Home Blog Page 19

దెబ్బ‌కు దెబ్బ‌..!! వైసిపి షాక్ నుండి టిడిపి కోలుకుంటుందా? – How Can TDP Recovery From YCP Shock?

0

బ్బ‌కు దెబ్బ‌..!!
వైసిపి షాక్ నుండి టిడిపి కోలుకుంటుందా…!!

ప్ర‌కాశం జిల్లాలో టిడిపికి భారీ షాక్‌. వైసిపిలోకి టిడిపి సీనియ‌ర్ నేత‌. ప్ర‌కాశం జిల్లాల్లో టిడిపి సీనియ‌ర్ నేత‌గా ఉన్న కరణం బ‌ల‌రాం పార్టీ వీడాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న త‌న కుమారుడితో స‌హా త్వ‌ర‌లోనే వైసిపిలో చేర‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎంతో కాలంగా దీని పై చ‌ర్చ‌లు సాగుతున్న‌ప్ప‌టికీ..ఇప్పుడు నిర్ణ‌యం ఖ‌రారైంద‌ని చెబుతున్నారు. ప్ర‌కాశం జిల్లాలో టిడిపిలో తొలి నుండి క‌ర‌ణం ఉన్నారు. అయితే, 2014 ఎన్నిక‌ల్లో అద్దంకి నుండి వైసిపి ఎమ్మెల్యే గా గెలిచిన గొట్టిపాటి ర‌వి టిడిపి లోకి ఫిరాయించారు. అప్ప‌టి నుండి అక్క‌డ ప‌రిస్థితి గొట్టిపాటి వ‌ర్సెస్ క‌ర‌ణంగా మారింది. ఎప్ప‌టి నుండో ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య అక్క‌డ ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఇక‌, ఇద్ద‌రూ ఒక‌టే పార్టీలో ఉండ‌టం అప్ప‌టి నుండి క‌ష్టంగా మారింది. వాగ్వాదాలే కాదు..ఒక‌రి వ‌ర్గం పై మ‌రొక‌రు దాడులు చేసుకోవ‌టం కూడా జ‌రిగాయి. టిడిపి అధినేత సైతం అద్దంకి బాధ్య‌త‌లు గొట్టిపాటి ర‌వి చూసుకుంటార‌ని తేల్చి చెప్పారు. ఇది..క‌ర‌ణం వ‌ర్గీయుల‌కు న‌చ్చ‌టం లేదు. క‌ర‌ణం బ‌ల‌రాంను శాంత ప‌ర‌చ‌టానికి ఎమ్మెల్సీ ఇచ్చారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ కు అద్దం కి సీటు టిడిపి నుండి ఇస్తామంటే పార్టీలో ఉంటామ‌ని..లేక‌పోతే పార్టీని వీడుతామ‌ని గ‌తంలోనే క‌ర‌ణం బ‌ల‌రాం స్ప‌ష్టం చే సిన‌ట్లు స‌మాచారం. అయితే, అద్దంకి సీటు టిడిపి నుండి గొట్టిపాటి ర‌వికే ఇవ్వాల‌ని టిడిపి డిసైడ్ అవ్వ‌టంతో వారు పార్టీ వీడ‌టం కూడా ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, వైసిపి నుండి క‌ర‌ణం కు ఎటువంటి హామీ ల‌భించింద‌నే దా ని పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఇదే జ‌ల్లా నుండి మ‌రో ఎమ్మెల్సీ సైతం టిడిపిని వీడ‌టానికి సిద్దంగా ఉన్నార‌ని స‌మాచారం. ప్ర‌కాశం జిల్లాలో పార్టీ ప‌రిస్థితి పై ఆ పార్టీ నేత‌ల్లోనూ ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. తాజాగా..పార్టీ నేత‌లు కొంద‌రు టిడిపిని వీడుతున్నార‌నే స‌మాచారం అప్ర‌మ‌త్త‌మైన టిడిపి అధినాయ‌కత్వం వారిని బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది.కానీ, ఇప్పుడు జిల్లాలో ముఖ్య నేత‌లు పార్టీని వీడుతున్నార‌నే ప్ర‌చారం టిడిపిలో టెన్ష‌న్ పుట్టిస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. అధికార పార్టీకి చెందిన నేత‌లు ప్ర‌తిప‌క్ష పార్టీలోకి జంప్ అవుతే ప్ర‌తికూల సంకేతాలు వెళ్తాయ‌నే ఆందోళ‌న అధికార పార్టీ నేతల్లో  వ్య‌క్తం అవుతోంది.  త‌మ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన టిడిపి నేత‌ల‌కు వ‌ణుకు పుట్టించేలా త‌మ అడుగులు ఉంటాయ‌ని వైసిపి నేత‌లు తేల్చి చెబుతున్నారు.

చ‌రిత్ర తిర‌గ‌రాయాల్సిందే..!! – Jagan Repeat the Victory

0

చ‌రిత్ర తిర‌గ‌రాయాల్సిందే..!!
జ‌గ‌న్ వైఖ‌రితో పార్టీలో టెన్ష‌న్‌..టెన్ష‌న్..!!

అభ్య‌ర్ధుల స్థానాల మార్పులోనూ జ‌గ‌న్ మార్క్ నిర్ణ‌యాలు..!!
జ‌గ‌న్ వైఖ‌రితో అశావాహుల్లో కొత్త టెన్ష‌న్‌..!!

