్ణదాసు (నరసన్నపేట-బీసీ)
కళావతి (పాలకొండ-ఎస్టీ)

2. విజయనగరం

బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి–బీసీ)
కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం- ఓసీ-వైశ్య)
పుష్పశ్రీవాణి (కురుపాం-ఎస్టీ)

3. విశాఖ

అవంతి శ్రీనివాస్ (భీమిలి-కాపు)
కరణం ధర్మశ్రీ (చోడవరం-కాపు)
గుడివాడ అమరనాథ్(అనకాపల్లి-కాపు)
ముత్యాల నాయుడు (మాడుగుల-బీసీ)

4. తూర్పు గోదావరి

ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ)
పినిపె విశ్వరూప్ (అమలాపురం-ఎస్సీ)
దాడిశెట్టి రాజా (తుని-కాపు)

5. పశ్చిమగోదావరి

ప్రసాదరాజు (నరసాపురం-క్షత్రియ)
గ్రంథి శ్రీనివాస్ (భీమవరం-కాపు)

6. కృష్ణా

కొడాలి వెంకటేశ్వరరావు-(నాని) (గుడివాడ-కమ్మ)
కొలుసు పార్థసారథి (పెనమలూరు-బీసీ)
పేర్ని నాని (బందరు-కాపు)
సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట-కాపు)

7. గుంటూరు

మేకపాటి సుచరిత (ప్రత్తిపాడు-ఎస్సీ)
మర్రి రాజశేఖర్ (ఎమ్మెల్సీ ఇస్తారు- కమ్మ)
ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి-రెడ్డి)
అంబటి రాంబాబు (సత్తెనపల్లి-కాపు)

8. ప్రకాశం

బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు- రెడ్డి)
ఆదిమూలపు సురేశ్ (యర్రగొండపాలెం-ఎస్సీ)

9. నెల్లూరు

మేకపాటి గౌతమ్ రెడ్డి (ఆత్మకూరు-రెడ్డి)
కాకాణి గోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి-రెడ్డి)
అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ-బీసీ)

10. చిత్తూరు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు-రెడ్డి)
ఆర్.కె.రోజా (నగరి-రెడ్డి)

11. YSR కడప

అంజాద్ బాషా (కడప- ముస్లిం)
కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వేకోడూరు-ఎస్సీ

12. అనంతపురం

అనంత వెంకటరామిరెడ్డి (అనంత అర్బన్-రెడ్డి)
శంకరనారాయణ (పెనుకొండ-బీసీ)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం-బీసీ)

13. కర్నూలు

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (డోన్-రెడ్డి)
శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం-రెడ్డి)

జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి ఎవరో తెలుసా, Who is The Deputy Chief Minister in YS Jagan’s Cabinet ?

0

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసేశాడు. అయితే ఇప్పుడు వీలైనంత త్వరగా మంత్రివర్గ కేబినెట్‌ను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు జగన్. అయితే ఎక్కువ మంది గెలవడం చాలా మంది మంత్రివర్గ స్థానంలో చోటు ఇవ్వమని అడుగుతుండడంతో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనేదానిపై జగన్ కసరత్తు మొదలుపెట్టారు.

అయితే జూన్ 8న మంత్రివర్గాన్ని ప్రకటించి అదే రోజు వారితో అమరావతి సెక్రటేరియట్ గ్రౌండ్స్‌లో ప్రమాణ స్వీకారం చేయించాలని నిశ్చయించుకున్నారట. అయితే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయమని అధికారులను జగన్ ఆదేశించాడట. అయితే ఈ సారి జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి లభిస్తుందనే చర్చలు బాగా వినపడుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు మాత్రం ఇద్దరు డిప్యూటీ సీఎంలకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ కూడా ఇప్పుడు ఇద్దరికి కలిపిస్తారా లేక ఒక్కరితోనే సరిపెడతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే జగన్ ప్రతిపాదించిన పేర్లలో వైసీపీలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు డిప్యూటీ సీఎం అవకాశం ఇచ్చే సూచనలున్నాయని వైసీపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాపు సామాజికవర్గం నేత కావడంతో ఈయనకు డిప్యూటీ సీఎం అవకాశం కలిపిస్తే కాపులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉంటుందని జగన్ అనుకుంటున్నారట. అయితే ఈయన అల్లుడు కిలారి రోశయ్య కూడా పొన్నూర్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు కాపు సామాజికవర్గం నుంచి చినరాజప్పకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే, కాపులకు ఇచ్చిన ఏ హామీలు అమలుకాకపోవడంతో ఈసారి వారంతా పవన్ కళ్యాణ్‌ను కూడా కాదని జగన్ పక్షాన నిలబడ్డారు. అయితే సామజిక వర్గం నుంచి ఉమ్మారెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా కాపులు వైసీపీ వైపే ఉంటారని జగన్ భావిస్తున్నారని వైసీఎ వర్గాలు చెప్పుకుంటున్నాయట.

