Home Blog Page 2

చిరంజీవి బయోపిక్ లో హీరో నేనే!

0

చిరంజీవి బయోపిక్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. మెగాస్టార్ సినీజీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తే బాగుంటుందని హీరో వరుణ్ తేజ్ కూడా అభిప్రాయపడ్డాడు. అక్కడితో ఆగకుండా.. అవకాశం వస్తే చిరంజీవి పాత్ర పోషించడానికి కూడా రెడీ అని ప్రకటించాడు. ఇంతకీ ఆ బయోపిక్ డైరక్టర్ ఎవరో తెలుసా? అక్షరాలా హరీష్ శంకర్.

“చిరంజీవి బయోపిక్ తీస్తానని హరీష్ శంకర్ నాతో అన్నాడు. నాతో మాత్రం తీస్తానని అనలేదు. చిరంజీవిని నేను లవ్ చేసినంతగా ఎవ్వరూ లవ్ చేయలేదు, మెగాస్టార్ బయోపిక్ తీస్తే నేనే తీస్తానంటున్నాడు హరీష్. చిరంజీవిగారి బయోపిక్ చరణ్ అన్న చేస్తేనే బాగుంటుంది. చరణ్ అన్న చేయకపోతే మాత్రం నెక్ట్స్ నేనే.”

ఇలా చిరంజీవి బయోపిక్ మేటర్ ను బయటపెట్టాడు వరుణ్ తేజ్. హరీష్ ఈ బయోపిక్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొస్తాడో తనకు తెలియదని, కానీ ఏదో ఒకరోజు చిరంజీవి బయోపిక్ ను హరీష్ చేస్తాడని అంటున్నాడు వరుణ్. తనకు చిరంజీవి పాత్ర పోషించే అవకాశం వస్తే మాత్రం గ్రాఫిక్స్ లో హైట్ తగ్గించుకుంటానని కూడా చెబుతున్నాడు.

చిరంజీవి బయోపిక్ పై ఇప్పటికే కొంతమంది మెగా కాంపౌండ్ వ్యక్తులు స్పందించారు. మెగాస్టార్ బయోపిక్ కు ఇంకా చాలా టైమ్ ఉందని గతంలో చిరంజీవి, అల్లుఅర్జున్ అభిప్రాయపడగా.. అసలు చిరంజీవి కెరీర్ ను సినిమాగా తీయకుండా ఉంటేనే బెటరని ఆమధ్య నాగబాబు అభిప్రాయపడ్డాడు.

మరోవైపు వరుణ్ తేజ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో కూడా ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో… చిరంజీవి బయోపిక్ ను టచ్ చేయకుండా ఉండడమే బెటర్ అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.

కోడెల కేసులో ఏ1 – ఏ2 – ఏ3 నిందితులు వీళ్లేనా?

0

ఐదు సార్లు ఎమ్మెల్యే ఆయన.. ఎన్టీఆర్ తోపాటు తెలుగుదేశం పార్టీలో నడిచిన రాజకీయ నేత.. అలాంటి ఆయనను చంద్రబాబు ఎటూ కాకుండా చేశాడు. బొమ్మను చేసి ఆడించాడు.. చివరకు కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోయాడు.. అవమానాల భారంతో ఆయన తనువు చాలించాడు. కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఆయన శవంగా మారాక.. అదే డెడ్ బాడీతో శవరాజకీయం చేయడంపై కోడెల సన్నిహిత వర్గాలు రగిలిపోతున్నాయట.. ఈ విషయం ఆ నోటా ఈనోట బయటకు రావడంతో టీడీపీ కోడెలకు చేసిన నమ్మకద్రోహం ఇదేనంటూ ప్రచారం సాగుతోంది.