వైసిపి అధినేత జ‌గ‌న్ తేల్చి చెప్పేసారు. మోహ‌మాటాలు లేవు. గెలుపే ప్రామాణికం. బంధుత్వాలు..సాన్నిహిత్యాలు కాదు. గెలిచేదెవ‌రు. వారే పార్టీ అభ్య‌ర్ధులు. 2014 ఎన్నిక‌ల్లో చేసిన పొర‌పాట్ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తావు లేకుండా 2019 ఎన్నిక‌ల కోసం వైసిపి అధినేత ప‌క్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు..పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయి.. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఎన్న మొత‌క‌తం 80 మంది కి తిరిగి టిక్కెట్లు ఖాయం గా క‌నిపిస్తోంది. ఈ సారి ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం ఉన్న కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు..నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ ల సీట్లు విష‌యంలో మార్పులు చేర్పులు త‌ప్పేలా లేవు. పార్టీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ చేస్తున్ స‌ర్వేల‌కు అనుగుణంగా ఈ మార్పుల పై తుది క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డిని..స‌త్తెన‌ప‌ల్లి నుండి పోటీ చేయించాల‌ని..దీని కార‌ణంగా..స‌త్తెనప‌ల్లిలో సామాజిక స‌మీక‌ర‌ణాలు క‌లిసి వ‌చ్చి పార్టీ అభ్య‌ర్ధి గెలుస్తారి స‌ర్వే నివేదిక సారాంశం. స‌త్తెన‌ప‌ల్లి నుండి 2014 ఎన్నిక‌ల్లో అంబ‌టి రాంబాబు వైసిపి నుండి పోటీ చేసారు. టిడిపి నుండి పోటీ చేసిన కోడెల శివ ప్ర‌సాద్  స్వల్ప మెజార్టీతో ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందారు. అంబ‌టి రాంబాబుకు స‌మీపంలోని మ‌రో నియోజ‌క‌వ‌ర్గం సూచిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఇక‌, కృష్ణా జిల్లాలో మైల‌వ‌రం బాధ్య‌త‌లు కొత్త‌గా పార్టీలో చేరిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కు అప్ప‌గించి..అక్క‌డ ఇన్‌ఛార్జ్ గా ఉన్న జోగి ర‌మేష్ కు పెడ‌న బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదే విధంగా..అనంత‌పురం ఎంపీగా ప‌ని చేసిన అ నంత వెంక‌ట్రామ‌రెడ్డికి అనంత‌పురం ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల‌ను కేటాయించారు.

ఇక‌, పార్టీ నుండి ఫిరాయించి న వారి నియోజ‌క‌వర్గాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో పార్టీ అభ్య‌ర్ధులే తిరిగి గెల‌వాల‌నే ల‌క్ష్యంతో..ఆ స‌త్తా ఉన్న వారికే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు. పాద‌యాత్ర ద్వారా దాదాపు 125 నియోజ‌క‌వ‌ర్గాలు కవ‌ర్ చేస్తున్న జ‌గ‌న్‌.. పాద‌యా త్ర ముగిసిన వెంట‌నే బ‌స్ యాత్ర ద్వారా మిగిలిన 50 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌ర్య‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం లోక్‌స‌భ అభ్య ర్ధుల ఎంపిక పై స‌ర్వే నివేదిక‌లు తెప్పించుకుంటున్న జ‌గ‌న్‌..ముందుగా లోక్‌స‌భ అభ్య‌ర్ధుల ఖ‌రారు పై దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. ఢిల్లీలో పార్టీ బ‌లం తెలియాలంటే ఎంపి సీట్ల‌ను అధిక సంఖ్య‌లో గెలుచుకోవాల‌నేది జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. దీని కోసం ఏ ఒక్క పొర‌పాటుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. ఏ ఒక్క ఛాన్స్ మిస్ కాకుండా..అన్ని ర‌కాలుగా ప‌క్కా వ్యూ హంతో ముందుకు వెళ్తున్నారు. అనంత‌పురం, గుంటూరు, కృష్ణా, ఉభ‌య గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర పై జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా ఈ వ్యూహాల అమ‌లులో బిజీగా ఉన్నారు. చ‌రిత్ర తిర‌గ‌రాయాల్సిందే..అని జ‌గ‌న్ చాలా కసిగా పార్టీ నేత‌ల‌కు త‌న ఉద్దేశం.. లక్ష్యం ఏంటో చాలా స్ప‌ష్టంగా చెబుతున్నారు. దీంతో..గ‌తంలో లాగా  వైసిపి టిక్కెట్లు ద‌క్కించుకోవ‌టం అంత సులువు కాద నే విష‌యం పార్టీ నేత‌ల‌కు బోధ‌ప‌డుతోంది. ఎక్క‌డ ఏ మార్పు అవ‌స‌య‌మైతే అక్క‌డ ఆ నిర్ణ‌యం తీసుకోవ‌టానికి వెనుకా డ‌వ‌ద్ద‌ని పార్టీ వ్యూహ‌క‌ర్త‌ల‌ను జ‌గ‌న్ స్ప‌ష్టం చేస్తున్నారు.

జగన్ వర్సెస్ రాహుల్ – Rahul Targets YCP Again

0

రాహుల్ వ‌ర్సెస్ జ‌గ‌న్‌..!!
టార్గెట్ వైసిపి ..అంత సీన్ రాహుల్ కు ఉందా..!!

రాహుల్ టార్గెట్ జ‌గ‌న్‌. అయితే ఏంటి? ఏపి రాజ‌కీయాల్లో కాంగ్రెస్ టార్గెట్ వైసిపి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏపి కాంగ్రెస్ నేత‌ల‌కు స్ప‌ష్టం చేసిన విష‌యం ఇదే. టిడిపిని కాదు..వైసిపిని టార్గెట్ చేయండ‌ని దిశా నిర్ధేశం చేసారు. టిడిపి ఏ వాయిస్ అయితే వినిపిస్తుందో అదే వాయిస్ కంటిన్యూ చేయండి. టిడిపి చేస్తున్న విధంగానే…వైసిపి- బిజెపి తో చెలిమి గా ఉందంటూ ముప్పేట దాడి చేయండ‌ని రాహుల్ గాంధీ..ఏపి కాంగ్రెస్ నేత‌ల‌ను ఆదేశించారు. ఇక్క‌డే..మ‌రోసారి టిడిపి -కాంగ్రెస్ ఉమ్మ‌డి ల‌క్ష్యం ఏంటో..ఆ రెండు పార్టీల మ‌ధ్య అవ‌గాహ‌న ఏంటో అర్ద‌మైపోతోంది. ఏ విధంగా అయితే 2014 లో వైసిపికి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ ల‌క్ష్యంగా అంద‌రూ ఒక్క‌ట‌య్యారో..తిరిగి అదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే, అస‌లు..కాంగ్రెస్ కు అంత సీన్ ఉందా. ఏపిలో జ‌గ‌న్ ను టార్గెట్ చేయ‌గ‌ల స‌త్తా ఉందా?ఇవే అస‌లు ప్ర‌శ్న‌లుగా మిగిలిపోతున్నాయి.