పొంగులేటికి జగన్ బంపర్ ఆఫర్, Jagan Bumper offer to Ponguleti

0

ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కీలక నిర్ణయాల దిశగా దూకుడు పెంచేశారు. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వ శాఖల వారీ సమీక్షలను చేపట్టిన జగన్, నామినేటెడ్ పదవుల భర్తీపైనా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ఈ పదవుల భర్తీలో ఏపీ నేతల కంటే ముందుగానే తెలంగాణకు చెందిన నేతలకు, అది కూడా టీఆర్ ఎస్ నేతలకు ఆయ తీపి కబురు వినిపించనన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ నేత – ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జగన్ ఏకంగా ఓ బంపరాఫర్ రెడీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా పొంగులేటిని నియమించేందుకు ఇప్పటికే జగన్ నిర్ణయం తీసుకున్నారని ఇక జగన్ నుంచి ఆదేశాలు వెలువడటమే తరువాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున తెలంగాణలోని ఖమ్మం స్థానం నుంచి బరిలోకి దిగిన పొంగులేటి అందరి అంచనాలను తలకందులు చేస్తూ ఎంపీగా విజయం సాధించారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాల్లో ఓ మూడు అసెంబ్లీ సీట్లలో వైసీపీ గెలుపునకు కూడా ఆయన తోడ్పడ్డారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొంగులేటి టీఆర్ ఎస్ లో చేరిపోయారు. వైసీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కారెక్కేశారు. తాజాగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొంగులేటికి టీఆర్ ఎస్ టికెట్టివ్వలేదు.

అయితే ఏపీలో బంపర్ విక్టరీ సాధించిన జగన్, తెలంగాణలో తన పార్టీకి తొలి విజయాన్ని నమోదు చేసి పెట్టిన పొంగులేటికి టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా అవకాశం కల్పించాలని తీర్మానించారట. పూర్తిగా ఏపీకే చెందిన టీటీడీ పాలక మండలిలో అంతా ఏపీకి చెందిన వారే ఉన్నా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక – తమిళనాడుల నుంచి కూడా ప్రాతినిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు కూడా ఓ సీటును కేటాయించారు.

ఇప్పుడు ఈ తెలంగాణ కోటా సీటును పొంగులేటికి ఇవ్వాలని జగన్ తలచినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, టీడీపీ హయాంలో బాధ్యతలు స్వీకరించిన టీటీడీ బోర్డును రద్దు చేసిన బోర్డుకు నూతన పాలకమండలిని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ గా గతంలో పనిచేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి పేరు టీటీడీ చైర్మన్ పదవి రేసులోకి వచ్చారు. తాజాగా ఎంపీ టికెట్ దక్కని జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ఈ రేసులోకి వచ్చేసింది. వీరు ముగ్గురిలో ఎవరికో ఒకరికి చైర్మన్ పదవి దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. తెలంగాణ కోటా సీటు మాత్రం పొంగులేటికే జగన్ ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

జ‌గ‌న్ మొన‌గాడు అని తేల్చిన‌ట్లేనా, మోదీ వ్యాఖ్య‌ల వెనుక ప‌ర‌మార్ధం ఇదేనా, Modi’s Inner Voice Behind Praise for YS Jagan

