Home Blog Page 18

జ‌గ‌న్ ను ఓడించే స‌త్తా కాంగ్రెస్ కు ఉందా – Congress and TDP Secret Friendship to Counter YS Jagan

0

రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్ ను ఓడించే స‌త్తా కాంగ్రెస్ కు ఉందా. ఆ 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఏం చేస్తోంది. నేరుగా ఓడిం చ‌లేక‌..టిడిపికి స‌హ‌క‌రిస్తోందా. కాంగ్రెస్ ఆలోచ న ఏంటి. జ‌గ‌న్ గెలుపును ఎలాగైనా అడ్డుకొకోవాల‌ని త‌పిస్తున్న కాంగ్రెస్ వ్యూహం ఏంటి. ఏపిలో అధికార పార్టీ పై అసంతృ ప్తి పెరిగి వైసిపికి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని కాంగ్రెస్ గుర్తించింది.

జ‌గ‌న్ ను అధికారం ఖాయ‌మనే అంచ‌నాకు వ‌చ్చింది. అ యితే, జ‌గ‌న్ కు అధికారం ద‌క్క‌టం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వానికి ఇష్టం లేదు. పార్టీ స‌మావేశాల్లోనే ఓపెన్ గానే ఈ విష‌యాన్ని చెబుతూ వ‌స్తోంది. జ‌గ‌న్ బ‌లంగా ఉన్న రాయ‌ల‌సీమ లో 52 నియోజ‌క‌వ‌ర్గాల పై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అక్క‌డ జ‌గ‌న్ అనుకూల ఓటు అడ్డుకోలేమ‌ని గ్ర‌హించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల్చ‌టానికి వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఇప్ప‌టికే 30 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకున్నట్లు స‌మాచారం. ఈ 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకొని ఆర్దికంగా కొంత పేరున్న బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను రంగంలోకి దించాల‌ని కాంగ్రెస్ నేత‌లు ఒక ఫార్ములా సిద్దం చేసిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఎన్నిక‌ల్లోనూ రాయలసీమ లో అనంత‌పురం మిన‌హా మిగిలిన మూడు జిల్లాలు నెల్లూరు లో వైసిపి అధిక్యం సాధించింది. ఇప్పుడు అనంత లోనూ ప‌రిస్థితులు వైసిపికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో రాయ‌ల‌సీమ‌ల లో 30 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల‌ను చీల్చ‌టం తద్వారా వైసిపి గెలిచే స్థానాల‌పై ప్ర‌భావం చూప‌టం ప్ర‌స్తుతం కాంగ్రెస్ ల‌క్ష్య‌మ‌ని ఆ పార్టీ ముఖ్య నేత‌లు స్ప‌ష్టం చేస్తు న్నారు. ఇక‌, కోస్తాంధ్ర జిల్లాల్లో టిడిపి వ్యతిరేక ఓటు జ‌న‌సేన చీల్చుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

రాయ‌ల‌సీమ లో ఓట్ల చీల‌కే ల‌క్ష్యంగా కాంగ్రెస్ ప‌ని చేయ‌నుంది. టిడిపికి ప‌రోక్షంగా స‌హ‌క‌రించట‌మే ఇందులో ప్ర‌ధాన ఉద్దేశం. పిసిసి అధ్య‌క్షు డు ర‌ఘువీరారెడ్డి సైతం కిర‌ణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో రీ ఎంట్రీ స‌మ‌యంలో దాదాపు ఇదే సంకేతాలిచ్చారు. అయితే, కాంగ్రెస్ జ‌గ‌న్ విజ‌యాన్ని అడ్డుకొంటూ టిడిపికి స‌హ‌క‌రించాల‌నే ఉద్దేశంతో వేస్తున్న ఎత్తుగ‌డ‌లు ప్ర‌యత్నాలు జ‌గ‌న్ ను నిలువ‌రించ‌గ‌ల‌వా అనేదే అస‌లు ప్ర‌శ్న‌. పాద‌యాత్ర ద్వారా పూర్తిగా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ వారికి ద‌గ్గ‌ర‌గా ఉన్న జ‌గ‌న్ ను రా జ‌కీయంగా నేరుగా ఎదుర్కోలేక‌ ఇటువంటి తెర చాటు య‌త్నాల‌ను మొద‌లు పెట్టింద‌. మ‌రి జ‌గ‌న్ ల‌క్ష్యంగా సాగుతున్న ఈ  రాజ‌కీయ కుట్ర‌లు ఫ‌లిస్తాయా జ‌గ‌న్ ను దెబ్బ‌తీస్తాయా మ‌రి జ‌గ‌న్ ఎలా ఎదుర్కొంటారు..

క‌త్తి మ‌హేష్ కు వైసిపికి సంబందం ఉందా – Katti Mahesh is Related to YSRCP

0

క‌త్తి మ‌హేష్ కు వైసిపికి సంబందం ఉందా. క‌త్తి మ‌హేష్ వైసిపి లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్నారా. ఇది ఏ మైనా వైసిపి నుండి అధికారికంగా వ‌చ్చిన స‌మ‌చార‌మా. ఎందుకీ దుష్ప్ర‌చారం. క‌త్తి మహేష్ కు తెలుగు మీడియా ఛాన‌ళ్ల లో ఎవ‌రు అంత‌గా ప్రాధాన్య‌త ఇచ్చింది. తెలుగుదేశం మ‌ద్ద‌తుగా నిల‌చే ఛాన‌ళ్ల‌లోనే క‌త్తి మ‌హేష్ కు ఎక్కువ అవ‌కాశం కల్పించారు. ప‌వ‌న్ క‌ళ్యాన్ పై క‌త్తి మ‌హేష్ కామెంట్లు చేయ‌టం వాటి పై స్టూడియోల్లో క‌త్తి మహే్ ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమాను ల‌ను చ‌ర్చ‌కు పిలిచి గంట‌ల‌కు గంట‌లు చ‌ర్చ‌లు సాగ‌దీసారు. రేటింగ్స్ కోసం క‌త్తి మ‌హేప్ ఎపిసోడ్ ను సీరియ‌ల్ ను త‌ల పించేలా న‌డిపించారు.