ఇక‌, కాంగ్రెస్ పై జ‌గ‌న్ కక్ష్య క‌ట్టార‌ని రాహుల్ ప్ర‌చారం చేయ‌మ‌ని చెబుతున్నారంటూ క‌ధ‌నాలు వ‌చ్చాయి. ఎవ‌రి మీద ఎవ‌రు క‌క్ష్య క‌ట్టారు. వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత తాను న‌ల్ల‌కాల్వ సాక్షిగా ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర‌కు అనుమ‌తి కోరితే నిరాక‌రించింది ఎవ‌రు. తాను ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట కోసం..త‌న తండ్రి కోసం మ‌ర‌ణించిన వారిని ఓదార్చాల్సిన బాధ్య త ఉంద‌ని చెప్పిన జ‌గ‌న్ మీద కేసులు పెట్టించెంద‌వ‌రు. జ‌గ‌న్ అరెస్ట్ త‌రువాత ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను వేధించింది ఎవ‌రు. వైయ‌స్ కుటుంబం పై క‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌దెవ‌రో ఏపిలోని ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిన విష‌మ‌యే. అయితే , రాహుల్ ఎక్క‌డా కూడా టిడిపిని ల‌క్ష్యంగా చేసుకోమ‌ని చెప్ప‌కుండా..కేవ‌లం జ‌గ‌న్ పైనే విమ‌ర్శ‌లు చేయ‌టం..అందునా మ‌న టార్గెట్ వైసిపి ని తేల్చి చెప్ప‌టం ఏపిలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను స్ప‌ష్టం చేస్తోంది. వైయ‌స్ ను – జ‌గ‌న్ ను వేర్వేరుగా చూపిస్తూ..జ‌గ‌న్ ఇమేజ్ ను డామేజ్ చేయట‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ నేత‌ల వ్యూహం క‌నిపిస్తోంది. ఫ‌లితంగా టిడిపికి మేలు చేయ‌ట‌మే అందులోని ప‌ర‌మార్ధం అనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. నిజంగా ఏపిలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ ను ఎదుర్కోవ‌టం కాంగ్రెస్ కు సాధ్య‌మ‌య్యే ప‌నేనా..నేరుగా రాహుల్ రంగంలోకి దిగినా..జ‌గ‌న్ స‌త్తాను అడ్డుక‌నే శ‌క్తి ఉందా..ఏపి ప్ర‌జ‌లు ఎవ‌రి వైపు నిలుస్తారు…రాహుల్ ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారా.. రాహుల్ వ‌ర్సెస్ జ‌గ‌న్ అనే ప‌రిస్థితి వ‌స్తే….ఏపి రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతుంది..

పులివెందుల పులిబిడ్డ ఆ అభిమానం మ‌రెవ‌రికీ ఎందుకు ద‌క్క‌దంటే? – YSR Family Only Gets Affection From Pulivendula People

0
పులివెందుల పులిబిడ్డ
ఆ అభిమానం మ‌రెవ‌రికీ  ఎందుకు ద‌క్క‌దంటే..!!

వైయ‌స్ రాజారెడ్డి. వైయ‌స్ రాజ‌శేఖ‌రెడ్డి. వైయ‌స్ జ‌గన్మోహ‌న్ రెడ్డి. ఈ  ముగ్గురికి ఆ ముగ్గురే సాటి.  వైయ‌స్ ను మ‌రిపించే విధంగా జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో ఉన్నారు. తండ్రి వైయ‌స్ త‌న‌యుడిగా ఆయ‌న కంటే రెండ‌డుగులు ముందుకు వెళ్తాన‌ని జ‌గ‌న్ పదే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు.

ఇక‌, ఆ రియ‌ల్ హీరో గురించి 24 ఫ్రేమ్స్ మీద‌కు వ‌స్తుంటే వారి పాత్ర ధార‌లు ఎవ‌ర‌నే ఆస‌క్తి ఎక్కువ‌గా  క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే యాత్ర సినిమా ద్వారా వైయ‌స్ జీవిత చ‌రిత్ర కోసం షూటింగ్ జ‌రుగుతోంది.   వైయ‌స్ గా త‌మిళ హీరో ముమ్ముట్టి చేస్తున్నారు. ఇక‌, వైయ‌స్ తండ్రి రాజా రెడ్డి పాత్ర ఎవ‌రినే దాని పైనా స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. రాజారెడ్డి పేరు చెబితే రాయ‌ల‌సీమ‌లో తెలియ‌ని వారుండ‌రంటే అతి శ‌యోక్తి కాదు. ఇప్పుడు అటువంటి పాత్ర‌లో విల‌క్ష‌ణ నటుడు జ‌గ‌ప‌తిబాబు న‌టించ‌నున్నారు. త్వ‌ర‌లోనే లుక్ టెస్ట్ చేయ‌నున్నారు. ఇక‌, మిగిలిన పాత్ర‌ల్లో ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారో కొంద‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ష‌ర్మిళ పాత్ర భూమిక చేస్తుంద‌ని చెబుతున్నారు. ఇక‌, మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పాత్ర‌లో సుహాసిని న‌టిస్తున్నారు. ఒక‌, క‌ర్నూలు జిల్లాలో వైయ‌స్ కు ఆత్మీయులుగా ఉన్న ఒక కుటుం బం లోని మహిళ‌..ప్ర‌స్తుత ఎమ్మెల్యే గా ఉన్న ఆ మ‌హిళా నేత పాత్ర‌లో జ‌బర్ద‌స్త్ ఫేమ్ అన‌సూయ న‌టించ‌నున్నారు.