0
జ‌గ‌న్ మొన‌గాడు అని తేల్చిన‌ట్లేనా..!!
మోదీ వ్యాఖ్య‌ల వెనుక ప‌ర‌మార్ధం ఇదేనా..!!
అవిశ్వాసం త‌రువాత జ‌రిగేదేంటి. జ‌గ‌న్ కు వ‌చ్చిన గుర్తింపు ఏంటి. టిడిపి అధినేత సాధించేందేంటి. ఏపి ప్ర‌జ‌ల దృష్టిలో నే కాదు, ఇప్పుడు ఈ అవిశ్వాసం పై చ‌ర్చకు స‌మాధానం ఇచ్చే  స‌మ‌యంలోప్ర‌ధాని మోదీ చేసిన వ్యాఖ్య‌ల ద్వారా జ‌గ‌న్ ని మొన‌గాడు గా, ప‌రోక్షంగా ప్ర‌ధాని సైతం ఒప్పుకున్నారు. తొలి నుండి జ‌గ‌న్ ఒకే మాట మీద ఉన్నారు. ఏపికి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని చెబుతూనే ఉన్నారు. వైసిపి నేత‌లు చివ‌ర‌కు జ‌గ‌న్ అంగీక‌రించినా లేకున్నా ప్ర‌ధాని మోదీ చెప్పింది నిజం. ఏపిలో వైసిపి ట్రాప్‌లో టిడిపి ప‌డింద‌నేది వాస్త‌వం. జ‌గ‌న్ బాట‌లోనే టిడిపి న‌డిచింది అనేది నిజం.
హోదా కాదు, ప్యాకేజి ఏపికి ప్ర‌యోజ‌నం విజ్ఞత క‌లిగిన నేత‌గా ప్యాకేజికి అంగీక‌రించాను ఏపి ప్ర‌భుత్వంతో పాటుగా ప్ర‌జ‌ల త‌ర‌పున కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నా అంటూ శాస‌న‌స‌భా వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అటువంటి ముఖ్య‌మంత్రి తో ప్యాకేజి కాదు, హోదానే కావాలి అని యూ ట‌ర్న్ తీసుకొచ్చే విధంగా చేసింది జ‌గ‌న్‌. హోదా అంశాన్ని స‌జీవంగా ఉంచుతూ, ప్ర‌జ‌ల్లో హోదా సాధించే నేత‌గా గుర్తింపు పొందారు. టిడిపి స‌ర్వేల్లోనూ ఆదే తేలింది. అంతే కాదు, అవిశ్వాసం పెడితే మొస్తుంద‌న్న నోటితోనే, మేమే అవిశ్వాసం పెడ‌తామ‌ని ముందుకొచ్చేలా చేసారు. జ‌గ‌న్ ట్రాప్ లో టిడిపి చిక్క‌కుంది. ఊహించిందే జ‌రిగింది. ఇక, స‌భ‌లో ప్ర‌ధాని అధికారిక హోదాలో ఏపిలో రాజ‌కీయంగా ఎవ‌రి శ‌క్తి సామ‌ర్ధ్యాలు ఏంటో ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పారు.
వైసిపి ట్రాప్‌లో టిడిపి ప‌డింద‌ని తేల్చేసారు. అక్క‌డి రాజ‌కీయాల కోసం పార్ల‌మెంట్ ను వాడుకుటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌నిలో ప‌నిగా కెసిఆర్ ను ప‌రిణితి చెందిన నేత‌గా ప్ర‌స్తావించి ప‌రోక్షంగా చంద్ర‌బాబు లో ఆ ప‌రిణితి లేద‌నే విధంగా వ్యాఖ్యానించారు. ఇక‌, చంద్ర‌బాబు యూ ట‌ర్న్ తీసుకున్నారంటూ వైసిపి ఏదైతే చెబుతూ వస్తుందో అదే చెప్పేసారు. ఇక‌, స‌భ‌లో జ‌య‌దేవ్ సైతం శాస‌న‌స‌భ‌లో జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగాల‌నే గుర్తు చేసేలా మాట్లాడార‌ని ప్ర‌చారం మొద‌లు కావ‌టం, టిడిపికి అస‌లు మింగుడు ప‌డ‌టం లేదు. ఒక వైపు ప్ర‌ధాని, టిడిపి అధినేత వైఖ‌రిని రెండే రెండు మాట‌ల్లో తేల్చి చెప్పేసారు. వెంట‌నే ఢిల్లీ వెళ్లి త‌మ‌కు స‌హ‌క‌రించిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతామంటూ వెళ్లి కేవలం మీడియా స‌మావేశానికి సొంత పార్టీ ఎంపీల‌తో మీటింగ్ కు ప‌రిమిత‌మ‌య్యారు.
జ‌గ‌న్ ట్రాప్ లో చంద్ర‌బాబు చిక్కుకున్నార‌ని ప్ర‌ధాని గ‌తంలోనే స్వ‌యంగా ముఖ్య‌మంత్రికే చెప్పారు. మీరు తీసుకుంటున్న నిర్ణ‌యం తో వైసిపి బ‌ల‌ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. అది టిడిపి అధినేత‌కు న‌చ్చ‌లేదు. కానీ, ఇప్పుడు దేశం మొత్తం చూస్తండ‌గా న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఉన్న త‌న‌ను జ‌గ‌న్ ట్రాప్ లో ప‌డ్డాన‌ని అంటారా అంటూ సీయం మ‌ధ‌న ప‌డుతున్నారు. జ‌గ‌న్ తో త‌న‌ను పోలుస్తారా అంటూ ఆవేద‌న చెందుతున్నారు. కానీ, మోదీ ప‌రోక్షంగా జ‌గ‌న్ మొన‌గాడు అని తేల్చిన‌ట్లేనా..!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి ఆట‌లు సాగ‌వా ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారా, Modi Will Not Allow Money Politics Anymore

0

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి ఆట‌లు సాగ‌వా. ప్ర‌ధాని మోదీ ఈ మేర‌కు హామీ ఇచ్చారా. వైసిపి నిజంగా బిజెపి ప‌రోక్ష స‌హకారం అందుకుంటుందా. ఏం జ‌రుగుతోంది. ఆంధ్రజ్యోతి కొత్త‌ప‌లుకులో ప్ర‌స్తావించిన ఈ అంశం ఇప్పుడు వైసిపి తో పాటుగా టి డిపిలోనూ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. పార్ల‌మెంట్‌లో అవిశ్వాసం ఎపిసోడ్ పై ప్ర‌ధానంగా కొత్త‌ప‌లుకు టార్గెట్ చేసింది. అందులో మోదీ వైఖ‌రిని తూర్పార‌బ‌డుతూ టిడిపిని ఆకాశానికెత్తేసారు. ప‌నిలో ప‌నిగా రాహుల్‌గాంధీ కిమంచి మ‌ర్కులే వేసారని క‌ద‌నంలో ప్ర‌ముఖంగా పేర్కొన్నారు.