ప‌వ‌న్ ఫ్యాన్స్ ను వైసిపి పై రెచ్చ గొట్ట‌టం కోసం అప్ప‌ట్లోనే క‌త్తి మ‌హేష్ వైసిపి లో చేరుతున్నార‌ని వైసిపి నుండి పోటీ చేయాలనుకుంటున్నార‌ని సృష్టించారు. దీని పై క‌త్తి మ‌హేష్ సైతం స‌మాధానం చెప్పారు. తాను ఏ పార్టీకి సంబంధం లేని వ్య‌క్తిన‌ని స్ప‌ష్టం చేసారు. ఇక‌, రాముడి గురించి రామాయ‌ణం గురించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ కు గురైన క‌త్తి మ‌హేష్ వైసిపి లో చేరి ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా నుండి పోటీ చేయాల నుకుంటున్నారంటూ మ‌రో సారి వాద‌న‌ను ప‌చ్చ మీడియా తెర మీద‌కు తెచ్చింది. క‌త్తి మ‌హేష్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో కొంద‌రి మ‌నోభావాలు దెబ్బ తిన్నాయి.

ఇటువంటి వ్యాఖ్య‌ల‌తో ఉద్రిక్త‌త‌లు పెరుగ‌తాయ‌నే కార‌ణంతో తెలంగాణ ప్ర‌భు త్వం క‌త్తి మ‌హేష్ తో పాటుగా ప‌రిపూర్ణానంద స్వామి ని న‌గ‌ర బ‌హష్క‌ర‌ణ చేసారు. అదే స‌మ‌యంలో టివి ఛాన‌ళ్ల‌ను సై తం తెలంగాణ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. వివాదాస్ప‌ద చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని సూచించింది. అయితే, తాజాగా ఈ విష‌యాన్ని ఏపి లో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసిపి పై బుర‌ద చ‌ల్ల‌టానికి ఒక వ‌ర్గం ప్ర‌జ‌ల‌పై ప‌రోక్షంగా ప్రభావం ప‌డే విధంగా క‌త్తి మ‌హేష్ వైసిపి నుండి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయ‌నే విష‌యాన్ని ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇందులో వారి ఉద్దేశం ఏంట‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్లినా వివాదాస్ప‌ద‌మే, జ‌గ‌న్ పుష్క‌ర స్నానం చేసినా వివాదాస్ప‌ద‌మే, ఇక‌ ఎక్క‌డ ఏం జ‌రిగినా వైసిపికి లింకులు అంట గ‌డుతూ పార్టీని డామేజ్ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ప‌చ్చ మీడియా శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తోంది. మ‌రి వైసిపి నేత‌లు ఈ దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటే ఇదే ర‌క‌మైన ప్ర‌చారం ఎన్నిక‌ల ముందు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది.

అశోక్‌ బాబుకు అంత సీన్ ఉందా? ఆఫ‌ర్ వెనుక అసలు రాజ‌కీయం? – How Much Capabulity of Ashok Babu? What is The Secret Behaind Offere?

0

అశోక్‌ బాబుకు  అంత సీన్ ఉందా..!!
ఆఫ‌ర్ వెనుక అసలు రాజ‌కీయం….!!

అశోక్‌బాబు లేక‌పోతే టిడిపి గెల‌వ‌లేదా. అశోక్‌బాబుకు ఎందుకు ముఖ్య‌మంత్రి ఇన్ని సార్లు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘ నేత‌కు ముఖ్య‌మంత్రి హోదా ఇంత‌లా అడ‌గాల్సిన అవ‌స‌రం ఉందా. అస‌లు ముఖ్య‌మంత్రి ఆలోచ‌న ఏంటి. ఏపి ఎన్టీఓ సంఘ అధ్య‌క్షుడు అశోక్ బాబు రిటైర్‌మెంట్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. జూన్ రెండున జ‌రిగిన న‌వ నిర్మాణ దీక్ష లో ఆశోక్‌బాబును రాజ‌కీయాల్లోకి రావాల‌ని ముఖ్య‌మంత్రి ఆహ్వానించారు. ఆప్ప‌ట్లోనే దీని పై అనేక విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి. ఇక‌, తాజాగా ఏలూరులో ఏపి ఎన్టీఓ హోం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి మ‌రో సారి అదే అంశం పై మాట్లాడారు. అశోక్‌బాబును టిడిపిలోకి ర‌మ్మ‌ని ఆఫ‌ర్ ఇచ్చాన‌ని..నిర్ణ‌యం మీదేన‌ని సీయం వ్యాఖ్యానించారు. ఇంత లా ఎంతో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న వారి విష‌యంలోనూ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రించ‌లేదు. కానీ అశోక్‌బాబు వ్య‌వ‌హారంలో మా త్రం ఎందుకో వ‌ల్ల‌మానిని అభిమానం చూపిస్తున్నారు. ఉద్యోగ సంఘ నేత‌గా ఉన్న‌ప్ప‌టికీ..అశోక్ బాబు అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అభిప్రాయం ఉద్యోగ సంఘాల్లోనూ వ్య‌క్తం అవుతోంది.

కర్నాట‌క ఎన్నిక‌ల స‌మ‌యం లోనూ అక్క‌డ ప్ర‌చారం కోసం వెళ్లి, అక్క‌డ ఎదురైన వ్య‌తిరేక‌త‌తో తిరిగి వ‌చ్చేసారు. ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం వైసిపి ఎంపీలు దీక్ష చేస్తే..క‌నీసం సంఘీభావం కూడా ప్ర‌క‌టించని అశోక్‌బాబు..టిడిపి యూ ట‌ర్న్ తీసుకోగానే..ప్రభుత్వ పెద్ద‌ల వ‌ద్ద మార్కుల కోసం అన్న‌ట్లుగా మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, తాజాగా, నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప‌దో పీఆర్సీ బకాయిల విష‌యంలో ఎన్నిక‌ల ముందు అన్న‌ట్లుగా న‌వంబ‌ర్ లో క్లియ‌ర్ చేసే విధంగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది . ఆ వెంట‌నే ఆ బకాయిల చెల్లింపు నుండి ఉద్యోగుల వంతుగా రాజ‌ధానికి 200 కోట్లు ఇస్తున్న‌ట్లు అశోక్‌బాబు సొంత నిర్ణ యాన్ని ప్ర‌క‌టించారు. ఇది కూడా అనేక ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు రుచించ‌టం లేదు.