కోడెల శివప్రసాద్ రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇదే చంద్రబాబు ఆయనను నెత్తిన పెట్టుకున్నాడు. పల్నాటి పులి అంటూ కొనియాడారు. కానీ 2014లో 6వ సారి గెలిచాక మాత్రం ఈయనకు క్లిష్టమైన స్పీకర్ పదవిని అప్పజెప్పాడు. సరే బాబు అండగా ఉంటాడని ఈయన ప్రతిపక్షాన్ని అణిచివేశాడు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాగినా సస్పెండ్ చేయకుండా చంద్రబాబు చేతిలో కోడెల రిమోట్ అయ్యాడన్న అపవాదు ఆయనకు వచ్చింది. చంద్రబాబు కోసం నీతి – నియమాలు అన్నీ పక్కనపెట్టి బలిపశువు అయ్యాడన్న ఆవేదన కోడెల సన్నిహితుల్లో ఉంది. ఇప్పుడు గెలిచిన వైసీపీకి కోడెల టార్గెట్ కావడానికి ఆయన స్పీకర్ గా తీసుకున్న నిర్ణయాలు – నిర్బంధం.. వైసీపీని టార్గెట్ చేయడమేనన్న ఆవేదన ఆయన సన్నిహితులు – క్యాడర్ లో ఉందట.. ఇలా చంద్రబాబు చెప్పినట్టు రాజీనామాలు ఆమోదించకుండా.. వైసీపీపై అసెంబ్లీలో ఉక్కుపాదం మోపడానికి కోడెల పడిన బాధ – ఆవేదన ఒత్తిడి అంతా ఇంతాకాదని ఆయన మనసు ఎరిగిన వారు చెబుతుంటారు.

సరే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పూర్తిగా సహకరించిన కోడెలను అధికారం కోల్పోయాక చంద్రబాబు అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. ఆయన ఫ్యామిలీపై కేట్యాక్స్ కేసులు నమోదై ఇబ్బందులు ఎదురవుతున్నా కోడెలకు సపోర్టుగా ఒక్కరోజు కూడా చంద్రబాబు మాట్లాడింది లేదని ఆయన సన్నిహితులు నొక్కిచెబుతున్నారు. కోడెలకు అండగా నిలిస్తే తనకు ఆ కేసులు చుట్టుకుంటాయని.. ఆయనను చంద్రబాబు దూరం పెట్టారన్న విమర్శలున్నాయి. ఇక కోడెల కుటుంబ నిర్వహిస్తున్న షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్ బయటపడ్డప్పుడు దొంగ అంటూ ముద్ర వేసి కోడెలను మానసిక క్షోభకు గురిచేశారు. ఆ సమయంలోనూ చంద్రబాబు కోడెలకు అండగా నిలిచింది లేదు.. ఆత్మస్థైర్యం ఇచ్చింది లేదు.

చంద్రబాబు కనుక కోడెలకు అండగా నిలిచి ఆయన తరుఫునా పోరాడినా.. మద్దతుగా నిలబడినా ఇప్పుడు కోడెల బతికే ఉండేవాడన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మొన్నటి ప్రభుత్వంలో చంద్రబాబుకు అన్నీవిధాల సహకరించిన కోడెల ఆ తర్వాత ఇన్ని కేసులు అవమానాలు ఎదుర్కొన్నా చంద్రబాబు కనీసం నైతిక మద్దతు ఇవ్వలేదనే విమర్శలున్నాయి. పైగా ఇప్పుడు చనిపోయాక ఆయన శవంతో రాజకీయం చేస్తున్న తీరు చూశాక కోడెల సన్నిహితులు – ఆయన అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందట.. నిజానికి కోడెలపై పెట్టిన కేసుల కంటే చంద్రబాబు వ్యవహరించే తీరే కోడెలను మానసిక క్షోభకు గురిచేసి ఉంటుందన్న వాదన సన్నిహితుల నుంచి వ్యక్తమవుతోంది.

కోడెల ఆత్మహత్యకు పరోక్షంగా ఆయన పుత్రరత్నాలు కూడా కారణం అన్న విమర్శలు ఉన్నాయి. కోడెల స్పీకర్ గా ఉన్నప్పుడు నర్సారావుపేట కేంద్రంగా కేట్యాక్స్ పేరిట ఆయన కుమారుడు శివరాం వసూలు చేసిన డబ్బులు కూడా కోడెల మెడకు చుట్టుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బాధితులంతా బయటకు రావడం.. కోడెల ఫ్యామిలీపై కేసులు పెట్టడం.. కోడెల కుమారుడి కేట్యాక్స్ బాగోతాలు బయటపడడంతో కోడెల తలెత్తుకోలేకపోయాడు.. కొడుకు చేసిన నిర్వాకం వల్ల తండ్రి కోడెల కూడా రాజకీయంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నది కాదనలేని సత్యం..