ఇక‌, అస‌లు పాత్ర అయిన జ‌గ‌న్ కోసం నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. జ‌గ‌న్ పాత్రపై అభిమానుల అంచ‌నాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని దానికి త‌గిన‌ట్లుగా పాత్ర‌ధారుడి ఎంపిక చేయాల్సి ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. దీని కోసం హీరో విశాల్ పేరు ప్ర‌ధానంగా ప్ర‌చారంలో ఉంది. ఈ పేరుపై మ‌రో వారంలో క్లారిటీ రానుంది. ఎన్నిక‌ల‌కు ముందు అటు ఎన్టీఆర్‌.. ఇటు వైయ‌స్ బ‌యోపిక్ లు ప్ర‌జ‌ల ముందుకు రానున్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్ప‌టికే కాంట్రావ‌ర్సీ అవుతోంది.  యాత్రకు సంబంధించి నిర్మాణం వేగంగా జ‌రుగుతోంది. ఎన్నిక‌ల వేళ ఈ సినిమాలు ఎటువంటి ప్ర‌భావం చూపుతాయో వేచి చూడాల్సిందే

ఆ ఇద్ద‌రే వైసిపి ప్ర‌తిష్ఠ పెంచాలి..! – That Two Members have Only to increase the YCP precedence.

0

ఆ ఇద్ద‌రే వైసిపి ప్ర‌తిష్ఠ పెంచాలి..!

వైసిపి గౌర‌వం – ప్ర‌తిష్ఠ ఇప్పుడు వారిద్ద‌రి చేతుల్లోనే ఉంది. పార్ల‌మెంట్ స‌మావేశాలు మ‌రి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే వైసిపి లోక్‌స‌భ స‌భ్యులు రాజీనామా చేయ‌టంతో వారు స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం లేదు. ఈ స‌మావేశాల్లో ఏపికి సంబంధించిన పెండింగ్ హామీల అమ‌లు మ‌రో సారి కీల‌కం కానున్నాయి. లోక్‌స‌భ లో వైసిపికి ఇప్పు డు ప్రాతినిధ్యం లేక‌పోవ‌టంతో..రాజ్య‌స‌భ‌లో ఉన్న వైసిపి కి చెందిన ఇద్ద‌రు స‌భ్యులు కీల‌క పాత్ర పోషించాల్సిన బాధ్య‌త ఏర్ప‌డింది. ఇప్ప‌టికే బిజెపి తో వైసిపి పొత్తు కుదుర్చుకుంద‌ని..క‌లిసి రాజ‌కీయాలు చేస్తున్నార‌ని టిడిపి తో పాటుగా మ‌ద్దతు మీడియా ప్ర‌చారం చేస్తోంది. వైసిపి లోక్‌స‌భ స‌భ్యులు ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాలు చేసినా..అవి ఆమోదించినా టిడిపి వాటిని కుమ్మ‌క్కు రాజ‌కీయాలంటూ విమ‌ర్శిస్తోంది. ఇక‌, వైసిపి ఎంపీల త్యాగాల మైలేజ్ త‌మ‌కు డామేజ్ కాకుండా ఎదురుదాడిని ల‌క్ష్యంగా ఎంచుకుంది. ఇదే స‌మ‌యంలో విజ‌య సాయి రెడ్డి ల‌క్ష్యంగా చేసుకొని టిడిపి అనేక విమ‌ర్శ‌లు చేస్తోంది. దీనికి ప్ర‌తిగా విజ‌య సాయిరెడ్డి సైతం టిడిపిని ఇర‌కాటంలో పెడుతూ..ముఖ్య‌మంత్రిని ల‌క్ష్యంగా చేసుకొని అనేక స‌వాళ్లు చేస్తున్నారు. వీటికి టిడిపి నుండి సమాధానం లేదు. ఇక‌, ఈ స‌మావేశాల్లోనే కీల‌క ఘ‌ట్టం ఒక‌టి చోటు చేసుకోబోతోంది. ఎంతో కాలంగా ఏక‌గ్రీవంగా రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక జ‌రుగుతోంది. అయితే, ఈ సారి విపక్షాలు త‌మ అభ్య‌ర్ధిని బ‌రిలో దించాల‌ని భావిస్తున్నాయి. తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన అభ్య‌ర్ధిని రంగంలోకి దించాల ని ఆలోచ చేస్తున్నాయి.

ఈ స‌మ‌యంలో..ఎన్డీఏ కూట‌మికి బిజెడి-వైసిపి-టిఆర్‌య‌స్ మ‌ద్ద‌తు ఇస్తే సునాయాసంగా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే, ఇద్ద‌రు స‌భ్యులు ఉన్న వైసిపి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బిజెపి అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తు ఇస్తే మరింత‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. దీని కంటే..త‌ట‌స్థ వైఖ‌రి తో వ్య‌వ‌హ‌రిస్తే మంచిద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఎన్నిక పై ఇంకా మంత‌నాలు ప్రారంభం కాలేదు. ఈ నెల 7,8 తేదీల్లో అన్ని పార్టీల‌తో జ‌రిగే స‌మావే శాల్లో జ‌మిలి ఎన్నిక‌ల‌తో పాటుగా..రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ఎన్నిక పైనా స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, ఇప్పు డు విజ‌యసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర‌రెడ్డి ఇద్ద‌రు వైసిపి కి మౌత్ పీస్‌లుగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. ఇద్ద‌రిలోనూ ఇప్ప టికే ఢిల్లీలో విస్తృత సంబంధాలు..త‌న వాగ్ధాటితో టిడిపిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేస్తున్న విజ‌య సాయి రెడ్డి పాత్ర ఈ స‌మావే శాల్లో వైసిపి ప‌రువు- ప్ర‌తిష్ఠ కాపాడ‌టంలో కీల‌కం కానుంది

ఆ వార‌సుడు వైసిపికి వ‌స్తే..ఫ్యూజులు పోతాయి – If Harikrishna Will Change TDP to YCP, TDP Lose Prestage