ఇక‌, స్వ‌యంగా అశోక్‌బాబును ముఖ్య‌మంత్రి త‌న పార్టీలోకి ఆహ్వానించిన స‌భ‌లోనే..మ‌రో ఉద్యోగ సంఘ నేత ఆను ఎన్జీవో భ‌వ‌న్ కోసం క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. ముఖ్య‌మంత్రి త‌మ లాంటి వారిని ప‌ట్టించుకోవ‌టం లేద‌ని సీయం స‌మ‌క్షంలోనే విమ‌ర్శించారు. అయితే, అశోక్ బాబు పార్టీలోకి వ‌స్తే.. ఉద్యోగులంతా టిడిపి వైపే ఉంటారనే భ్ర‌మ‌లో ముఖ్య‌మంత్రి ఉన్నారా..లేక త‌మ పార్టీలో ఉద్యోగ సంఘ నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌టం ద్వారా..ఉద్యోగుల‌ను ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అనే చ‌ర్చ సాగుతోంది. అయితే, ఆశోక్‌బాబు పై ఇప్ప‌టికే ఉద్యోగుల్లో అధిక శాతం మంది వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. దీంతో..ముఖ్య‌మంత్రి ఒక ఉద్యోగ సంఘ నేత‌గా అశోక్‌బాబు కు ఇస్తున్న ప్ర‌యార్టీ పై సొంత పార్టీ సీనియ‌ర్ల‌కే అంతు బ‌ట్ట‌టం లేదు.

వైసిపి లో ఎంపీ అభ్య‌ర్ధులు ఖ‌రార‌య్యారా – YSRCP Cheif YS Jagan Finalized MP Candidates List for 2019 Elections

0
వైసిపి లో ఎంపీ అభ్య‌ర్ధులు ఖ‌రార‌య్యారా. అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా అభ్య‌ ర్ధు లెవ‌రో జ‌గ‌న్ డిసైడ్ అయ్యారా. లో క్‌స‌భ‌కు మందుస్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే వార్త‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్ ముంద‌స్తుగానే అభ్య‌ర్ధుల ఎంపిక పై దృష్టి పెట్టారు. దీని కోసం ప్ర‌తీ నియోజక‌వ‌ర్గం లో ఆశావాహుల గురించి స‌ర్వేలు చేయిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ కిషోర్ టీం పార్టీ అభ్యర్ధులు ఎవ‌రిని ఖ‌రారు చేస్తే పార్టీ గెలుస్తుంద‌నే అంశాల పై విభిన్న‌ కోణాల్లో స‌ర్వే చేయించినట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.
లోక్‌స‌భ స్థానాల్లో సామాజిక స‌మీక‌ర‌ణాలు, స్థానిక అంశాలు 2014 ఎన్నిక‌ల్లో పోలింగ్ స‌ర‌ళి ఆశావాహులు ఎవ‌రెవ‌రు పోటీ లో ఉన్నారు, ప్ర‌త్య‌ర్ధి పార్టీ అభ్య‌ర్ధులు బ‌లా బ‌లాల పై ప్రాధ‌మిక స‌మాచారం పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. దాదాపు ఇప్ప‌టికే 13 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలకు సంబంధించిన స‌మాచారం పూర్తి స్థాయిలో సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ సైతం లోక్ స‌భ ఎన్నిక‌లు ముందుగానే జ‌రిగే అవ‌కాశం ఉంని అభ్య‌ర్ధుల‌ను సైతం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌టించి వారికి బాధ్య‌త లు అప్ప‌గించాల‌ని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు పార్టీ ఫిరాయించారు. మిగిలిన అయి దుగురు  ఏపికి ప్ర‌త్యేక హోదా కోసి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసారు. దీంతో తిరిగి టిక్కెట్లు వీరికి ఖాయంగా క‌నిపి స్తోంది. ఇక‌, ఈ సారి ప్ర‌ధానంగా సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు ప‌క్కా ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. అందులో భాగంగానే క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఒక్కో లోక్‌స‌భ స్థానం ఖ‌చ్చితంగా బిసిల‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అదే విధంగా రాజ‌మండ్రి లోక్‌స‌భ సైతం బిసిల‌కు ఇవ్వ‌నున్నారు. ఇక‌, గుంటూరు, ఏలూరు, బాప‌ట్ల‌, మ‌చిలీప‌ట్నం వంటి స్థానాల‌కు ఇప్ప‌టికే స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా ఉన్న నేత‌లు బాధ్య‌త‌లు తీసుకున్నారు.
నంద్యాల లో శిల్పా కుటుంబం నుండి ఎంపీ అభ్య‌ర్ధిగా పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. క‌ర్నూలు బిసి నేత‌కు ఇవ్వ‌నున్నారు. ఇక‌, అర‌కు నుండి గిరిజ న నేత‌గా ప్ర‌స్తుతం అదే సెగ్మెంట్‌లో అసెంబ్లీ బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తున్న ఓ నేత‌కు ఇస్తార‌ని ప్ర‌చారం. శ్రీకాకుళం నుండి ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల మ‌ధ్య పోటీ ఉంది. కాకినాడ స్థానానికి స్థానిక కీల‌క‌మైన టిడిపి నేత వైసిపి లోకి చేరుతార‌ని ఆయ‌న అక్క‌డ నుండి ఎంపీగా పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. కీల‌క‌మైన విశాఖ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి బాధ్య‌త‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే, విశాఖ‌లో అంచనా వేస్తున్న‌ట్లుగా స్థానికంగా పేరున్న ఏ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ జాతీయ పార్టీ నేత‌గా ఉన్న వ్య‌క్తి వైసిపి లో చేర‌టం ఖాయ‌మైతే ఆయ‌న‌కు టిక్కెట్ ఖ‌రార‌య్యే అవ‌కాశం ఉంది. ఇక‌, ఏపి రాజ‌ధాని గా ఉన్న కీల‌క‌మైన విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానాన్ని ఈ సారి గెలిచి టిడిపికి చెక్ పెట్టాల‌ని వైసిపి యోచిస్తోంది. ఇందు కోసం ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఎవ‌రికీ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌లేదు. అయితే, ఓ ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త లేదా ఓ నిర్మాత పేర్లు అక్క‌డ అభ్య‌ర్ధిగా ప్ర‌చారంలో ఉన్నాయి. ఇలా పోటీలో ఉన్న వీరంద‌రి గెలుపు అవ‌కాశాల పై జ‌గ‌న్ లోతుగా స‌ర్వేలు చేయిస్తున్నారు. ఆ త‌రువాత వీరి పేర్ల ఖ‌రారు పై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే, జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ సైతం ఎంపీగా పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ష‌ర్మిళ పోటీకి దిగితే న‌ర్స‌రావు పేట లేదా ఒంగోలు నుండి బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