చంద్ర‌బాబు పై చుల‌క‌న భావం ఏర్ప‌డ‌టానికి గ‌వ‌ర్న‌ర్ – ప్ర‌ధానికి ఇచ్చిన బ్రీ ఫింగ్ కార‌ణ‌మ‌ని కొత్త‌ప‌లుకులో తేల్చేసారు. అయితే ఢిల్లీలో మాత్రం చంద్ర‌బాబు వ‌ర్సెస్ కెసిఆర్ గా సాగిన బ్రీఫ్‌డ్ మి కేసు అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌ ఎప్ప‌టి లాగానే బిజెపి- వైసిపి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని న‌మ్మించే విధంగా ఈ సారి కూడా కొత్త ప‌లుకులో శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. బిజెపి నుండి అందుతున్న ప‌రోక్ష స‌హ‌కారం తో వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత అధికారంలోకి రావ‌చ్చ‌ని వైసిపి నేత‌లు భావిస్తున్నార‌ని కొత్త ప‌లుకులో రాపుకొచ‌చారు. అదే వ్యాసంలో ఎన్నిక‌ల‌లో చంద్ర‌బాబు డ‌బ్బు పంచుతార‌ని మీరు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. ఆయ‌న ఆట‌లు సాగ‌కుండా నేను చూస్తా నంటూ ప్ర‌దాని మోదీ వైసిపి నేత‌ల‌కు హామీ ఇచ్చార‌ట, అంటూ కొత్త విష‌యాన్ని తెర మీద‌కు తెచ్చారు. అయితే ఇది ఒక ర‌కంగా వైసిపి కి బిజెపి మ‌ధ్య సంబంధాలు ఉన్నాయ‌ని చెప్ప‌టానికి రాసుకొచ్చే అంశం అయినా, అందులో ఎ న్నిక‌ల్లో డ‌బ్బుల‌తోనే టిడిపి గెలుస్తుంద‌నే భావ‌న ఇప్ప‌టికే ఉండ‌గా తాజా వ్యాఖ్యానాల‌తో మ‌రో సారి చ‌ర్చ‌కు వ‌చ్చింది.

టిడిపి ఎంపీలు లోక్‌స‌భ‌లో చేసిన ప్ర‌సంగాల‌ను అవీ స్పీచ్‌లంటే అంటూ కొత్త ప‌లుకులో టిడిపి ఎంపీల‌ను ప్ర‌శంస ల‌తో ముంచెత్తారు. ఆ ఇద్ద‌రు యువ కిశోరాలంటూ కీర్తించారు. అందులో రామ్మోహ‌న్ నాయుడును యువ కిశోరం అంటే ఆర్దం చేసుకోవ‌చ్చు. కానీ, గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌య‌సు 50 ఏళ్లు పై మాటే. ఆయ‌న్ను కూడా యువ కిశోరం అంటూ కీర్తించ‌టం తో దీని వెనుక అస‌లు ఉద్దేశం ఏంట‌నేది స్ప‌ష్ట‌మ‌వుతంది. ఇక‌, ఇదే జ‌య‌ద‌వ్ ప్యాకేజికి అనుకూలంగా 2017, మార్చి 12న ప్యాకేజి బెట‌ర్ అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను అప్ప‌ట్లోనే జాతీయ దిన ప‌త్రిక‌లు ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించాయి. ఇక‌, జ‌గ‌న్ నాలుగేళ్లుగా చెబుతున్న అంశాల‌నే జ‌య‌దేవ్ లోక్‌స‌భ‌లో ప్ర‌సంగించారు. కానీ, ఇదే అంశం పై జ‌గ‌న్ చెబుతున్న స‌మయం లో ఇదే కొత్త‌ప‌లుకులో ఏనాడు అభినందించ‌లేదు. పైగా కేంద్రం ఇస్తామ‌న్న‌ది తీసుకోవ‌టం వివేకులు చేసే ప‌ని అంటూ సూచ‌న‌లు చేసారు. ఇప్పుడు జ‌గ‌న్ వాద‌నే టిడిపి వినిపిస్తుంటే వారికి భ‌జ‌న చేస్తున్నారు. మొత్తానికి ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌త ఏపికి ఎటువంటి లాభం లేద‌నే విష‌యంలో ఎంత వాస్త‌వం ఉందో చంద్ర‌బాబు యూ ట‌ర్న్ ద్వారా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డార నే విష‌యం ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ ప్రెస్‌మీట్ లోనే అర్ద‌మైంది.

పార్ల‌మెంట్ లో మోదీ, ఏపిలో గెలిచెందెవ‌రు, Modi In Parliament and Who Will Win In Andhra Pradesh 2019 Election ?