ఇక ముచ్చటగా కోడెల చావుకు ఆయన కూతురు కూడా ఓ కారణమని ప్రచారం జరుగుతోంది. కేట్యాక్స్ దందాలో కూతురుపై కూడా కొన్ని చోట్ల ఆరోపణలు వచ్చాయి. ఇక బైక్ షోరూంల బిజినెస్ లో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కోడెల కూతురు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్నాయి. ఇక ఏకంగా అసెంబ్లీ ఫర్నిచర్ ను తన షోరూంలో వాడుకోవడం దుమారం రేపింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఫర్నీచర్ వివాదంలో కోడెల దొంగగా అభాసుపాలు కావడానికి ఆయన కూతురు కూడా ఒక కారణం అన్న విమర్శలున్నాయి.

చంద్రబాబు – కోడెల కుమారుడు – కూతురుయే ఆయన ఆత్మహత్యకు పరోక్ష కారణమన్న ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో కోడెల ఆత్మహత్యపై గనుక కేసులు నమోదు చేస్తే చంద్రబాబు ఏ1 గా – కోడెల కుమారుడు శివరాం ఏ2గా – కూతురు ఏ3గా ఉంటారని కోడెల సన్నిహితులు అక్కసు వె

ఆస్పత్రుల్లో సంస్కరణలు… డాక్టర్లకు హైబీపీ తెప్పిస్తున్న జగన్?

0

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలని, వారి బేసిక్‌ శాలరీని పెంచాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య రంగంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన నిపుణుల కమిటీ కీలక సూచనలు చేసింది. సుమారు 100 సూచనలు చేసింది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించాలని ప్రధానంగా సూచించింది. అదే సమయంలో వారికి వేతనాలు కూడా భారీగా పెంచాలని ప్రతిపాదించింది. దీనికి వెంటనే అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వేతనాల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదికారులను ఆదేశించారు. కమిటీ ఇచ్చి సిఫారసులపై సీఎం జగన్ విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. ఆ సేవలు నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం కానుంది.

ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు : జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేయనున్నారు. 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకురానున్నారు. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం కూడా ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

ప్రభుత్వానికి నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని :

మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి

 • ప్రతి 5వేలమందికి ఒక సబ్‌ సెంటర్‌ ఉండాలి
 • ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి
 • ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి
 • చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి
 • రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు. వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి
 • యూత్‌ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి
 • సబ్‌సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది
 • ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి
 • ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి
 • ఒక కౌన్సెలర్‌ లేదా సోషల్‌ వర్కర్‌ ఉండాలి
 • దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి
 • ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి
 • 2 బెడ్‌ ఐసీయూ సదుపాయం ఉండాలి

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

0

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష టిడిపి ఎమ్మెల్యేలకు హైకోర్టు వరుసగా నోటీసులు జారీ చేస్తూ ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితమే ఓ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు జారీ చేయగా మంగళవారం ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు – విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ – రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బలరాంతో పాటు తాజాగా నోటీసులు జారీ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్ లో తమకు సంబంధించిన పూర్తి వివరాలు పొందరుపరచలేదన్న పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. బలరాం తన రెండో భార్య అయిన కాట్రగడ్డ ప్రసూన వివరాలు ఇవ్వలేదని… ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజా విషయానికి వస్తే మాజీ మంత్రి గంటాపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కెకె.రాజు – రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ పై పోటీ చేసి ఓడిన మంత్రి మోపిదేవి వెంకటరమణ – విజయవాడ తూర్పులో గద్దెపై పోటీ చేసి ఓడిన వైసీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరపున ఎన్నికల ఏజెంట్ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషన్ల తరపున వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి – జస్టిస్ జి.శ్యాంప్రసాద్ – జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. ఇక ఈ ముగ్గురి విషయంలో పిటిషనర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు నిబంధనలకు అనుగుణంగా అఫిడవిట్లో వివరాలు ఇవ్వాలని… వీరు అలా చేయలేదని తమ పిటిషన్లో ఆరోపించారు.