రామోజీ తో అమిత్ షా ఆక‌స్మిక భేటీ – Shocking Proposal from Amith Shah to Ramoji

0

రామోజీ తో అమిత్ షా ఆక‌స్మిక భేటీ..!!
అస‌లు ల‌క్ష్యం నెర‌వేరేనా..!!

టిడిపి కి మ‌ద్ద‌తు లేకుండా చేయ‌ట‌మే అమిత్ షా ల‌క్ష్య‌మా. అదే జ‌రిగితే టిడిపి ప‌రిస్థితి ఏంట‌. రాజ‌కీయంగా న‌ష్ట పోవా ల్సిందేనా. బిజెపి చీఫ్ అమిత్ షా ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీ రావుతో ఎందుకు భేటీ అయ్యారు. వారిద్ద‌రి మ‌ధ్య ఏ అంశాలు చ ర్చ‌కు వ‌చ్చాయి. ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయం అనుకుంటున్న స‌మ‌యంలో టిడిపి అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచే రామోజీతో అమిత్ షా ప్ర‌త్యేకంగా భేటీ అవ్వ‌టం ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ కు వ‌చ్చిన అమిత్ షా ఎన్డీఏ సారథ్యంలోని బీజేపీ సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తు న్న`సంపర్క్ ఫర్ సమర్థన్` ప్రచార పర్వంలో భాగంగా ఈ భేటీ జరుగుతుంద‌ని బిజెపి నేత‌లు చెబుతున్నారు. అయితే, రాజ‌కీయ వ్యూహాల్లో దిట్ట అయిన అమిత్ షా ఏ వ్యూహం లేకుండా రామోజీ నివాసానికి వెళ్ల‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపి – తెలంగాణ‌ల్లో రెండు ప్ర‌భుత్వాల‌కు ఈనాడు అండ‌గా నిలుస్తుంద‌నే అభిప్రాయం ఉంది. ఈ ప‌రిస్థితుల్లో తెలంగాణ కంటే ఏపిలో తాము ఎంత చేసినా టిడిపి కే ఎక్కువ‌గా ప్ర‌చారం ల‌భిస్తుంద‌నే భావ‌న లో బిజెపి నేత‌లు ఉన్నారు. గ‌తంలో గుజరాత్ లో ఈ టివి గ్రూపు బిజెపి కే మ‌ద్ద‌తుగా నిలిచింది. ఇప్పుడు ఏపి – తెలంగాణ‌ల్లో సైతం బిజెపి అదే ర‌క‌మైన మ‌ద్ద‌తు కోరుకుంటోంది. ముఖ్యంగా ఏపిలో టిడిపికి అండ‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న రామోజీరావు ను త‌మ వైపు తిప్పుకొనేందుకు అమిత్ షా ఈ భేటీ ఎంచుకున్నారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

అమిత్ షా త‌మ‌కు స‌హ‌క‌రించ‌మ‌ని కోరితే చంద్ర‌బాబు ను కాద‌ని బిజెపికి రామోజీ స‌హ‌క‌రించే ప‌రిస్థితులు ఉన్నాయా అనేదే ఇప్పు డు హాట్ టాపిక్‌. టిడిపి కి అండ‌గా నిలిచే ప‌త్రిక‌ల్లో మరకొటి ఆంధ్ర‌జ్యోతి. అయితే, బిజెపి నేత‌లు త‌న మీద దృష్టి సారిం చార‌ని స్వ‌యంగ ఆంధ్ర‌జ్యోతి ఎండీ త‌న కొత్త ప‌లుకులో రాసుకొచ్చారు. ఇక‌, ఈనాడు వ‌ద్ద‌కు ఇప్పుడు స్వ‌యంగా బిజెపి జాతీయాధ్య‌క్షుడి హోదా లో అమిత్ షా వెళ్ల‌టంతో టిడిపి శిబిరంలో ఆందోళ‌న మొద‌లైంది. గ‌తంలో వైసిపి అధినేత జ‌గ న్ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీని క‌లిసిన స‌మ‌యంలో టిడిపి వ‌ర్గాలు టెన్ష‌న్ ప‌డ్డాయి. అయితే, బిజెపికి అనేక సంద ర్భాల్లో మీడియా ప‌రంగా అండ‌గా నిలిచిన ఈనాడు గ్రూపు ఇప్పుడు ఏపి లో మాత్రం అమిత్ షా కోరితే ఆ విధంగా స‌హ‌క రించ‌టానికి సిద్ద‌ప‌డుతుందా అంటే ప్ర‌ధాని మోదీ, అమిత్ షా రాజ‌కీయం తెలిసిన వారెవ‌రైనా స‌హ‌క‌రిస్తార‌నే అభిప్రా యం వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా ఈ భేటీలో వారిద్ద‌రి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం పై అంగీకారం కుదిరితే ఏపిలో టిడిపి కి ప్ర‌ధాన మ‌ద్ద‌తు దారుడు దూర‌మైన‌ట్లే. దూరం కావాల్సిన అవ‌స‌రం లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు త‌మ మీడియా లో చూపించినా టిడిపికి న‌ష్టం త‌ప్ప‌దు. మ‌రి అమిత్ షా లౌక్యం, వ్యూహం, ఏ రకంగా ఉంటుందో ఎంత వ‌ర‌కు ప‌ని చేస్తుందో చూడాలి.

జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త‌కు అస‌లు ప‌రీక్ష‌ – New Drama Started by TDP and BJP Again

0
శ‌ర‌ణు కోరారా..సంధి కుదిరిందా..!!
ఏపి లో బిజెపి కొత్త ఫార్ములా ఇదేనా..!!
జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌త‌కు అస‌లు ప‌రీక్ష‌..!!
అస‌లు క‌ధ మొద‌లైంది..వాట్ నెక్స్ట్‌..!!
ఢిల్లీ వ‌ర్సెస్ అమ‌రావ‌తి ఇది మొన్న‌టి వ‌ర‌కు వినిపించిన మాట‌. టిడిపి వ‌ర్సెస్ బిజెపి ఇది రోజు వినిపించే మాట‌. చంద్ర బాబు అవినీతిని బ‌ట్ట బ‌య‌లు చేస్తాం. సిబిఐ విచార‌ణ‌కు డిమాండ్ చేస్తాం ఇది బిజెపి నేత‌లు హోరెత్తించిన అంశం. మోదీ ప్ర‌భుత్వంలో అవినీతిని నెల రోజుల్లో సాక్ష్యాధారాల‌తో స‌హా బ‌య‌ట పెడ‌తాం ఇది ఏపి ప్ర‌ణాళికా బోర్డు ఉపాధ్య‌క్షు డు కుటుంబ‌రావు హెచ్చ‌రిక‌.
క‌ర్నాట‌క ఎన్నిక‌ల తరువాత ఏపిలో మా త‌డాఖా చూస్తారు ఇది బిజెపి నేత‌లు లీకులు. ఏ మైంది బిజెపి -టిడిపి మ‌ధ్య ఒక‌రి పై ఒక‌రు దూసుకున్న ఆ క‌త్తులు ఏమ‌య్యాయి.  ఒక వైపు బిజెపి తో వైసిపి – జ‌నేస‌న క‌లిసాయ‌ని ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుంటాయ‌ని టిడిపి ప‌దేప‌దే విమ‌ర్శిస్తోంది. తాము మాత్ర‌మే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం బిజెపి తో పోరాడుతున్నామ‌ని చెప్పుకొస్తోంది. కానీ, కొద్ది రోజులుగా బిజెపి ముఖ్యుల పై టిడిపి నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల్లో ప‌స త‌గ్గుతోంది. అదే విధంగా బిజెపి ఢిల్లీ పెద్ద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు నేరుగా టిడిపి పై ఎటువంటి కామెంట్లు చేయ‌టం లేదు. ఏపిలో బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడి పై దాడులు జ‌రుగుతున్న ఢిల్లీ పెద్ద‌లు స్పందించిన దాఖ‌లాలు లేవు. తిరుప‌తిలో ఏకంగా బిజెపి జాతీయాధ్య‌క్షుడి కాన్వాయ్ పై దాడికి ప్ర‌య‌త్నం జ‌రిగినా సీరియ‌స్‌గా తీసుకున్నారా అంటే పైకి సీరియ‌స్ లోప ల మాత్రం క‌నిపించ‌ని ఆ సీరియ‌స్ నెస్.
పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగిదంటూ రాష్ట్ర బిజెపి నేత‌లు విమ‌ర్శిస్తుంటే గ‌డ్క‌రీ లాంటి సీనియ‌ర్ బిజెపి నేత ఏపికి వ‌చ్చి పోల‌వ‌రం ప‌నులు బేష్ అంటూ కితాబిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జ‌రిగి న నీతి అయోగ్ స‌మావేశం త‌రువాత ఈ మార్పులు క‌నిపిస్తున్నాయి. టిడిపి మీద దండ‌యాత్ర త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తూ వ‌చ్చిన బిజెపి నేత‌ల్లో క్ర‌మంగా మార్పు క‌నిపిస్తోంది. తాము ఏపిలో బిజెపి పై ఫైట్ చేస్తున్న‌ట్లుగా క‌ల‌రింగ్ ఇస్తున్న టిడిపి ఢిల్లీ స్థాయిలో కొంద‌రు మాజీ ల‌తో స‌ఖ్య‌త కొన‌సాగిస్తున్న‌ట్లు గుసగుస‌లు వినిపిస్తున్నాయి. ఇవ‌న్నీ గ‌మ‌నించిన వైసిపి అధినేత వెంట‌నే అప్ర‌మ‌త్త‌వ‌య్యారు. రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ కు వైసిపి మ‌ద్ద‌తు ఉండ‌దని తేల్చి చెప్పారు. తాము బిజెపికి మ‌ద్ద‌తు ఇవ్వ‌టం లేద‌ని పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డి స్ప‌ష్ట‌త ఇచ్చేసారు. ఇక‌, టిడిపి -బిజెపి మ‌ధ్య క‌య్యం కంటే త‌ట‌స్థం మేల‌నే అభిప్రాయం ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నారు. దీంతో జ‌గ‌న్ మ‌రింత అప్ర‌మ‌త్తం కావాల్సి న స‌మ‌యం ఏర్ప‌డింది.
టిడిపి – బిజెపి వైఖ‌రి పై అనుమానాలు మొద‌ల‌వుతున్నాయి. ఈ ఉచ్చులో చిక్కుకోకుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యం జ‌గ‌న్ కు ఏర్ప‌డింద‌ని విశ్లేష‌కులు అల‌ర్ట్ చేస్తున్నారు. ఇక‌, స‌మ‌ర‌మే అంటూ ముంద‌కొచ్చిన టిడిపి నేత‌లు ఇప్పుడు శ‌ర‌ణు కోరారో లేక సంధి కోసం రెండు పార్టీల నుండి ప్ర‌య‌త్నాలు జ‌రుగుత్నాయో కానీ ఈ ప‌రిణామాలు జ‌గ‌న్ రాజ‌కీయ చ‌తుర‌త‌కు వ్యూహాల‌కు స‌వాల్ గా మారుతున్నాయి.