0

పార్ల‌మెంట్ లో మోదీ గెలిచారు. మ‌రి ఏపిలో గెలిచెందెవ‌రు. అవిశ్వాసం పేరుతో జ‌రిగిన రాజ‌కీయ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుందెవ‌రు. 2014 నుండి ఏపిలో ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతోంది వైసిపి.  ప్ర‌త్యేక హోదా స్థా నం లో ప్ర‌త్యేక ప్యాకేజి కి రూప‌క‌ల్ప‌న చేసింది బిజెపి ఆహ్వానించింది టిడిపి. ఇక‌, హోదా విష‌యంలో వైసిపి వేసిన వ్యూ హాత్మక ఎత్తుగ‌డ‌లతో 40 ఏళ్ల అనుభ‌వం, వైసిపి ని అనుస‌రించ‌క త‌ప్ప‌లేదు. ప్ర‌త్యేక హోదా పై పూర్తిగా అప్ప‌ర్ హ్యాండ్ సాధించిన వైసిపి ఏ నిర్ణ‌యం తీసుకుంటే టిడిపి ఫాలో అయిపోయింది.

స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ ఇదే విష‌యాన్ని పార్ల మెంట్ సాక్షిగా బ‌హిర్గ‌తం చేసారు. ఈ రోజు కాదు టిడిపి త‌న మంత్రుల‌ను క్యాబినెట్ నుండి విత్ డ్రా చేసుకున్న టైం లో నే ప్ర‌ధాని ముఖ్య‌మంత్రికి ఫోన్ చేసి ఈ హెచ్చ‌రిక చేసారు. మీరు రూటు మారిస్తే ఏపిలో వైసిపి బ‌ల‌ప‌డుతుంద‌ని మోదీ స్ప‌ష్టంగా నాడే చెప్పారు. ఆ త‌రువాత చెప్పిన మాట ప్ర‌కారం వైసిపి ఎంపీలు రాజీనామా చేసారు. ఇంకే ముంది వైసిపి గ్రౌండ్ మ‌న‌కు వ‌దిలేసింది. ఇక‌, పార్ల‌మెంట్ లో అవిశ్వాస నోటీసు తో మ‌రి కొంత మైలేజ్ సాధించ‌వ‌చ్చు స‌భ‌లోని లేని వైసిపిని ఇర‌కాటంలో ప‌డేయ‌చ్చ‌ని టిడిపి భావించింది. ఇక‌, నోటీసు ఇవ్వ‌టం దాని పై చ‌ర్చ జ‌ర‌గ‌టం పూర్త‌యింది. ఇక‌, స‌భ‌లో టిడిపి ఎంపి మాట్లాడిన స్పీచ్ మొత్తం ఏపి అసెంబ్లీలో జ‌గ‌న్ స్పీచ్ అనే విష‌యం రాజ‌కీయంగా ఏ మాత్రం అవ‌గా హ‌న ఉన్న వారికైనా అర్ద‌మ‌వుతుంది. ఇక‌, వైసిపి ట్రాప్‌లో టిడిపి ప‌డింద‌ని మోదీ ఓపెన్‌గా చెప్ప‌టాన్ని టిడిపి అధినేత జీర్ణించుకోలేక‌పోతున్నారు. నేనేంటి 40 ఏళ్ల అనుభ‌వం నేను వైసిపి ట్రాప్‌లో ప‌డ‌టం ఏంటంటూ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, జ‌గ‌న్ సైతం రియాక్ట్ అయ్యారు.

టిడిపితో పాటుగా బిజెపి-మోదీ-కాంగ్రెస్ ను సైతం నిల‌దీసారు. బంద్ కు పిలుపునిచ్చారు. పార్ల‌మెంట్‌లో టిడిపి ఎంపీ జ‌గ‌న్ చెబుతూ వ‌చ్చిన అంశాల‌నే ప్ర‌స్తావించటం. రాజ్‌నాధ్ త‌మ‌కు చంద్ర‌బాబు ఎప్ప‌టికీ మిత్రుడంటూ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధాని మోదీ టిడిపి వైసిపి ట్రాప్ లో ప డిందంటూ చంద్ర‌బాబుకు చేసిన హెచ్చరిక‌ను స్వ‌యంగా  బ‌య‌ట పెట్ట‌టం. ఇలా టిడిపి త‌మ‌కు అనుకూలంగా మారు తుంద‌నుకున్న అవిశ్వాసం చివ‌ర‌కు వైసిపి చేతికి ఆయుధాన్ని అందించిన‌ట్లుగా అయింది. దీంతో డామేజ్ కంట్రోల్ కోసం ఢిల్లీ వెళ్లి మ‌రీ ఇక్క‌డ చెప్పిన విష‌యాల‌నే అక్క‌డా చెప్పారు. ఇప్పుడు తిరిగి వైసిసి చేతికి ఆయుధం చిక్కింది. టిడిపి మ‌రోసారి వైసిపి ఏం చేస్తుంద‌నే ఉత్కంఠ తో ప్ర‌తీ నిమిషం వాచ్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రి వైసిపి ఏం చేస్తుంది. పార్ల‌మెంట్ లో అవిశ్వాసం త‌రువాత ఏపి ప్ర‌జ‌ల్లో ఎవ‌రి ఇమేజ్ పెరిగింది ఎవ‌రి ఇమేజ్ డామేజ్ అయిందో, మీరే మీ అభిప్రాయాల‌ను కామెంట్ల ద్వారా తెలియ‌చేయండి..

వైసిపి చేతికి బ్ర‌హ్మాస్త్రం, వైసిపి చేతికి చిక్కిన రెండు పార్టీలు, TDP and BJP Caught Red Handedly in Parliament on Special Status

0

వైసిపి చేతికి బ్ర‌హ్మాస్త్రం. వైసిపి చేతికి చిక్కిన రెండు పార్టీలు. అవిశ్వాసంతో ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డుతోంది ఎవ‌రు. టిడిపి నా లేక బిజెపినా. అవిశ్వాసం చ‌ర్చ‌లో పాల్గొనే అవ‌కాశం కోల్పోయి న వైసిపికి న‌ష్టం జ‌రుగుతోందా. ఢిల్లీ లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో అమ‌రావ‌తిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు ఏంటి. పార్ల‌మెంట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాసం. స‌భ‌లో వైసిపి లేకుండా తాము ఇచ్చిన నోటీసు అనుమ‌తించ‌టం.

మోదీ ప్ర‌భుత్వం పై అవిశ్వాసం పెట్టిన ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కింద‌నే ఆనందంలో ఉన్న టిడిపిని మ‌రో టెన్ష‌న్ కూడా వెం టాడుతోంది. కొంత కాలంగా బిజెపిని బూచి గా చూపించి ఏపిలో టిడిపి రాజ‌కీయాలు చేస్తోంది . వైసిపి, జ‌న‌సేన పార్టీల‌ను బిజెపి కి మ‌ద్ద‌తుగా పార్టీలుగా ప్ర‌చారం చేస్తోంది. ఇక‌, స‌భ‌లో అవిశ్వాసం చ‌ర్చ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దయ‌టం వ‌ర‌కు ఓకే. కానీ, కేంద్రం ఎటువంటి స‌మాధానాలు చెబుతుంది. ముఖ్యంగా ఏపికి ప్రత్యేక హోదా వ‌ద్దు, ప్యాకేజి ముద్దు అంటూ ఏపి అసెంబ్లీలో ప్ర‌భుత్వం తీర్మానం చేస్తూ కేంద్రానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని స‌మాధానం లో భాగంగా కేంద్రం ప్ర‌స్తావిస్తుంద‌నే స‌మాచారం టిడిపిలో కొంత టెన్ష‌న్ క్రియేట్ చేస్తోంది. అదే స‌మ‌యంలో ఏపి లోని బిజెపి నేత‌లు టిడిపి ప్ర‌భుత్వం పై చేస్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌ను బిజెపి కేంద్ర నాయ‌క‌త్వం పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌స్తా విస్తుందా లేదా అనే చర్చ కూడా మొద‌లైంది. అయితే, బిజెపి నేత‌లు మాత్రం విమ‌ర్శ‌ల‌కు అది స‌మ‌యం కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం పై స‌భ‌లో మాట్లాడిన అంశాల‌కే కేంద్ర ప్ర‌భుత్వ స‌మాధానం ప‌రిమితం అవుతుంద‌ని బిజెపి నేత‌లు స‌మ‌ర్ధిం చుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక‌, స‌భ‌లో అవిశ్వాసం చ‌ర్చ స‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తాం, చూస్తాం అని తప్ప పెద్ద‌గా నిర్దిష్ఠ హామీలు ఇచ్చే ప‌రిస్థితి లేద‌నే అంచ‌నా ఉంది. దీంతో, అవిశ్వాసం ముగిసిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు వైసిపి ఎంపీల రాజీనామాల పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన తాము ఇక రేప‌టి నుండి ఏం చేయాలే ఆందోళ‌న టిడిపి నేత‌ల్లో క‌నిపిస్తోంది.

గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాస నోటీసులు ఇచ్చిన వైసిపి చివ‌ర‌కు చెప్పిన మాట ప్ర‌కారం త‌మ పార్టీకి చెందిన ఎంపీల‌తో రాజీనామా చేయించింది. ఇక‌, ఇప్పుడు లోక్‌స‌భ‌లో చ‌ర్చ  ముగిసిన త‌రువాత టిడిపి నేత‌లు మాత్రం త‌మ మ‌ద్దతు మీడియా మీదేనే ఇక ఆధార ప‌డనున్నారు. ఇక‌, రాజ్య‌స‌భ‌లోనూ ఏపి అంశాల పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఆ స‌మ‌యంలో వైసిపి సైతం త‌మ వాయిస్ వినిపించ‌టానికి సిద్దంగా ఉన్నారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు వైసిపి ఎంపీల‌ను విమ‌ర్శిస్తూ వ‌చ్చిన టిడిపి పై ఇక‌, వైసిపి ఎదురుదాడి చేయటానికి అస్త్రం దొరికింది. బిజెపి నేత‌లు ఏపిలో చేస్తున్న విమ‌ర్శ‌లు కేంద్ర పెద్ద‌లు చేయ‌క‌పోయినా, బిజెపి పై టిడిపి క‌ఠిన వైఖ‌రితో లేక‌పోయినా వైసిపి చేతికి రెండు పార్టీలు చిక్కిన‌ట్లే. మ‌రి వైసిపి త‌మ చేతికి దొరికిన ఈ అస్త్రాల‌ను ఎలా సంధిస్తుంద‌నేదే ఇప్పుడు అస‌లు చ‌ర్చ‌.