TTD : టీటీడీ పాలక మండలి ఖరారు… సభ్యుల జాబితా ఇదే

0

TTD Executive board : ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సీఎం వైఎస్ జగన్… టీటీడీ పాలకమండలి జాబితాను ఖరారు చేశారు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకమండలికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన వైఎస్ జగన్… ఎక్స్ అఫీషియోతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ పాలకమండలి ఏర్పాటు అవుతోంది. గత ప్రభుత్వంలో 18 మందితో పాలకమండలి ఉండేది. ఇప్పుడు సంఖ్య పెంచి 28 మందికి అవకాశం కల్పించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచీ 8 మందికీ, తెలంగాణ నుంచీ ఏడుగురికీ అవకాశం ఇచ్చారు. అలాగే… తమిళనాడు నుంచీ 4గురు, కర్ణాటక నుంచీ ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచీ ఒక్కొక్కరికి సభ్యత్వం కల్పించారు. అలాగే టీటీడీ పాలకమండలిలో పలువురు ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారు. మహిళా కోటాలో కూడా కొందరికి అవకాశం కల్పించడం విశేషం.

టీటీడీ పాలక మండలి సభ్యుల జాబితా : 

ఆంధ్రప్రదేశ్ –
1.వి.ప్రశాంతి
2.యువి రమణ మూర్తి (MLA)
3.మల్లికార్జున రెడ్డి (MLA)
4.గొల్ల బాబూరావు (MLA)
5.నాదెండ్ల సుబ్బారావు
6.డిపి అనంత
7.చిప్పగిరి ప్రసాద్ కుమార్
8.కె.పార్థసారథి (MLA)

తెలంగాణ –
1.జె.రామేశ్వరరావు
2.బి.పార్థసారథి రెడ్డి
3.యు.వెంకట భాస్కర రావు
4.మూరంశెట్టి రాములు
5.డి.దామోదర్ రావు
6.కె.శివ కుమార్
7.పుట్టా ప్రతాప రెడ్డి

తమిళనాడు –
1.కృష్ణమూర్తి వైద్యనాథన్
2.ఎస్.శ్రీనివాసన్
3.డాక్టర్ నిచితా ముత్తువరపు
4.కుమారగురు (MLA)

కర్ణాటక –
1.రమేష్ శెట్టి
2.సంపత్ రవి నారాయణ
3.సుధా నారాయణ మూర్తి

ఢిల్లీ –
1.ఎం ఎస్ శివ శంకరన్

మహారాష్ట్ర –
1.రాజేష్ శర్మ

ఎక్స్ అఫీషియో –
1.చైర్మన్ (TUDA)
2.SPL CS
3.కమిషనర్ ఎండోమెంట్స్
4.E.O. (TTD)

పల్నాటి పులిని పిల్లిని చేసిందెవరు…!?

0

కోడెల శివప్రసాద్ రూపం ఎంత గంభీరమో మనిషి కూడా అంతే గంభీరం. ఆయన మంత్రిగా ఉన్నపుడు కూడా పెద్దగా మాట్లాడిన సంఘటలు లేవు. తక్కువ మాటలు, ఎక్కువ చేతలు ఇదే ఆయన విధానంగా చెబుతారు. కోడెలకు డాక్టర్ గా ఎంతో పేరుంది. సర్జన్ గా ఆయన హస్తవాసి మంచిది అంటారు. అటువంటి కోడెల రాజకీయాల్లోకి రావడంతో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన రాజకీయమంతా వివాదాలతోనే సాగిందని చెప్పాలి.

ఆయన హోం మంత్రిగా ఉన్నపుడే వంగవీటి రంగా మర్డర్ జరిగింది. దానికి ఓ వర్గం ప్లాన్ చేస్తే రంగా మర్డర్ జరిగిందని అంటారు. ఇక ఆ సామాజికవర్గానికే చెందిన హోం మంత్రిగా ఉండడంతో అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. కోడెల నాటి ఘటనలకు బాధ్యత వహించి హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. శ్రీకాకుళానికి చెందిన కిమిడి కళా వెంకటరావు హోం మంత్రి అయ్యారు. మరో సందర్భంలో కోడెల ఇంట్లో బాంబులు పేలాయని ప్రచారం జరిగింది. కోడెల వర్గ రాజకీయాలను ప్రోత్సహించారని కూడా బాగా వివాదాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో కూడా కోడెల ఎక్కడా చలించకుండా అడుగులు ముందుకు వేశారు. ప్రతీసారి వివాదాలు ఆయన్ని ముందుకే సాగేలా చేశాయి తప్ప ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