వైసిపి తో ట‌చ్‌లోకి టిజి..!! – TG may join YCP?

0

వైసిపి తో ట‌చ్‌లోకి టిజి..!!
జ‌గ‌న్ ఓకె అంటే..ఇక క్యూ నే..!!

రాజ్య‌స‌భ స‌భ్యుడు టిజి వెంక‌టేష్ రూటు మారిందా? ఆయ‌న త‌న త‌న‌యుడితో స‌హా కలిసి పార్టీ మార‌టానికి సిద్దమ‌య్యారా? క‌ర్నూలు టిడిపిలో ఏం జ‌రుగుతోంది? క‌ర్నూలు ఎమ్మెల్యే టిడిపి అభ్య‌ర్ధిగా ఎస్వీ మోహ‌న్ రెడ్డిని మంత్రి లోకేష్ ప్ర‌క‌టిం చ‌టంతో ఒక్క‌సారిగా టిజి వెంక‌టేష్..ఆయ‌న త‌న‌యుడు అసంతృప్తికి గుర‌య్యారు. దీని పై టిజి సీరియ‌స్ వ్యాఖ్య‌లే చేసా రు. లోకేష్‌ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశాడని అనుకుంటున్నానని త‌న లోని ఆగ్ర‌హాన్నిబ‌య‌ట పెడుతున్నారు. దీని పై ఎస్వీ మోహ‌న్ రెడ్డి సైతం ధీటుగానే స్పందిస్తున్నారు.

టిజి వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టిజి వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పు పట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని  టిజి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే త‌న కుమ‌రుడు భ‌ర‌త్ కు క‌ర్నూలు సీటు పై ముఖ్య‌మంత్రిని క‌ల‌వాల‌ని, అక్క‌డి నుండి సానుకూల స్పంద‌న రా క‌పోతే పార్టీ మారేందుకైనా వెనుకాడ‌న‌ని టిజి త‌న స‌న్నిహిత‌లుతో చెబుతున్న‌ట్లు స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో టిజి వెంక‌టేష్ ఇద్ద‌రు వైసిపి నేత‌ల‌తో ట‌చ్ లోకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టిజి ప్ర‌స్తుతం రాజ్య‌సభ స‌భ్యుడిగా ఉండ టంతో, ఆయ‌న పార్టీ మార‌క‌పోయినా, కుమారుడు భ‌ర‌త్ ను వైసిపి లో పంపించేందుకు ఆలోచన చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్నూలు ఎమ్మెల్యే సీటు పై టిజి వ‌ర్గం హామీ కోరుతోంది. అయితే, ష‌ర‌తుల‌తో కాకుండా ముందుగా పార్టీలో చేరాల‌ని.. టిక్కెట్ల కేటాయింపు స‌మ‌యంలో త‌గిన విధంగా నిర్ణ‌యం ఉంటుంద‌ని వైసిపి ప్ర‌తినిధులు చెప్పిన‌ట్ల స‌మాచారం. టిక్కె ట్ల విష‌యంలో వైసిపి అధినేత జ‌గ‌న్ దే తుది నిర్ణ‌య‌మ‌ని…క‌ర్నూలు ఎమ్మెల్యే సీటు ముస్లిం మైనార్టీకి వైసిపి నుండి ఇస్తా ర‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో..వైసిపి నుండి టిజి కుమారుడికి ఎంత వ‌ర‌కు హామీ ల‌భిస్తుంద‌నేది వేచి చూడా ల్సిందే. అయితే, టిజి మాత్రం వైసిపి నుండి హామీ వ‌స్తే పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. టిజి తో పాటుగా మ‌రి కొంత మంది క‌ర్నూలు టిడిపి నేత‌ల సైతం వైసిపి లో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి, క‌ర్నూలు విష‌యంలో జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

జనసేన లోకి మెగా ఎంట్రీ? – Chiranjeevi to Join Janasena Soon?

0

అన్న గ‌మ్యం తమ్ముడితోటేనా? మెగాస్టార్ చిరంజీవి జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా? అందుకు స‌న్నాహ‌కాల‌న్నీ పూర్తి చేస్తున్నారా? జ‌న‌సేన లో వేగంగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే అదే సందేహం క‌లుగుతోంది. జ‌న‌సేన వ‌చ్చే ఎన్ని క‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని చెబుతున్న ప‌వ‌న్ క‌ళ్యాన్‌..ప్ర‌ధానంగా ఇప్పుడు ఉత్త‌రాంధ్ర మీదే దృష్టి పెట్టారు. ఉద్దానం స‌మ‌స్య‌తో పాటుగా గిరిజ‌నుల స‌మ‌స్య మీద‌..విశాఖ న‌గరం పైనా ఎక్క‌కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో త‌న‌కు అండ‌గా నిలిచే ప్ర‌ధాన సామాజిక వ‌ర్గం ద్వారా ఓట్లు ద‌క్కుతాయ‌నేది ఆయ‌న అంచ‌నాగా క‌నిపిస్తోంది.