జ‌గ‌న్ చెప్పిన ఆ 40 సీట్లు ఎవ‌రివి..!!, YS Jagan Predicts 40 Seats TDP’s Future after 2019 Elections

0
ఆ లెక్క ప‌క్కా జ‌గ‌న్ చెప్పిన ఆ 40 సీట్లు ఎవ‌రివి..!!
ధైర్యంగా ఒంట‌రి పోరుకే వెళ్తాం..!!
పొర‌పాట్లు చేసాను పున‌రావృతం కానివ్వ‌ను..!!
నా లెక్క ప‌క్కా. ధైర్యంగా ఒంట‌రి పోరుకే వెళ్తాం..!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపికి 40 సీట్లు కంటే రావు. రాసి పెట్టుకోండి. వైసిపి అధినేత జ‌గ‌న్ స‌వాల్‌. ఏంటా ధైర్యం. జ‌గ‌న్ ఇంత గ‌ట్టిగా ఎలా చెప్ప‌గ‌లుగుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేసిన త‌ప్పేంటి. జ‌గ‌న్ ఒప్పుకున్న ఆ పొర‌పాట్లు ఏంటి. చంద్ర‌బాబు పై జ‌గ‌న్ ప్ర‌తీకారం ఉండ‌దా. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌కు చ‌ర్య‌లు ఉంటా య‌ని చెబుతూ వ‌చ్చారు. అయితే, తాను అ ధికారంలోకి వ‌స్తే అవినీతి పై చ‌ర్య‌లు ఉంటాయి కానీ, ప్ర‌తీకారం ఉండ‌ద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. ఇక, రాజ‌కీయంగానూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

2014 లో పొరపా టు చేసాను. ఈ సారి ఎన్నిక‌ల్లో మా వ్యూహం మాకుంది. ఎవ‌రితో పొత్తు ఉండ‌దు. వైసిపి అధినేత జ‌గ‌న్ తే ల్చి చెప్పిన విష‌యాలు ఇవి. ఇక ప్ర‌ధాని మోదీని అసెంబ్లీ వేదిక‌గానే ఏకి పారేసాన‌ని గుర్తు చేసారు. 2014లో అనేక ర‌కాలు గా క‌లిసి వ‌చ్చి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యార‌ని జ‌గ‌న్ గుర్తు చేసారు. ఇక‌ ప‌వ‌న్ ను జ‌గ‌న్ వ‌ద‌ల్లేదు. చంద్ర‌బాబు కు నాడు మ‌ద్ద‌తుగా నిలిచి నేడు వ్య‌తిరేకిస్తే స‌రిపోద‌ని ప‌వ‌న్ గురించి కుండ బ‌ద్ద‌లు కొట్టారు. జ‌గ‌న్‌- ప‌వ‌న్ పొత్తు పై ర‌క‌ర‌కాలుగా సాగుతున్న ప్ర‌చారానికి ముగింపు ప‌లికారు వైసి పి అధినేత జ‌గ‌న్‌. ఇక‌, ప్ర‌తీ మ‌నిషి పొర‌పాట్లు చేయ‌టం స‌హ‌జ‌మ‌ని వ్యాఖ్యానించటంతో అస‌లు జ‌గ‌న్ ఏం త‌ప్పు చేసార నే చ‌ర్చ జ‌రుగుతోంది.

గ‌త ఎన్నిక‌ల్లో కొంత మంది అభ్య‌ర్ధుల గెలుపు అవ‌కాశాల పై ఇచ్చిన నివేదిక‌ల‌ను జ‌గ‌న్ న‌మ్మ‌టం, త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారికి వారి గెలుపు అవకాశాల పై అతి విశ్వాసం తో టిక్కెట్లు కేటాయించ‌టం తో న‌ష్టం జ‌రిగింది. అదే స‌మ‌యంలో సామాజిక స‌మీక‌ర‌ణాల ప‌రంగానూ కొన్ని జిల్లాల్లో టిక్కెట్ల కేటాయింపులో బ్యాలెన్స్ త‌ప్పింది. ఇవ‌న్నీ జ‌గ‌న్ నేరుగా ప్ర‌స్తావించ‌క‌పోయినా, 2014 ఫ‌లితాల త‌రువాత జ‌రిగిన పోస్టుమార్టంలో ఈ పొర‌పాట్ల‌ను గుర్తించారు. ఇక‌, ఎప్పుడూ  ఏ మాట జార‌ని జ‌గ‌న్‌ తొలి సారిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి 40 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని తేల్చి చెప్పేసారు. పైగా ఇది రాసిపెట్టుకోండంటూ సూచించారు. నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండే జ‌గ‌న్ ఇంత ధీమాగా చెబుతుండ‌టంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది.