ఇక కోడెల స్పీకర్ గా ఉన్నపుడు కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరిక సందర్భంగా సరిగ్గా వ్యవహరించలేదని విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి నాడు కూడా కోడెల ధైర్యంగానే తనపైన వచ్చిన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతెందుకు కోడెల తాజా ఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ వద్ద పడిపోయిన ఘటనలో కూడా వెంటనే సర్దుకుని తనదైన రాజకీయం చూపించారు తప్ప అధైర్యపడలేదు. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత నాలుగు నెలలైంది. కోడెల మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే కేసులు మాత్రం ఆయన కుమారుడి మీదనే ఉన్నాయి.

ఇంతలా జరిగినా కూడా కోడెల ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. ఎందుకంటే కోడెలకు ప్రతీ సందర్భంలోనూ పార్టీ అండగా ఉండేది. కానీ గత నాలుగు నెలల పరిణామాలు చూసుకుంటే మాత్రం పార్టీ ఆయన్ని పక్కన పెట్టిందనే చెప్పాలి. కోడెల ఆ మధ్యన ఆసుపత్రి పాలు అయితే టీడీపీ నేతలెవరూ సరిగ్గా స్పందించలేదన్న ఆవేదన ఆయన అనుచరుల్లో ఉందంటారు. ఇక వ్యక్తిగతంగా కూడా కొడేల కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని, కుటుంబంలో కూడా కలతలు ఉన్నాయని అంటారు.

ఏది ఎలా ఉన్నా కొడెల పులి లాంటి వారు, మరి ఆయన్ని పిల్లిగా మార్చిన పరిస్థితులేంటి అని చూస్తే మాత్రం ఆయన రాజకీయంగా ఒంటరి అయ్యారన్న బాధ మాత్రమే కనిపిస్తుంది. ఈ కారణంగానే ఆయన జీవితం నుంచి తప్పుకోవాలని భావించారేమోనని అంటున్నారు. ఏది ఏమైన కోడెలకు రాజకీయంగా అండ కరవైన పరిస్థితులే పిల్లిని చేశాయా అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.

మళ్లీ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్..?

0

తెలుగు సినిమా రంగంలో కమెడియన్ గా దాదాపు ఇరవై సంవత్సరాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బండ్ల గణేష్. ఆ తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి డబ్బులు బాగా సంపాదించిన బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మారాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా తీసి అదిరిపోయే లాభాలు అందుకున్నాడు. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ అప్పట్లో సచిన్ జోషి తో తీసిన సినిమా విషయంలో అనేకమైన విమర్శలు రావడం తర్వాత కోర్టుల దాకా గొడవలు వెళ్లడంతో సైలెంట్ అయిపోయాడు గణేష్. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టిన పండగనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు.

ఇదే క్రమంలో ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగడం కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు బండ్ల గణేష్. తిరిగి ఇటీవల మల్లేష్ సినిమా రంగం లోకి రీ ఎంట్రీ ఇవ్వడం మూర్తం మహేష్ బాబు సినిమాతో ఫిక్స్ చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే ఒక పక్క సినిమాలు ఒప్పుకుంటుం మరోపక్క మళ్లీ ప్రొడ్యూసర్ గా బండ్ల గణేష్ మారినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ఆయన ప్రొడక్షన్ హౌస్ మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. ఓ ప్రక్క నటన, మరో ప్రక్కన నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే నాని హీరోగా ఓ సినిమా ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని డైరక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, ప్రీ ప్రొడక్షన్ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అయితే నిర్మాతగా స్టార్ డైరక్టర్స్ తో సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు కొత్తవారితో వెళ్లటం పట్ల ఇండస్ట్రీ లో చాలా మంది సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

కోడెల మరణం: చంద్రబాబును ఇరుకున పెడుతున్న ప్రశ్నలివే..?

0

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య… ఆ తదనంతర పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అంటూ ప్రతిపక్ష టీడీపీ ఈ హత్య నుంచి రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు చెబుతున్నారు. కోడెల తీవ్రమైన మనస్తాపంతో మరణించిన మాట వాస్తవమే.

వాస్తవంగానే ఎంత క్షోభకు గురిగాకపోతే ఓ ప్రాంత పులిగా ప్రసిద్ధుడైన అత్యంత సీనియర్ పోరాటశీలి అలా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణిస్తాడు..? అయితే ఆ క్షోభ జగన్ పెట్టిన కేసుల దుర్మార్గమా..? తన జీవితమంతా తెలుగుదేశానికే అంకితం చేస్తే, తనకు కష్టకాలంలో పార్టీ అండగా ఉండలేదనే చిత్తక్షోభా..? ఏది నిజమైన కారణం..? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇన్నాళ్లూ కోడెల శివప్రసాదరావు పై కేసుల విషయంలో మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంతో చాలా విషయాలు చెబుతున్నారు. 2 నెలల్లో 19 కేసులు పెట్టారు….. లక్ష కోట్లు తిన్నోడు ఆఫ్టరాల్ లక్ష, 2 లక్షల ఫర్నీచర్ కేసు పెడతాడా..?.. సోమిరెడ్డి, నన్నపనేని, చింతమనేని, యరపతినేని ఇలా అందరి మీదా కేసులు పెడుతున్నారు… 11 మంది సీఎంలను చూశాను.. ఈ ఉన్మాదాన్ని నా లైఫులో ఎప్పుడూ చూడలేదు.. రాజకీయ కక్షసాధింపులకే కోడెల బలయ్యాడు… కుటుంబాన్ని చెల్లాచెదురు చేశారు.. అంటూ బాధపడిపోతున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయి.. అవేమిటంటే..కోడెలపై కేసులపై తెగబాధపడిపోతున్న చంద్రబాబు…గతంలో జగన్ పై పెట్టిన కేసుల గురించి ఏం సమాధానం చెబుతారు. జగన్ పై పెట్టిన కేసులు వేధింపుల జాబితాలోకి రావా..? కోడెల పై జగన్ వేధింపుల కోసం కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు ఎందుకు కోడెలకు అండగా నిలవలేదు.. ఈ కేసుల గురించి ఒక్కసారి కూడా ఎందుకు మీడియా ముందు మాట్లాడలేదు.. కోడెలను ప్రభుత్వం వేధిస్తుందని గొంతెత్తలేదు…?

ఒకవేళ జగన్ సర్కారు వేధింపుల కోసం కేసులు పెట్టినా.. టైగర్ వంటి పేరున్న కోడెల ఎందుకు భయపడ్డారు. ..? పలనాటి పులిగా పేరున్న వ్యక్తి అక్రమ కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారా.. ? ఎన్టీఆర్ హయాంలో పులిగా పేరున్న వ్యక్తి చంద్రబాబు నాయకత్వం మొదలయ్యాకే తన ప్రతిష్ట కోల్పోవడం మొదలుపెట్టారంటే… అందులో చంద్రబాబు పాత్ర లేదా..? ఇలాంటి ప్రశ్నలకు చంద్రబాబు ఎప్పటికైనా సమాధానం చెబుతారా..?

కోడెలను టీడీపీ నుంచి సస్పెండ్ చేద్దామనుకున్నారా?

0

అనుమానాస్పద స్థితిలో మరణించిన కోడెల శివప్రసాద్ రావు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కోడెల మరణంపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. వారిలో కొందరు రాజకీయ ప్రస్తావన తీసుకు వస్తూ ఉన్నారు. కోడెలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని.. అందుకే ఆయన మరణించారని టీడీపీ వాదిస్తూ ఉంది. అయితే కోడెలది ఆత్మహత్యా? లేక ఆయన గుండెపోటుకు గురయ్యారా? అనేది ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. రాజకీయ నేతగా ఎన్నో ఎత్తుఫలాలు చూసిన కోడెల ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని ఉంటారని చాలా మంది నమ్మడం లేదు.

రాజకీయంగా ఓటమి గెలుపులు కోడెలకు కొత్త కాదు. వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారాయన. అలాంటిది ఇప్పుడు ఓటమి కేసులకు భయపడి ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారా? అనేది సందేహమే. ఈ అంశంపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

అయితే ఇప్పుడు మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. అదే కోడెలను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన చేశారనేది. గత కొన్నాళ్లుగా కోడెల ఎదుర్కొన్న పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి సపోర్ట్ ఇవ్వని సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. అయితే కోడెల విషయంలో మాత్రం టీడీపీ వాళ్లు స్పందించలేదు. ఆయన పేరెత్తడానికే వారు సాహసించలేదు.

అసెంబ్లీ ఫర్నీచర్ వ్యవహారంలో అయితే.. కోడెల తీరునే టీడీపీ వాళ్లు తప్పుపట్టారు కూడా! కోడెలను సస్పెండ్ చేయాలని తద్వారా గత ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నట్టుగా అవుతుందని కూడా తెలుగుదేశం వాళ్లు ఆలోచించారట! కొందరి మీద చర్యలు తీసుకోవాలని.. అప్పుడు పార్టీ ఇమేజ్ పెరుగుతుందని అందుకే కోడెల పరివారంపై చర్యలు తీసుకోవాలని మంత్రాంగం సాగిందట. అలా తెలుగుదేశం పార్టీ కోడెలకు ఎలాంటి సహకారం ఇవ్వకపోవడంతో పాటు ఆయనను పార్టీ నుంచి వదిలించుకోవాలని కూడా ఆలోచించినట్టుగా తేటతెల్లం అయ్యింది. ఆయన మరణంతో ఆ అంశం పై కూడా చర్చ మొదలైంది.

మధ్యలో ఇరుక్కుపోయిన జనసేనాని

0

అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. సొంతంగా రాజకీయాలు చేయలేడు. అలాగని బహిరంగంగా చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకోలేడు. ఇలా సగం సగం రాజకీయాలు చేస్తే జనాలు ఎటువంటి తీర్పు ఇచ్చారో మొన్నటి ఎన్నికల్లో వచ్చిన తీర్పే నిదర్శనం. అయినా పవన్ లో మార్పు రాలేదని అర్ధమైపోయింది.

జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలనపై చాలా పెద్ద పరిశోధనలే చేసి నివేదిక సిద్ధం చేసినట్లు పవన్ పెద్ద బిల్డప్ ఇచ్చారు. తీరా నివేదికలతోని అంశాలను చూస్తే దాదాపు చంద్రబాబు ఆలోచనల్లో నుండి కాపీ కొట్టినవే. ఇంతోటి నివేదిక తయారు చేయటానికి 100 రోజులు వెయిట్ చేయటమెందుకో ? తానొక్కడే చెబితే జనాలు నమ్మరన్న అనుమానంతోనే చంద్రబాబు తన మాటలనే రెండోసారి పవన్ తో కూడా చెప్పించారు.

అయితే వాళ్ళిద్దరు మరచిపోయిందేమిటంటే ఇద్దరూ కలిసినా, విడివిడిగా ఎన్నిసార్లు చెప్పినా జనాలు నమ్మరని. మొన్నటి ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా ఒకే విధమైన ఆరోపణలను, విమర్శలను చంద్రబాబు, పవన్ ఎవరికి వారే చేశారు. అయినా జనాలు ఇద్దరికీ కలిపి ఒకేసారి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా పవన్ తెలుసుకోవాల్సింది ఒకటుంది. చంద్రబాబు ఛాయ నుండి బయట పడకపోతే రాజకీయంగా తన సమాధిని తానే కట్టేసుకోవటం ఖాయం.

చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు ముగింపుదశకు వచ్చేసింది. ఇపుడు చంద్రబాబు ఆరాటమంతా తన కోసం కాదు. తన పుత్రరత్నం నారా లోకేష్ కోసమే. కానీ పవన్ అలాక్కాదు. రాజకీయంగా ఇపుడిపుడే అడుగులు వేస్తున్నారు. ఇటువంటి సమయంలోనే సొంతంగా నిర్ణయాలు తీసుకుని రాజకీయం చేయకపోతే సోదరుడు చిరంజీవి లాగే రాజకీయంగా కనుమరుగు అయిపోవటం ఖాయం.

ఇపుడు పవన్ పరిస్దితి ఎలాగైపోయిందంటే చంద్రబాబును తాను వదిలేద్దామని అనుకున్నా తనను చంద్రబాబు వదిలేలా లేడు. చంద్రబాబును నమ్ముకుని రాజకీయంగా లాభపడిన వారు ఎవ్వరూ లేరన్న విషయం చరిత్రను చూస్తే అర్ధమవుతుంది. కాబట్టి తాను ఎటువంటి రాజకీయాలు చేయాలో నిర్ణయించుకోవాల్సింది పవన్ మాత్రమే.