ఇక‌, ఇదే స‌మ‌యంలో ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌జారాజ్యం లో పోటీ చేసి గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాలు..అప్ప‌టి నేత‌ల‌తో జ‌న‌సేన నేత‌లు ట‌చ్‌లో ఉన్నారు. వారిని తిరిగి జ‌న‌సేన‌లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధా నంగా మెగా కుటుంబానికి పెద్ద సంఖ్య‌లో ఉన్న అభిమానుల‌ను త‌నకు మ‌ద్ద‌తు ఇచ్చేలా ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు ప్రారంభిం చారు. అందులో భాగంగా..మెగా అభిమానుల‌తో ఆత్మీయ స‌ద‌స్సు నిర్వ‌హించారు. వారంతా జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు..ఇస్తున్న నినాదాలు ఇప్పుడు చిరంజీవి చుట్టూ తిరుగుతున్నాయి. చిరంజీవి ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో ఉన్నా..యాక్టివ్ గా లేరు. త‌మ్ముడితోనే అన్న గ‌మ్యం అంటూ జ‌న‌సేన ఇస్తున్న స్లోగ న్‌లు కూడా చిరంజీవి జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇస్తున్నార‌నే సంకేతాలు బ‌ల‌ప‌డుతున్నాయి. ప్ర‌జారాజ్యం ఏర్పాటు ద్వారా అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయి..కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసిన త‌రువాత చాలామంది రాజ‌కీయంగా చిరంజీవికి దూర‌మ‌య్యారు. అయితే, 2014 ఎన్నిక‌ల్లో టిడిపి గెల‌వ‌టం వెనుక మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాన్ పాత్ర ఉంది. ఇక‌, ఇప్పుడు త‌మ్ముడి పార్టీ కోసం చిరంజీవి ప్ర‌త్య‌క్షంగా పార్టీలోకి వ‌స్తారా..లేక‌, ప‌రోక్ష మద్ద‌తు ఇస్తారా అనే చ‌ర్చ హాట్ హాట్‌గా సాగుతోంది. ఒక సారి రాజ‌కీయంగా ఎదురుదెబ్బ తిన్న చిరంజీవి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చ అవ‌కాశం లేద‌నే వాద‌న వినిపిస్తున్నా,  త‌న త‌మ్ముడి కోసం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే చిరంజీవి త‌న‌యుడు సైతం బాబాయ్ కే త‌న మ‌ద్ద‌తు అని గ‌తంలోనే ప్ర‌క‌టించారు. ఇక, శ్రీరెడ్డి ఇష్యూ ద్వారా నాగ‌బాబు పూర్తిగా ప‌వ‌న్ కు అండ‌గా నిలుస్తున్నారు. దీంతో..ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ప‌వ‌న్ కు మ‌ద్ద‌తు గా నిలిచే ప‌రిస్థితులు క‌నిపి స్తున్నాయి.      ఇక‌, చిరంజీవి అధికారిక నిర్ణ‌యం సైతం ఆగ‌స్టులో ఉంటుంద‌ని అంచ‌నా.

వైసిపి లో లోపం – Defect in YCP

0

టిడిపి బ‌లం త‌గ్గింది. వైసిపి బ‌లం పెరిగింది. కానీ, వైసిపి లో లోపం కనిపిస్తోంది. గెలుపు- ఓట‌మి మ‌ధ్య ఆ లోపం కీల‌క భూమిక పోషిస్తుంది. 2014 కంటే ఎక్కువ‌గా ఈ సారి జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని ప‌చ్చ నేత‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్ధులు చేతులు క‌లుపుతున్నారు. అప్ప‌టి కంటే జ‌గ‌న్ ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. జ‌నం సైతం జ‌గ‌న్ ను ఆదరిస్తున్నారు. ఈ సారి గెలుపు ఖాయ‌మ‌నే ధీమా వైసిపి నేత‌ల్లో క‌నిపిస్తోంది. 2014 లో సైతం ఇదే అది విశ్వాసం కొంప ముంచింది. ఈ సారి బ‌హుముఖ పోరు త‌ప్పేలా లేదు. ప‌వ‌న్ క‌ళ్యాన్ ను పూర్తిగా విస్మ‌రించ‌టానికి వీల్లేదు. జ‌గ‌న్ ఏడు నెల‌లుగా నిర్విరామంగా పాద‌యాత్ర చేస్తున్నారు. జ‌గ‌న్ వాయిస్ మాత్ర‌మే అన్న‌ట్లుగా ప్ర‌జ‌ల్లో వైసిపి వాయిస్ గా వెళ్తోంది. మ‌రి, పార్టీ సీనియ‌ర్లు ఏమ‌య్యారు? జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే మేము ఎంజాయ్ చేస్తాం..జ‌గ‌న్ కు మాత్ర‌మే అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్య‌త అన్న‌ట్లుగా పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బిజెపి తో లింకు పెట్టి..ప‌వ‌న్ తో పొత్తులు క‌ట్టి.. వైసిపి ల‌క్ష్యంగా దుష్ప్ర‌చారం జరుగుతోంది. బిజెపి తో సంబంధాల పై జ‌ర‌గుతున్న ప్ర‌చారానికి ధీటుగా వైసిపి నేత‌లు తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం క‌నిపించ‌టం లేదు. ఈ ప్ర‌చారాన్ని విస్మ‌రిస్తే..ఎంతో కొంత శాతం ప్ర‌జ‌లు నిజ‌మ‌నే న‌మ్మే అవ‌కాశం లేక పోలేదు. ప్ర‌త్యేక హోదా పై ఎందుకో ఒక్క పోరాట‌మూ జ‌ర‌గ‌టం లేదు. ఒక్క స‌మావేశం పెట్ట‌టం లేదు. జ‌గ‌న్ పార్టీ ముఖ్య కార్యాల‌యంలో ఉన్న స‌మ‌యంలో స‌మావేశాలు జ‌రిగేవి. ఇప్పుడు ఏ ఒక్క సమావేశ‌మూ లేదు. జ‌గ‌న్ పాద‌యా త్ర లో ఉంటే..మ‌న ప‌ని మ‌న‌దే అన్న‌ట్లు గా పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీ ప్ర‌తిప‌క్ష పార్టీగా మారి దీక్షలు చేస్తోంది. అది ప్ర‌జ‌లు ఎంత వ‌రకు న‌మ్ముతార‌నే విష‌యం ప‌క్క‌న పెడితే..ప్ర‌తిప‌క్షం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల పై ఎక్క‌డ నిల‌దీస్తోంది.