టిడిపి ఏ విధంగా ఓడి పోతుంద‌నే విశ్లేష‌ణ జ‌గ‌న్ చేసారు. ఇప్పుడు ఎవ‌రి స‌హాయం అవ‌స‌రం లేదు ప్ర‌జ‌లు దేవుడిని న‌మ్ముకున్నామ‌ని తేల్చి చెబుతూనే ప‌వ‌న్ ఓట్ షేరింగ్ గురించి వివ‌రించారు. ప‌వ‌న్ ఓటు గ‌తంలో చంద్ర‌బాబుకు ప‌డ్డాయ‌ని, ఇప్పుడు ప‌వ‌న్‌ వైసిపి కి షేర్ అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. వైసిపి కి గ‌తంలో వ‌చ్చిన 45 శాతం తిరిగి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇక‌, టిడిపి 40 సీట్లకే ప‌రిమితం అవుతుంద‌ని చెప్ప‌టంతో ఇప్పుడు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్న ఆ 40 సీట్లు ఎక్క‌డ‌, ఆ అభ్య‌ర్ధులెవ‌రనే అంశం పై అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

గ‌వ‌ర్న‌ర్ తేల్చి చెప్పేసారు…!! ఫిరాయింపు దార్ల‌కు ఇక నో ఛాన్స్..!! – The Governor has Declared That no More Chances for Defectors

0

గ‌వ‌ర్న‌ర్ తేల్చి చెప్పేసారు…!!
ఫిరాయింపు దార్ల‌కు ఇక నో ఛాన్స్..!!

గ‌వ‌ర్న‌ర్ తేల్చి చెప్పేసారా?  ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేసారా?  మ‌రి..ఆ న‌లుగురి మంత్రుల ప‌రిస్థితి ఏంటి? వైసిపి నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి..టిడిపిలోకి ఫిరాయించి..మంత్రి ప‌ద‌వులు పొందిన వారికి ఇప్పుడు కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఒక వైపు రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల, మ‌రో వైపు న్యాయ‌స్థానాల్లో పోరాటాలు, కోర్టుల వ్యాఖ్య‌లు, ఈ న‌డుమ మ‌రో కొత్త అంశం తెర మీద‌కు వ‌చ్చింది.

మొత్తం 22 మందిని వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేల‌ను టిడిపి త‌మ పార్టీలోకి ప్ర‌లోభాల ద్వారా ఫిరాయింపుల‌కు ప్రోత్స‌హించింది. ఇక‌, ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో ముఖ్య‌మంత్రి మ‌రోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు. ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ లో ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాతినిధ్యం లేని ముస్లిం-మైనార్టీ తో పాటుగా ఎస్టీకి అవ‌కాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో..వైసిపి నుండి ఫిరాయించిన ఆ రెండు వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఆశ‌లు పెట్టుకున్నారు. వారు వైసిపి నుండి ఫిరాయించి టిడిపిలోకి వ‌చ్చే స‌మ‌యంలోనూ కొంద‌రికి మంత్రి ప‌ద‌వి పై హామీ ల‌భించింద‌నే వార్త‌లు అప్ప‌ట్లోనే వ‌చ్చాయి. అందులో ఉత్త‌రాంధ్ర కు చెందిన ఒక మ‌హిళా ఎమ్మెల్యే సైతం ఉన్నారు. అయితే, మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో ప్ర‌భుత్వం కోరుకున్న విధంగా చేయ‌టానికి వీలు లేకుండా పోయింది.

గ‌తంలో న‌లుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయించిన గ‌వ‌ర్న‌ర్        ఇక‌..ఇలా ఫిరాయించి వ‌చ్చిన ఇక మంత్రులుగా అవ‌కాశం ఇవ్వ‌టానికి స‌హ‌క‌రించ‌టం లేద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి సైతం పార్టీ నేత‌ల‌తో స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రి ఈ సంకేతాల ద్వారా వైసిపి నేత‌ల‌కు ఇక మంత్రులుగా అవ‌కాశం లేద‌ని..కేవ‌లం సొంత పార్టీ నేత‌ల‌కే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా భావిస్తున్నారు. అయితే, ఆ న‌లుగురు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో వారితో ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేయిస్తామ‌ని కొంద‌రు టి డిపి ముఖ్య నేత‌లు హామీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జరిగింది. అయితే, ఆ వ్య‌వ‌హారం న్యాయ‌స్థానం ప‌రిధిలోకి వెళ్లింది. దీంతో గ‌ర‌వ్న‌ర్ వైఖ‌రి ఇప్పుడు ప్ర‌భుత్వంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేంద్రప్ర‌భుత్వం పై పోరాటం చేస్తున్నామ‌ని చెబు తున్న రాష్ట్రప్ర‌భుత్వానికి..కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా గ‌వ‌ర్న‌ర్ ఎలా స‌హ‌క‌రిస్తార‌నేది మ‌రో ప్ర‌శ్న‌. దీంతో..ఇప్ప‌టి వ‌ర‌కు ఫిరాయింపు మంత్రుల విష‌యంలో స‌హ‌క‌రించిన గ‌వ‌ర్న‌ర్ ఇక‌,,స‌హ‌క‌రించే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేదు. రానున్న రోజు ల్లో ఇది ఎటువైపు ట‌ర్న్ అవుతుందో చూడాలి.