0
ఆ వార‌సుడు వైసిపికి వ‌స్తే..ఫ్యూజులు పోతాయి.
వైసిపి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా..!!
వైసిపి లోకి నంద‌మూరి వార‌సుడు ఎంట్రీ ఇస్తున్నారా. పార్టీలోని అత్యంత ముఖ్యులతో రాయ‌బారాలు జ‌రుగుతున్నాయా . వైసిపిలోకి ఊహాంచ‌ని ఎంట్రీ. ఎంతో కాలంగా టిడిపి అధినాయ‌క‌త్వ తీరు పై మాన‌సికంగా ఆవేద‌న చెందుతున్న నంద‌మూరి వార‌సుడు వైసిపి లోకి రావ‌టం దాదాపు ఖాయంగా క‌నిపిస్తోంది. మాజీ మంత్రి, రాజ్య‌స‌భ మాజీసభ్యు డు నంద‌మూరి హ‌రికృష్ణ ను వైసిపలోకి తీసుకొచ్చి..ఎన్నిక‌ల ముందు టిడిపికి షాక్ ఇచ్చేందుకు వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. 2009 ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ప్ర‌చారం కోసం వాడుకోవ‌టం..ఆ త‌రువాత పూర్తిగా ప‌క్క‌న పెట్టే య‌టంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.
నందమూరి హ‌రికృష్ణ సైతం పార్టీ వ్య‌వ‌హారాల్లో పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌టం లేదు. దీంతో..ఆయ‌న తో సన్నిహితంగా ఉండే వైసిపిలోని ఓ ఎమ్మెల్యే దీని కోసం చొర‌వ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గుతోంది. కృష్ణా జిల్లాలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. దీనిపై నంద‌మూరి వార‌సుల నుండి హర్షం వ్య‌క్తం అయింది. ఈ ప్ర‌క‌ట‌న అధికారంలో ఉ న్నటిడిపి ప్ర‌భుత్వం  ఎందుకు చేయ‌లేద‌ని ప్ర‌శ్న‌లు వినిపించాయి. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న పై అప్ప‌ట్లోనే హ‌రికృష్ణ సైతం సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల ముందు వైసిపి నుండి మరి కొంత మంది నేత‌ల‌ను త‌మ పార్టీ లోకి చేర్చుకొని వైసిపిని దెబ్బ కొట్టాల‌ని టిడిపి ఆలోచ‌న‌ల‌కు కౌంట‌ర్ గా వైసిపి కొత్త ఎత్తుగ‌డ‌ల‌ను సిద్దం చేస్తోంది. అ యితే, హ‌రికృష్ణ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం. హ‌రికృష్ణను ఒప్పించేందుకు ఆ ఎమ్మెల్యేతో పాటు గా ఇద్ద‌రు సీనియ‌ర్లు సైతం త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసే లోగానే దీని పై తుది నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాల‌కే ప‌రిమితం అవుత‌న్న ప‌రిస్థితుల్లో.. టిడిపిని కాద‌ని హ‌రికృష్ణ వైసిపిలో చేరితే మాత్రం టిడిపికి అది కోలుకోలేని దెబ్బ‌గానే మారుతుంది.

అక్క‌డ జ‌గ‌న్ స్కెచ్ అదుర్స్‌..!! – YS Jagan Prepare For Get Maximum Seats in Godavari District

0
అక్క‌డ జ‌గ‌న్ స్కెచ్ అదుర్స్‌.
2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు రివ‌ర్స్.
అదే జ‌రిగితే వైసిపికి అధికారం ఖాయం.
అక్క‌డ జ‌గ‌న్ లెక్క‌లు ప‌క్కా.
ఎక్క‌డ పోగొట్టుకున్నామో అక్క‌డే ద‌క్కించుకోవాలి. అదే ఇప్పుడు వైసిపి అధినేత జ‌గ‌న్ ల‌క్ష్యం. ఇప్పుడు అదే ఫార్ము లా తో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ ప‌క్కాస్కెచ్ అమ‌లు చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసిపికి ఒక్క సీటు ద‌క్క‌లేదు. దీంతో..ఈ సారి అక్క‌డే అధిక సీట్లు గెలుచుకోవాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ అక్క‌డ కొత్త స‌మీక‌రణాల‌కు తెరలేపారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న రావ‌టంతో పాటుగా అక్క‌డ కీల‌క సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ఇత‌ర పార్టీల నేత‌లు వైసిపిలో చేరారు. ఇప్పుడు జ‌గ‌న్ సైతం అక్క‌డ సామాజిక స‌మీక‌రణాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నారు. జిల్లాలో గ‌తంలో జ‌రిగిన గ‌రిగ‌ప‌ర్రు అంశంపై జ‌గ‌న్ ఏ వర్గం మ‌నోభాలు దెబ్బతిన కుండా వ్య‌వ‌హ‌రించి..అంద‌రి మ‌న్న‌న‌ల‌ను అందుకున్నారు.
ఇప్పుడు సైతం ఏ వ‌ర్గం వారు పార్టీకి దూరం కాకుండా అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జిల్లాలో ప్ర‌ధానంగా ఉండే కాపు-క్ష‌త్రిక సామాజిక వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. బిసిల‌క కోసం ఇప్ప‌టికే ఆత్మీయ స‌ద‌స్సులు నిర్వ‌హించి తాను ఏం చేయ‌బోయేదీ వివ‌రించారు. ఇక‌, ఎస్సీ-ఎస్టీ ఓట‌ర్ల‌ను ఆకట్టుకోవ‌టం లో జ‌గ‌న్ స‌క్సెస్ అయిన‌ట్లుగా విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, జిల్లాలో అధికంగా ఉండే కాపు సామాజిక వ‌ర్గం..త‌మ‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల అంశం అమ‌లు కాక‌పోవ‌టం..కేంద్రం కోర్టులోకి బంతి నెట్టేసి..ఎటువంటి ఒత్తిడి తెచ్చే కార్య‌క్ర‌మాలు అక్క‌డ చేయ‌కపోవ‌టం పై అసంతృప్తి తో ఉన్నారు.
ఇక‌, క్ష‌త్రి సామాజిక వ‌ర్గానికి పార్టీలోనూ..ప్ర‌భుత్వంలోనూ ప్ర‌త్యేకంగా గుర్తింపు రాలేద‌ని ఆందోళ‌న వారిలో క‌నిపిస్తోంది. ఒక ఎమ్మెల్యే…ఒక ఎమ్మెల్సీ మిన‌హా క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి క్యాబినెట్ లో అవ‌కాశం క‌ల్పించ లేదు. ఇక‌, టిటిడి బోర్డులోనూ క్ష‌త్రియ వ‌ర్గానికి ఆ జిల్లా నుండి ఎవ‌రికీ అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో..వారు అధికార పార్టీ పై అస‌హ‌నంతో ఉన్న ట్లుగా అర్దం అవుతోంది. వీటిని గ‌మ‌నించిన వైసిపి అధినేత‌..ప్ర‌ధానంగా ఆ రెండు వ‌ర్గాలను ద‌గ్గ‌ర చేస‌కొనేందు కోసం సీట్ల కేటాయింపులోనూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని డిసైడ్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో కాపుల‌ను అధిక సీట్లు కేటా యించిన వైసిపి..ఇప్పుడు సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌లో గోదావ‌రి జిల్లాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. జ‌గ‌న్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా టూర్ ఎఫెక్ట్‌తో ఆక్వాప‌రిశ్ర‌మ‌, కొల్లేరు స‌ర‌స్సు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. దీంతో..గ‌తం లో 2014 ఫ‌లితాలు ఈసారి రివ‌ర్స్ అవుతాయ‌ని వైసిపి నేత‌లు అంచ‌నా వేస్తున్నారు.

ఏపిలో ప్లాటిన‌మ్ ప్లేట్లో జ‌గ‌న్ కు అధికారం..!! – PM Narendra Modi Says to TDP Leader, YS Jagan Become a AP CM

0

ఏపిలో ప్లాటిన‌మ్ ప్లేట్లో జ‌గ‌న్ కు అధికారం..!!
ముఖ్య‌మంత్రికి తేల్చి చెప్పిన ప్ర‌ధాని..!! అస‌లు కార‌ణం ఇదే..!!

ఏపిలో అధికారాన్ని ప్లాటిన‌మ్ ప్లేట్లో పెట్టి జ‌గ‌న్ కు అందించిన‌ట్లే….ఈ మాట అన్న‌ది వైసిపి నేతో..టిడిపి నాయ‌కుడో కాదు . రాజ‌కీయ విశ్లేష‌కులు కాదు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ నుండి బ‌య‌టకు వ‌చ్చిన స‌మ‌యంలో టిడిపి అధినేతతో నేరుగా..స్ప‌ష్టంగా చెప్పిన మాట ఇది. అయితే, ఎన్డీఏతో ఉంటేనే జ‌గ‌న్ కు అవ‌కాశం ఇచ్చిన వాడిన‌వుతాన‌ని చంద్ర‌బాబు బదులిచ్చారు…ఈ విష‌యాన్ని ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ మ‌రోసారి త‌న కొత్త ప‌లుకులో స్ప‌ష్టం చేసారు. 2014 ఎన్నిక‌ల్లో మోదీ-ప‌వ‌న్ స‌హ‌కారం కార‌ణంగానే టిడిపి అధికారంలోకి వ‌చ్చింద‌ని అనేక మంది అప్ప‌ట్లోనే విశ్లేష‌ణ చేసారు.

ఇక‌, మోదీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌టం సాదా సీదాగా చేసిన‌వి గా చూడ‌కూడ‌ద‌నే వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర స్పంద‌న‌..ఏపి లో టిడిపి పాల‌న పైనా కేంద్రనిఘా సంస్థ‌లు..స్వ‌తంత్ర స‌ర్వే సంస్థ‌ల ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ కు కావాల్సిన స‌మాచారం తెప్పించుకుంటున్నారు. వారిచ్చిన నివేదిక‌ల ఆధారంగానే మోదీ..చంద్ర‌బాబును హెచ్చిరిం చార‌నే అభిప్రాయం వినిప‌స్తోంది. అయితే, మొత్తం నెపాల‌ను కేంద్రం పైకి నెట్టేయ‌టం..బిజెపి తో వైసిపికి లింకు అంట క‌ట్ట‌టం ద్వారా రాజ‌కీయంగా ల‌బ్ది పొంద‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు అంచ‌నా వేస్తున్నారు. మోదీతో శ‌త్రుత్వాన్ని పెంచుకోవ‌టం ద్వారా రాజ‌కీయంగా లాభించ‌వ‌చ్చ‌ని..కానీ, .మ‌రోసారి మోదీ ప్ర‌ధానిగా అయ‌తే ప‌రిస్థితి ఏంట‌నే ఆలోచ‌న చంద్ర‌బాబు చేయ‌టం లేద‌నే భావ‌న కొత్త ప‌లుకులో క‌నిపించింది.

మోదీ ఎట్టి ప‌రిస్థితుల్లో తిరిగి అధికారంలోకి రార‌నే భావ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ని రాధాకృష్ణ విశ్లేషించారు. నీతి అయోగ్ సమా వేశంలో ప్ర‌ధాని మోదీ..చంద్ర‌బాబు భుజం పై గ‌ట్టిగ చ‌రిచార‌ట‌..!  మోదీ చ‌ర‌చ‌టం వ‌ల‌న త‌న భుజం పై మంట పుట్టింద ని..దీన్ని బ‌ట్టి మోదీకి త‌న‌పై ఎంత కోపం ఉందో తెలుస్తుంద‌ని చంద్రబాబు పార్టీ నాయ‌కుల వద్ద వ్యాఖ్యానించార‌ని ఆర్కే రాసుకొచ్చారు. ఇక‌, సాధార‌ణ రీతిలోనే ఏపిలో చంద్రాబుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నార‌ని..స‌రైప స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో జ‌గ‌న్ విఫ‌లమ‌వుతున్నార‌ని విశ్లేషించారు. వైసిపి – బిజెపి మ‌ధ్య స్నేహం ఉందంటూ ప‌రోక్షంగా టిడిపి నేత‌ల వాద‌న‌నే త‌న కొత్త ప‌లుకులో చెప్ప‌టానికి ఆర్కే ప్ర‌య‌త్నించారు. దీని కార‌ణంగా రాయ‌ల‌సీమ లో ముస్లింలు వైసిపికి దూర‌మ‌వుతున్నార‌ని.. ఈ న‌ష్టాన్ని కోస్తా-ఉత్తరాంధ్ర‌లో భ‌ర్తీ చేసుకోవాల‌ని బిజెపి నేత‌లు ఇచ్చిన స‌ల హా గా చెబుతున్నారంటూ పేర్కొన్నారు.

ఇది 2012 కాదు…2019..!! మాజీ జెడి..జ‌గ‌న్ తో ఒక పెట్టుకోగ‌ల‌రా? – JD Lakshminarayana get Ready To Face YS Jagan

0

నాడు – నేడు మాజీ జెడి ల‌క్ష్యం అదేనా..!!
ల‌క్ష్మీనారాయ‌ణ చేస్తుందిదీ..మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారు..!!

నాడు జ‌గ‌న్ ను వేధించారు..!!
నేడు జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌తో క‌లిసిపోతున్నారు..!!

సిబిఐ మాజీ జెడికి టిడిపి నేత‌లపై ప్రేమ పెరిగిపోతోంది. ఓపెన్ గానే వారితో ఉన్న సంబంధాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఇప్ప‌డు ఇది పొలిటిక‌ల్ గా హాట్ టాపిక్ గా మారిపోయింది. సిబిఐ మాజీ జెడి ల‌క్ష్మీనారాయ‌ణ క‌డ‌పలో ఉక్క ఫ్యాక్ట‌రీ కోసం దీక్ష చేస్తున్న రాజ్య‌స‌భ స‌భ్యుడు సీయం ర‌మేష్‌ను ప‌రామ‌ర్శించారు. క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ర‌మేష్ దీక్షా స్థ‌లి వ‌ద్ద‌కు వెళ్లి ప‌రామ‌ర్శించారు. అయితే, గ‌తంలో ఏపికి ప్ర‌త్యేక హోదా కోసం దీక్ష చేసిన వైసిపి ఎంపీల‌కు క‌నీసం సంఘీ భావం తెలియ చేయ‌ని మాజీ జెడి లక్ష్మీనారాయ‌ణ ఇప్పుడు ఇంత ఆప్యాయ‌త‌లు కురిపించ‌టం పైభిన్న వాద‌న‌లు విని పిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు జెడి చేసిన జిల్లా ప‌ర్య‌ట‌న‌ల్లో ఎక్క‌వ‌గా టిడిపి సంబంధీకులే అయ‌న‌తో క‌లిసి ఉండ‌టం పై అనేక విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా, సీయం ర‌మేష్ ను ప‌రామ‌ర్శిచిన విష‌యంలో రాజ‌కీయంగానే కాకుండా…నెటిజెన్లు సైతం ల‌క్ష్మీనారాయ‌ణ మీద సెటైర్లు వేస్తున్నారు.  బిపి, సుగర్ పేషంట్ అన్నపానీయాలు మాని పది రోజులు ఉండగల డా…?కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి చెబుతారా ?స్టాఫ్ లేరని మాత్రం చెప్పకండి సార్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. గతంలో చంద్ర‌బాబుపై కేసుల విచార‌ణ పై ప్ర‌శ్నించిన సంద‌ర్భంలో స్టాఫ్ లేరంటూ ల‌క్ష్మీనారాయ‌ణ వ్యాఖ్యానించారు.

ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌క్ష్మీనారాయ‌ణ టిడిపిలో చేరాల‌ని ప్ర‌య‌త్నించినా..అప్ప‌టికే జ‌గ‌న్ కేసులు విచారిస్తున్న అధికారిగా టిడిపిలోకి వ‌స్తే..అది జ‌గ‌న్ కు అనుకూలంగా మారుతుంద‌నే సంశ‌యంతో టిడిపి నేత‌లు కొంత కాలం ఆగాల‌ని సూచించారు. ఇక‌, తాజాగా ఉద్యోగానికి స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఆయ‌న బిజెపి లోకి వెళ్తార‌ని..జ‌న‌సేన లోకి వెళ్తార‌నే వాద‌న‌లు ఉన్నాయి. కానీ, తాను జిల్లాల ప‌ర్య‌ట‌నల త‌రువాత‌నే రాజ‌కీయ ఎంట్రీ పై క్లారిటీ ఇస్తాన‌ని మాజీ జెడి చెబుతున్నారు. ఇక‌, ల‌క్ష్మీనారాయ‌ణ అడుగులు చూస్తుంటే..ఏది చేస్తే రాజ‌కీయంగా టిడిపికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుం అదే విధంగా ముందుకు వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజ‌కీయంగా ల‌క్ష్మీనారాయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా…జ‌గ‌న్ అభిమానులు మాత్రం జెడిగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వహ‌రించిన తీరు ను మాత్రం మ‌రిచిపోవ‌టం లేదు. దీంతో..రాజ‌కీయంగా జ‌గ‌న్ కు ప్ర‌త్య‌ర్ధిగా మారితే ల‌క్ష్మీనారాయ‌ణ అనే క ర‌కాలుగా విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌టం తో పాటుగా సమాధానం చెప్పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.

జ‌గ‌న్ అభిమానులు ఇది తెలుసుకోవాల్సిందే – Secret Behind Jagan Success

0

200 రోజులుగా జ‌గ‌న్ దిన‌చ‌ర్య ఇదే..
జ‌గ‌న్ లోని క‌మిట్ మెంట్‌చూస్తే..దిమ్మ తిర‌గాల్సిందే..!!

తాను న‌మ్మిన వారి కోసం..త‌న‌ను న‌మ్మిన వారి కోసం..!!
జ‌గ‌న్ పాద‌యాత్ర దిన‌చ‌ర్య చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే..

జ‌గ‌న్ అభిమానులు ఇది తెలుసుకోవాల్సిందే..!!
జ‌గ‌న్ పాద‌యాత్ర దిన‌చ‌ర్య చూస్తే ఫ్లాన్ కానివారెవ్వ‌రు..!!

జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య ర‌హ‌స్యం ఏంటి. ఆయ‌న తీసుకొనే ఫుడ్ ఏంటి. ఆరోగ్య ప‌రంగా తీసుకొనే జాగ్ర‌త్త‌లు ఏంటి. పాద యాత్ర‌లో ఆయ‌న రోజువారీ షెడ్యూల్ ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నారు. జ‌గ‌న్ అభిమాని ప్ర‌తీ ఒక్కరికి ఇది తెలుసుకో వాల‌నే ఉత్సుక‌త ఉంది. వారికే కాదు..టిడిపి శ్రేణుల్లోనూ దీని పైనే చ‌ర్చ‌. టిడిపి అధినేత డైట్..యోగా గురించి మ‌ద్ద‌తుగా నిలిచే ప‌త్రిక‌లు ఎంతో ప్ర‌చారం చేసాయి. కానీ, జ‌గ‌న్ 200 రోజులుగా చేస్తున్న పాద‌యాత్ర దాదాపు 2500 కిలో మీట‌ర్ల‌కు చే రింది. ప‌ది జిల్లాల్లో యాత్ర పూర్త‌వుతోంది. పాద‌యాత్ర పూర్తి చేయ‌టం జ‌గ‌న్ వ‌ల‌న సాధ్యం కాద‌ని టిడిపి అనేక విమ‌ర్శ‌లు చేసింది. కానీ, జ‌గ‌న్ మాత్రం త‌న క‌మిట్‌మెంట్ ఏంటో నిరూపిస్తున్నారు. న‌వంబ‌ర్ ఆరున ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మై న పాద‌యాత్ర‌..చలికాలం..ఎండాకాలం పూర్తి చేసుకొని వ‌ర్షాకాలంలోకి అడుగు పెట్టింది.

ఇక‌, జ‌గ‌న్ ఈ రెండు వంద‌ల రో జుల పాద‌యాత్ర‌లో ప్ర‌తీ రోజు డ‌స్ట్ ఎల‌ర్జీకి గుర‌వుతూనే ఉన్నారు. కాళ్ల‌కు బొబ్బ‌ల‌తో బాధ ప‌డుతున్నారు. నడుం నొప్పి ఉంటే బెల్ట్ తో నొప్పిని అనిచివేస్తున్నారు. త‌న శారీర‌కంగా ఎదుర‌వుతు న్న ఇబ్బందుల‌ను పంటి బిగువ‌న బిగ‌ప‌ట్టి..పైకి చిరున‌వ్వుతో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన వారిని స్వ‌చ్చ‌మైన ప్రేమ తో ఆద‌రిస్తున్నారు. జ‌గ‌న్ ప్రేమతో అవ్వ‌ల‌కు ముద్దులు.. చెళ్లెమ్మ‌ల‌కు..మ‌హిళా యువ‌త‌తో సెల్ఫీల‌తో..ఇలా ఎవ‌రినీ డిసప్పాయింట్ చేయ‌టం లేదు. ఎండాక‌లంలో జ‌గ‌న్ వ‌డ‌దె బ్బ‌కు గుర‌య్యారు. కానీ, పాద‌య‌త్ర ఆప‌లేదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాద‌యాత్ర స‌మ‌యంలో 103 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చిం ది. ఒక్క రోజే రెస్ట్ తీసుకున్నారు. మ‌రుస‌టి రోజు 100 డిగ్రీల జ్వ‌రంతోనే పాద‌యాత్ర ప్రారంభించారు. ఎంత జ్వ‌రం వ‌చ్చి నా కేవ‌లం పారాసిటామ‌ల్ టాబ్లెట్ తో యాత్ర సాగిస్తున్నారు. శ‌రీరం ఎంత అలిసినా..ఎన్ని బాధ‌లు అనిపించినా..యాంటీ బ‌యోటిక్స్ జ‌గ‌న్ వాడ‌టం లేదు.

జ‌గ‌న్ ను రెగ్యుల‌ర్ గా ఓ ప‌ర్స‌న‌ల్ డాక్ట‌ర్ ఫాలో అవుతారు. పాద‌యాత్ర కు విరామం ఇవ్వాల్సి ఉంద‌ని సూచించినా ..జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ప్ర‌తీ రోజు న‌డ‌క కార‌ణంగా శ‌రీరం డీహైడ్రేడ్ కాకుండా గ్లూకోజు వాట‌ర్ తీసుకుంటారు. ప్ర‌తీ రోజు దాదాపు 12 కిలో మీట‌ర్లు న‌డ‌క‌..వేలాది మందితో క‌లిసే జ‌గ‌న్..నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు..పార్టీ నేత‌ల‌తో మంత‌నా లు..జిల్లాలో పార్టీ ప‌రిస్థితుల పై సూచ‌న‌లు చేస్తూ..పాద‌యాత్ర సాగిస్తున్నారు. ప్ర‌తీ రోజు ఇవ‌న్నీ పూర్తి చేయ‌టానికి అర్ద రాత్రి వ‌ర‌కు ప‌డుతుంది. కానీ, తిరిగి తెల్ల వారి 4.30 గంట‌ల‌కే నిద్ర లేస్తారు. యోగా..ఏరోబిక్స్‌..ఎక్స‌ర్‌సైజ్ లు చేస్తారు. ఇక‌, ఆహారంలో పూర్తి నియంత్ర‌ణ పాటిస్తున్నారు. నాన్ వెజ్ మానేసారు. ఉద‌యం గ్లాసు జ్యూస్ మాత్ర‌మే తీసుకుంటున్నారు. మ‌ధ్యాహ్నం కొద్దిగా అన్నం..పుల్కాలు..ప‌ప్పు..కూర‌, మ‌జ్జిగ తీసుకుంటారు. రాత్రికి కొద్దిగా అన్నం, రెండు పుల్కా లు, కూర తో లైట్ గానే ముగించేస్తున్నారు. తాను నమ్మిన వారి కోసం..త‌న‌ను న‌మ్ముకున్న వారి కోసం జ‌గ‌న్ ఎప్పుడూ వెనుకాడ‌డు అని చెప్ప‌టానికి 200 రోజులుగా సాగుతున్న ఈ పాద‌యాత్ర లో జ‌గ‌న్ ప్ర‌తీరోజు అనుస‌రించే విధాన‌మే నిద‌ర్శ‌నం. మ‌రి..ఇటువంటి అంకిత‌భావం ఉన్న నేతకు అంత‌గా జ‌నాద‌ర‌ణ ఉండ‌టంలో ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. మ‌రి..జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఆయ‌న దిన‌చ‌ర్య చూసే వారు జ‌గ‌న్ ను అభిమానించ‌క ఉండ‌గ‌ల‌రా.?