జిల్లా స్థాయిలో మొత్తం 13 జిల్లాల్లో ఏం జ‌రుగుతోంది. అక్క‌డ‌క్క‌డా..అప్పుడ‌ప్పుడూ మీడియా స‌మావేశా లు మిన‌హా..వైసిపి నేత‌లు ఏం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం విభ‌జ‌న హామీల మీద సుప్రీం లో అఫిడ‌విల్ దాఖ‌లు చేస్తే..వైసిపి నుండి వాయిస్ వినిపించే నాయ‌కుడే లేరా. పార్టీలో ఎన్న‌క‌ల ఏడాది లో ఏంటీ నిర్లిప్త‌త‌. జ‌గ‌న్ ఒక్కరిదే బాధ్య‌త అయితే..వీరంతా అధికారం పంచుకునే వారు మాత్ర‌మేనా. సీట్ల కోసం ఆరాటం మిన‌హా..పార్టీ భ‌విష్య‌త్ వీరికి ప‌ట్ట‌దా?  జ‌నంతో ఎందుకు మ‌మేకం కాలేక‌పోతున్నారు. నేత‌లు ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం పార్టీకి న‌ష్టం కాదా. ఇది ఎవ‌రి వైఫ‌ల్యం..నాయ‌కుల‌ను న‌మ్ముకున్న జ‌గ‌న్ దా? ఇవ‌న్నీ తెలిసినా? నేత‌ల‌ను దారిలో పెట్ట‌ని జ‌గ‌న్ దా? మీరే చెప్పండి. పార్టీ కి మీ సూచ‌న‌లు కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి..

ఆ రెండు సీట్లు వైసిపి ఖాతాలోకేనా – Those two seats are in the YCP account

0

ఆ రెండు సీట్లు వైసిపి ఖాతాలోకేనా? క‌ర్నూలు ఎంపీ..క‌ర్నూలు ఎమ్మెల్యే సీట్ల‌ను టిడిపి ఖ‌రారు చేసింది. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్ల దాఖ‌లుకు తుది రోజు ముందు రాత్రి వ‌ర‌కు సీట్లు ఎవ‌రికో టిడిపి ఖ‌రారు చేయ‌దు. అటు వంటి టిడిపిలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి..ముఖ్య‌మంత్రి త‌న‌యుడు మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ స‌డ‌న్ గా అభ్య‌ర్ధును ప్ర‌కటించారు. క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న లోకేష్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపిగా బుబ్టా రేణుక‌..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహ‌న్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. అయితే, ఈ ఎంపిక పార్టీ అధినేత చంద్ర‌బాబుకు తెలిసి జ‌రిగిందా..లేక లోకేష్ అత్యుత్సాహంతో చేసిన ప్ర‌క‌ట‌నా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక‌, అదే వేదిక పై రాజ్య‌స‌భ స‌భ్యుడు టిజి వెంక‌టేష్ సైతం ఉన్నారు. ఆయ‌న త‌న‌యుడు భ‌ర‌త్ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎమ్మె ల్యే టిడిపి త‌న‌దే అని ప్ర‌చారం చేసుకుంటూ సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ఈ ర‌కంగా ప్ర‌కట‌న చేయ‌టంతో ఒక్కసారిగా టిజి వెంక‌టేష్ షాక్ అయి..అక్క‌డి నుండి వెళ్లిపోయారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల్లో వైసిపి నుండి ఇవే నియోజ‌క‌వ‌ర్గాల నుండి పోటీ చేసి గెలిచిన ఈ ఇద్ద‌రు ఇప్పుడు..2019 ఎన్నిక‌ల‌కు టిడిపి అభ్య‌ర్దులుగా ఖ‌రారు చేయటం పై టిడిపి పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఎప్ప‌టి నుండో టిడిపిని న‌మ్ముకొని ఉన్న పార్టీ శ్రేణుల్లో ఒక్క సారిగా అసంతృప్తి మొద‌లైంది. స్థానికంగా పార్టీ శ్రేణుల అభిప్రాయం సేక‌రించ‌కుండా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌టం తో పార్టీలో కొత్త స‌మ‌స్య‌లు ఖాయ‌మ‌నే వాద‌న మొద‌లైంది. ఇక‌, వైసిపి నుండి గెలిచి పార్టీ ఫిరాయించిన వారి పై ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున ఆగ్ర‌హావేశాలు ఉన్నాయి. తాజాగా చేయించిన స‌ర్వేలోనూ ఇదే తేలింది. అటువంటి వారికి టిడిపి టిక్కెట్లు ఖరారు చేయ‌టం తో వైసిపికి మేలు జ‌ర‌గ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక‌, క‌ర్నూలు జిల్లాలో ఒక ఎంపి సీటు బిసి వర్గాల‌కే ఇస్తామ ని..వైసిపి అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లోనే ప్ర‌క‌టించారు. ఇక‌, క‌ర్నూలు సిటీ ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి ఇచ్చే అవ‌కాశం క‌ని పిస్తోంది. తుది ప్ర‌క‌ట‌న చేయక‌పోయినా..ఎన్నిక‌ల నాటికి స‌మీక‌ర‌ణాలు ప‌రిశీలించిన త‌రువాత అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చే యాల‌నేది జ‌గ‌న్ వ్యూహం. ఇప్పుడు లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో టిడిపిలో అసంతృప్తి..వైసిపి లో కొత్త జోష్ క‌నిపిస్తున్నాయి. వైసిపి నుండి ఫిరాయించిన వారిని ప్ర‌జ‌లు ఆద‌రించే ప‌రిస్థితి కనిపించ‌టం లేదు. అయితే, ఈ  ప్ర‌క‌ట‌న పై టిడిపి దిద్దుబాటు చ‌ర్య‌లు చేపట్టినా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు